Brahmamudi: నానమ్మ సహాయం కోరిన రాజ్.. చిన్న ట్రిక్ తో అత్తని దారిలోకి తెచ్చిన కావ్య!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకులు హృదయాలని గెలుచుకుంటుంది. తిన్నింటివాసాలు లెక్కపెడుతున్న ఒక పెంపుడు కూతురు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో కళ్యాణ్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనామిక. ఇప్పుడు నేను చేయడమే కానీ తను ఫోన్ చేయడం లేదు. ఆ మాత్రం అమ్మాయి మనసు అర్థం చేసుకోలేడా.. ఈ ముద్దపప్పుతో పెట్టుకుంటే లాభం లేదు నేనే ఒక అడుగు ముందుకు వేయాలి అనుకుంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న స్నాక్స్ కోసం అక్కడికి వచ్చి ఏంటి బేబీ మొఖం అలా వెలిగిపోతుంది?
ఆ అబ్బాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అవును డాడీ కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటుంది అనామిక. డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందామా అని అడుగు అని సలహా ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆమె తండ్రి. బయటికి వెళ్ళిన తర్వాత అనామిక తల్లి నువ్వు కూతురికి ఇచ్చే సలహా ఇదేనా అని భర్తని అడుగుతుంది.
మామూలుగా అయితే ఇవ్వను కానీ తను మనసు పడ్డది దుగ్గిరాల ఇంటి వారసుడిని. అక్కడికి వెళ్తే అది సుఖపడుతుంది అంటాడు అనామిక తండ్రి. మరోవైపు అప్పు కళ్యాణ్ కి ఫోన్ చేసి రేపు నాకు పని ఉంది నీకు ఖాళీయే కదా, నా తో పాటు బయటకి రావాలి అంటుంది. ఖాళీయే వస్తాను అంటాడు కళ్యాణ్. ముందులా హ్యాండ్ ఇస్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది అప్పు.
ఒకసారి జరిగిందని అస్తమానం అలా ఎందుకు జరుగుతుంది వస్తానులే అని మాట ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్. ఇంతలో అనామిక కేఫ్ కి రమ్మని మెసేజ్ పెడుతుంది. ఎందుకు అని అడుగుతాడు కళ్యాణ్. చెప్తే థ్రిల్ పోతుంది ఇది నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ అని మెసేజ్ పెడుతుంది అనామిక. వస్తాను అని మెసేజ్ పెట్టిన కళ్యాణ్ తప్పకుండా నాకు ప్రపోజ్ చేయడానికే రమ్మంటుంది అని ఆనందపడతాడు.
మరోవైపు అందరూ భోజనాలు చేస్తుంటే అపర్ణ మాత్రం విడిగా భోజనానికి కూర్చుంటుంది. అది చూసిన చిట్టి తర్వాత తరానికి ఏమని సందేశం ఇస్తున్నావు.. చిన్న గొడవ జరిగితే విడిపోమనా అని అడుగుతుంది. ఇంట్లో నా మాటకి ఎవరు విలువ ఇవ్వనప్పుడు నేను ఇంకేం చేయాలి అంటుంది అపర్ణ. మీకోసం కూడా వంట చేశాను మీరు ఇక్కడికి వచ్చి భోజనం చేయండి అని భర్తని అడుగుతుంది అపర్ణ.
నువ్వు వెళ్తే తాతయ్య బాధపడతాడు నాన్న, వెళ్ళద్దు అంటాడు రాజ్. కావాలంటే నీకోసం భోజనం మానేస్తాను కానీ ఇలా వేరుగా భోజనం నాకు ఇష్టం లేదు అంటాడు సుభాష్. సరే నేను ఒక్కదాన్నే తింటాను అని అపర్ణ అంటే ఒక నిమిషం ఆగు అని చెప్పి డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి అపర్ణ దగ్గర పెట్టి విడిపోవాలి అనుకున్నప్పుడు వంటింట్లో మాత్రమే ఎందుకు విడిపోవాలి.
ఆస్తులు పంచుకొని పూర్తిగా విడిపోండి. నువ్వే నిర్ణయం తీసుకున్న మాకు ఇష్టమైన చెప్పి అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాజ్ నానమ్మ దగ్గరికి వెళ్లి ఇల్లు ముక్కలైపోతుందేమో అని భయంగా ఉంద. అమ్మని ఎప్పుడు ఇలా చూడలేదు నువ్వే ఏదైనా చెయ్యు నానమ్మ.. ఇప్పుడు అమ్మ నేను ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేదు అంటాడు రాజ్.ఈ మాటలు అన్నీ కావ్య బయటినుంచి వింటుంది.
నేను చేసిన పని ఇంటిల్లిపాదిని బాధపెడుతుంది కాబట్టి ఈ సమస్యకి నేనే పరిష్కారం చేయాలి అనుకొని అపర్ణ దగ్గరికి వెళుతుంది. అక్కడినుంచి వెళ్ళిపోతున్న అత్తగారిని ఆపి నాకు మీ మీద చాలా గౌరవం ఉంది మీకు మీ అబ్బాయికి ఈ మధ్య మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదు అంటుంది కావ్య. ఏదైతేనేమి నువ్వు అనుకున్నదే జరుగుతుంది కదా నీ స్థానానికి ఏమీ డోకా లేదు కదా అంటూ నిష్టూరంగా అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంది అపర్ణ.
తరువాయి భాగంలో మీరు గనక ఆస్తులు పంచుకొని వేరైపోయారంటే ఈ ఇంట్లో అందరికీ నా మీద సానుభూతి పెరుగుతుంది. మీ అబ్బాయి కూడా నాదేమీ తప్పులేదు అంటున్నారు కాబట్టి ఆయన కూడా నాకు బాగా దగ్గర అయిపోతారు అంటూ చిన్న ట్రిక్ ప్లే చేస్తుంది. దెబ్బకి దారిలోకి వస్తుంది అపర్ణ. మరుసటి రోజు హాల్లో కూర్చొని కావ్య అందరికీ కాఫీ ఇచ్చావా అని కోపంగా అడుగుతుంది. ఇప్పుడే తెస్తాను అంటూ ఆనందంగా కిచెన్ లోకి వెళ్తుంది కావ్య.