Brahmamudi: అపర్ణ ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న కుటుంబ సభ్యులు.. రుద్రాణి కుట్ర కు బలైన కావ్య కుటుంబం!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కోడలు మీద కక్ష సాధించాలని చూస్తున్న ఒక అత్త కథ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం!
ఎపిసోడ్ ప్రారంభంలో మీరు వేరు కుంపటి పెడితే మీ కుటుంబానికి మీరే దూరం అవుతారు. ఇంట్లో వాళ్ళందరి సానుభూతి నాకు దక్కుతుంది. మీ అబ్బాయి కూడా నాకు దగ్గర అయిపోతారు ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరుసటి రోజు పొద్దున్న కావ్య తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అంతలో అక్కడికి అపర్ణ వస్తుంది.
అక్కడ పెద్ద గొడవ జరిగిపోతుంది, ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంది రుద్రాణి. కానీ కోడల్ని కాఫీ తీసుకు రమ్మంటుంది అపర్ణ. అపర్ణ ప్రవర్తనకి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఏంటి వదిన నువ్వు కావ్యని అప్పుడే క్షమించేసావా.. అయినా నువ్వు ఎందుకు కోడలు దగ్గర తగ్గాలి. నువ్వు ఇలా తగ్గుతూ పోతే రేపు ఇంట్లో పెత్తనం వెలగబడుతుంది నీ కోడలు అంటూ రెచ్చగొడుతుంది రుద్రాణి.
ఇంట్లో గొడవలు పెట్టొద్దు అంటూ మందలిస్తుంది చిట్టి. నలుగురు కలిసి ఉంటే రుద్రాణికి నచ్చదు. ఎప్పుడూ ఎవరో ఒకరు కొట్టుకుంటే రుద్రాణి కడుపు చల్లగా ఉంటుంది అంటుంది ధాన్యలక్ష్మి. అయినా ఇవేవీ పట్టించుకోని అపర్ణ టిఫిన్ ఏం చేశావు అని కోడల్ని అడుగుతుంది. ఇడ్లీ అంటుంది కావ్య. టిఫిన్ చేసేముందు నన్ను అడగాలని తెలియదా నువ్వు ఏది పెడితే తినాలా.. నాకు దోస కావాలి అంటుంది అపర్ణ.
చేస్తాను అంటుంది కావ్య. ఇప్పటికిప్పుడు దోస అంటే కష్టమేమో నేను హెల్ప్ చేయనా అంటుంది చిట్టి. వద్దు అమ్మమ్మ గారు, అత్తయ్య నాతో మాట్లాడుతుంది. ఈ ఆనందం ముందు ఇది చాలా చిన్న విషయం అంటూ దోస చేయటానికి వెళ్ళిపోతుంది కావ్య. కావ్య ప్రవర్తనకి ఇంట్లో అందరూ ఆనందపడతారు. తన వల్లే ఇల్లు ఈరోజు ఇలా ఉంది లేదంటే ఈపాటికి ఇల్లు ముక్కలు అయిపోయేది అంటాడు సీతారామయ్య.
అదే సమయంలో రాజ్ ఇంట్లోకి వస్తుంటే అపర్ణ అతనితో ప్రేమగా మాట్లాడుతుంది. ఆశ్చర్యపోయిన రాజ్ బాగా ఎమోషనల్ అవుతాడు. అమ్మ నాతో మాట్లాడింది అంటూ తెగ హడావిడి చేస్తాడు. అప్పుడు ధాన్యలక్ష్మి అమ్మ నీతో మాట్లాడ లేదు, నీతో మాట్లాడేలా చేసింది కావ్య అంటూ రాత్రి జరిగిందంతా చెప్తుంది. నువ్వు కృతజ్ఞత చెప్పాల్సింది తనకే అంటుంది. అప్పుడు కావ్య దగ్గరికి వెళ్లిన రాజ్ ఆనందంగా ఆమెని ఎత్తుకొని తిప్పుతాడు.
ఏమైంది ఎందుకంత ఎక్సైట్మెంట్ అని అడుగుతుంది కావ్య. మా అమ్మ నాతో మాట్లాడింది దానికి కారణం నువ్వే అని తెలిసి కాస్త ఎక్సైట్ అయ్యాను సారీ అంటూ భార్యని కిందకి దింపేస్తాడు రాజ్. మీ అమ్మగారు నాతో కూడా మాట్లాడారు, అయినా నేను ఇంత హడావిడి చేస్తున్నానా.. అయినా నాకు ఒక విషయం అర్థం కావడం లేదు మిమ్మల్ని క్షమించారంటే మీరు కొడుకు కాబట్టి క్షమించారు.
నన్ను ఎందుకు క్షమించి నాతో మాట్లాడుతున్నారు అని అనుమానంగా అడుగుతుంది కావ్య. మా అమ్మని అనుమానించకు తను దేవత అంటూ తల్లిని వెనకేసుకొస్తాడు రాజ్. ఈరోజు నువ్వు చేసిన సాయానికి నేను కూడా ఎప్పుడో ఒక రోజు తిరిగి సాయం చేస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో అపర్ణ రుద్రాణి తో మాట్లాడుతూ నేను తనని క్షమించేసాను అనుకుంటుంది.
కానీ తనకి పెద్ద శిక్ష వేశాను. పనిమనిషిని సంవత్సరం శాలరీ అడ్వాన్స్ ఇచ్చి మాన్పించేసాను. ఇప్పుడు ఇంట్లో పని అంతా తను ఒక్కతే చేయాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇది పెద్ద శిక్షా అనుకుంటుంది రుద్రాణి. కావ్యకి తన శిక్ష వేయాలి అనుకుంటుంది. మరోవైపు కూతురు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కృష్ణమూర్తి. కావ్యకి ఫోన్ చేస్తే లైన్ కలవడం లేదు. రేపటితో కాంట్రాక్ట్ పూర్తయిపోతుంది.
ఈరోజు ఎలాగైనా పని మొత్తం కంప్లీట్ చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. టెన్షన్ పడకు అక్క వచ్చేస్తుందిలే అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది అప్పు. నేను బొమ్మలు దగ్గర ఉంటాను కావ్య అని వస్తే అక్కడికి వచ్చేయమని చెప్పు అని భార్యకి చెప్పి షాప్ దగ్గరికి వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి. తరువాయి భాగంలో తాతయ్య దగ్గర ఆశీర్వచనం తీసుకుంటుంది కావ్య. ఎందుకు అని అడుగుతారు ఇంట్లో వాళ్ళు. ఈరోజుతో కాంట్రాక్ట్ పూర్తయిపోతుంది.
అప్పులన్నీ తీరిపోయి నాన్న ఇల్లు సొంతమైపోతుంది అని ఆనందపడుతుంది కావ్య. ఇది విన్న రుద్రాణి రాహుల్ కి ఫోన్ చేసి వినాయకుని బొమ్మలు అన్ని మాయం చేసేయమంటుంది. రాహుల్ కృష్ణమూర్తి బొమ్మల దుకాణం దగ్గర బొమ్మల్ని ఎత్తుకొచ్చేయమని రౌడీల్ని పంపిస్తాడు. అప్పుడు రౌడీలకి కృష్ణమూర్తికి జరిగిన గొడవలో కృష్ణమూర్తి బాగా దెబ్బలు తిని కింద పడిపోతాడు.