భారత సినీ రంగంలో మెరుస్తున్న ఎందరో తారలకు పునాది వేసింది కన్నడ చిత్ర పరిశ్రమ. కర్ణాటక మూలాలున్న చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
దీపికా పదుకొణె, యామీ గౌతమ్, రకుల్ ప్రీత్ సింగ్, శిల్పా శెట్టి, అనుష్క శెట్టి, రష్మిక మందన్న, నిత్యా మీనన్, శ్రీలీల.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే.
ఈ హీరోయిన్లలో కొందరు తమ సినీ ప్రయాణాన్ని కన్నడ ఇండస్ట్రీ నుంచే మొదలుపెట్టారు. మరికొందరికి కర్ణాటకనే సొంత రాష్ట్రం. కానీ వీళ్లందరి మూలాలు మాత్రం కన్నడవే.
దీపికా పదుకొణె సొంత రాష్ట్రం కర్ణాటక. ఆమె తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణె గురించి అందరికీ తెలిసిందే. దీపికా కూడా తన సినీ రంగ ప్రవేశం చేసింది కన్నడ ఇండస్ట్రీతోనే.
బాలీవుడ్‌లో తన నటన, అందంతో మెప్పిస్తున్న యామీ గౌతమ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఆమె మొదటి సినిమా కన్నడ చిత్రం ‘ఉల్లాస ఉత్సాహ’.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. నటిగా అరంగేట్రం చేసింది కన్నడ సినిమా ‘గిల్లి’తోనే.
బాలీవుడ్ బ్యూటీ, విశ్వసుందరి, స్టార్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా కర్ణాటకకు చెందినవారే. ఆమెది మంగళూరు. ఇప్పటికీ తన సొంత ఊరికి వస్తూ వెళ్తుంటారు.
శిల్పా శెట్టి బాలీవుడ్ నటి అయినా.. తాను మంగళూరు అమ్మాయిని అని గర్వంగా చెప్పుకుంటారు. ఏ సందర్భంలోనైనా తాను కన్నడిగ, తుళువ అని చెబుతూనే ఉంటారు.
కొడగు అందం రష్మిక మందన్న కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చి 'కర్ణాటక క్రష్' అయ్యారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మెరుస్తున్నారు. విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
దక్షిణ భారత దేశంలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన అనుష్క శెట్టి కూడా మంగళూరుకు చెందినవారే. ఆమెది పుత్తూరు. తెలుగు, తమిళంలో స్టార్ అయినా.. తన మాతృభాష కన్నడను ఆమె మర్చిపోలేదు.
మనందరికీ తెలిసిన నిత్యా మీనన్ పక్కా కన్నడ అమ్మాయి. బెంగళూరు బ్యూటీ. కన్నడ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ యాక్టర్‌గా రాణిస్తున్నారు.