Brahmamudi: రాహుల్ ని తప్పుపడుతున్న రాజ్.. చెల్లెల్ని చులకన చేసి మాట్లాడుతున్న స్వప్న?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. మోడలింగ్ పిచ్చితో ఇంటి పరువుని బజారున పెడుతున్న ఒక కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో స్వప్న బయటికి వెళ్లిపోయిన తర్వాత రుద్రాణి రాహుల్ దగ్గరికి వచ్చి పాపం పాపులారిటీ కోసం తెగ తాపత్రయపడుతుంది. నువ్వు ఇంట్లో వాళ్లకి తెలియకుండా మీడియాకి ఇంఫార్మ్ చేసి మీడియా ని ఇంటికి రప్పించే లాగా చేయు. మీ తాత మాట్లాడితే ఇంటి పరువు గురించి మాట్లాడుతాడు ఇప్పుడు ఏం చేస్తాడు చూద్దాం అంటుంది రుద్రాణి. కచ్చితంగా దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తాడు తాతయ్య అని చెప్పి మీడియాకి ఇన్ఫామ్ చేయటానికి వెళ్తాడు రాహుల్.
మరోవైపు స్వప్న కి సారె తీసుకొని బయలుదేరటానికి రెడీ అవుతారు కనకం దంపతులు. అప్పు ని కూడా రమ్మంటే మీరు వెళ్తున్నది కావ్యక్క కోసం కాదు స్వప్న కోసం. దానికోసం మీరు వెళ్ళటమే ఎక్కువ అంటుంది అప్పు. నాకు పని ఉంది మీకు ఆటోని పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పు. మరోవైపు రాజ్ ఆ వీడియోని చూసి షాక్ అవుతాడు. కావ్య కి కూడా చూపించడంతో ఆమె కూడా షాక్ అవుతుంది. ఇంత జరుగుతున్నా నీ అక్క మొగుడు ఏం చేస్తున్నాడు అనుకుంటూ కోపంగా కిందికి వస్తాడు.
అప్పటికే మీడియా వాళ్ళు ఇంటికి వచ్చి సప్న ఇంటర్వ్యూ కావాలి అని గొడవ పెడుతూ ఉంటారు. వాళ్లని అడ్డుకుంటూ ఉంటారు రాహుల్, ప్రకాష్ వాళ్ళు. రాజ్ కిందికి వచ్చి చూసేసరికి కింది జరుగుతున్న హడావుడిని చూసి షాక్ అవుతాడు. మీడియా వాళ్ళని ఆపటానికి తను కూడా ప్రయత్నిస్తాడు. ఏం జరుగుతుందో తెలియక ఇంట్లో వాళ్ళందరూ అయోమయంలో పడతారు. కావ్య మందలిస్తున్నా వినకుండా స్వప్న మీడియా వాళ్లకి ఇంటర్వ్యూ ఇవ్వటానికి వెళుతుంది.
రాజ్ చెప్పినా కూడా వినిపించుకోదు. సీతారామయ్య వచ్చి ఏం జరిగింది అని అయోమయంగా అడుగుతాడు. కళ్యాణ్ స్వప్న యాక్ట్ చేసిన యాడ్ చూపిస్తాడు. అందరూ సిగ్గుతో తలదించుకుంటారు. అప్పుడే కావ్య వాళ్ళ ఇంటికి వచ్చిన కనకం వాళ్లకి జరుగుతున్న హడావుడి ఏమిటో అర్థం కాదు. మీడియా వాళ్ళు స్వప్నని ఎంత పొట్టి బట్టలు వేసుకొని యాడ్ చేశారు కదా మీ ఇంట్లో వాళ్ళ మద్దతుతోనే చేశారా అని అడుగుతాడు. మా ఇంట్లో వాళ్ళు ఆడవాళ్లు స్వచ్ఛని హరించరు. ఎవరు స్వేచ్ఛ వాళ్లకు ఉంటుంది అని చెప్తుంది స్వప్న.
ఇంకా వాళ్ళు ఏవేవో ప్రశ్నలు అడుగుతారు స్వప్న చెప్తూ ఉంటుంది. ఇంక కావ్య ఓర్చుకోలేక స్వప్నని బలవంతంగా లోపలికి తీసుకెళ్లి పోతుంది. రాజ్ వాళ్ళు మీడియా వాళ్ళని బయటకి పంపించేస్తారు. స్వప్న లోపలికి వచ్చిన తరువాత నీ భార్య ఇంత చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావా అని రాహుల్ ని మందలిస్తాడు రాజ్. రాహుల్ కి ఏమి తెలియదు నేనే ఈ యాడ్ సంపాదించుకున్నాను. పాపులారిటీ వచ్చిన తర్వాత మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను అంటుంది స్వప్న.
అంత పొట్టి బట్టలు వేసుకోవడం పాపులారిటీ అనుకుంటున్నావా అంటూ ధాన్యలక్ష్మి వాళ్ళు మందలిస్తారు. ఇది ఉమ్మడి కుటుంబం ఇంట్లో ఇలాంటి వేషాలు వేస్తే అది మొత్తం కుటుంబం మీద పడుతుంది అని కావ్య కూడా మందలిస్తుంది. అసలు ఇదంతా పక్కన పెట్టండి కోడలు ఇంత చేస్తుంటే రుద్రాణి ఏం చేస్తున్నట్లు అని కూతుర్ని మందలిస్తుంది చిట్టి.
ఇది మరీ బాగుంది.. తనకి ఎవరన్నా గౌరవం లేదు మీతో పాటే నాకు కూడా తెలుసు. అయినా అది పిచ్చి వేషాలు వేస్తే నన్ను అంటారేంటి. ఈ సుందరాంగిని ఇంట్లోంచి బయటికి పంపించేయండి అంటుంది రుద్రాణి. మీరందరూ నా స్వేచ్ఛని కాలరాస్తున్నారు. నా పాపులారిటీని ఓర్చుకోలేకపోతున్నారు అంటూ పొగరుగా మాట్లాడుతుంది స్వప్న. ఇదంతా గుమ్మం బయట నుంచి వింటున్న దంపతులు కోపంతో రగిలిపోతారు.
కోపాన్ని భరించలేక కనుక లోపలికి వచ్చి స్వప్న మీద చెయ్యెత్తుతుంది కానీ కడుపుతో ఉంది అని జాలిపడి వదిలేస్తుంది. నువ్వు ఈ ఇంటికి ఏ పరిస్థితుల్లో వచ్చావో తెలుసా అంటూ కూతుర్ని చివాట్లు పెడుతుంది. తరువాయి భాగంలో అక్కని కోప్పడుతుంది కావ్య. నువ్వు నాకు చెప్పేదేంటి మీ అత్తకి నువ్వు అక్కర్లేదు నీ మొగుడికి నీ మీద ప్రేమ లేదు తను ఎప్పుడు నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడో తెలియదు అంటూ కావ్యని చులకన చేసి మాట్లాడుతుంది స్వప్న.