Brahmamudi: అనామిక ప్రవర్తనకి షాక్ లో రాజ్ కుటుంబ సభ్యులు.. కొడుకుని, కోడల్ని విడదీస్తున్న అపర్ణ!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. కొడుకు ప్రవర్తన ని అర్థం చేసుకోలేకపోతున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో గొడవ జరుగుతూ ఉంటే ఒకడు వచ్చి అప్పుని వెనకనుంచి కొట్టబోతాడు. అది గమనించిన కళ్యాణ్ అప్పు కి అడ్డుగా వెళ్ళటంతో ఆ దెబ్బ అతనికి తగులుతుంది. ఇంతలో పోలీస్ సైరన్ విని అక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోతారు. గొడవలోకి ఎందుకు వచ్చావు అంటూ కళ్యాణ్ ని మందలిస్తుంది అప్పు. ఆ తర్వాత తన ఫ్రెండు బైక్ పై కళ్యాణ్ ని అక్కడ నుంచి తీసుకువెళ్తుంది.
మరోవైపు సీతారామయ్య దగ్గరికి వెళ్లి మిమ్మల్ని అమెరికా తీసుకువెళ్తాము. అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది డాక్టర్లు కూడా మనవాళ్లే అని చెప్తారు సుభాష్, రాజ్. కానీ అందుకు సీతారామయ్య ఒప్పుకోడు. నా ప్రాణం నా సొంత గడ్డమీద నా సొంత ఇంట్లోనే పోవాలి అంటాడు. ఇంతలో చిట్టి వచ్చి ఇది మాట్లాడుకునే సమయం కాదు, ఆయన రెస్ట్ తీసుకునే సమయం.
కావాలంటే తర్వాత రండి అని చెప్పి కొడుకుని మనవడిని అక్కడ నుంచి పంపించేస్తుంది. బయటికి వచ్చిన సుభాష్ నాన్న మన మాట వినేటట్లుగా లేరు అందుకే డాక్టర్లనే ఇక్కడికే రప్పిద్దాము అంటాడు. ఆ ఏర్పాట్లు ఎప్పుడో చేశాను అంటాడు రాజ్. సరే డాక్యుమెంట్లు ఎవరికంటా పడనివ్వకు అని చెప్తాడు సుభాష్. లేదు డాడ్ నా ఆఫీస్ లో నా ఛాంబర్ లోనే ఉన్నాయి. ఎమర్జెన్సీ కోసం నా ఫోన్లో కూడా పెట్టుకున్నాను.
నా ఫోన్ ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదు అంటాడు రాజ్. మరోవైపు అప్పు కల్యాణ్ ని ఇంటికి తీసుకువచ్చి కంగారుపడుతూ కట్టు కడుతూ ఉంటుంది. ఆమె ప్రవర్తనకి మళ్లీ ఆశ్చర్య పోతుంది అన్నపూర్ణమ్మ. ఇంతలో అనామిక ఫోన్ చేయడంతో ఆ ఫోన్ అప్పు తీసుకొని మీ అభిమాని కి తలకు దెబ్బ తగిలింది, ఇప్పుడు మాట్లాడే సమయం లేదు అని కనీసం వివరాలు కూడా చెప్పకుండా ఫోన్ పెట్టేస్తుంది.
అలా చేసావ్ ఏంటి అంటాడు కళ్యాణ్. ఇది ఏం మాట్లాడుకునే సమయమా.. ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్తుంది అప్పు. మళ్లీ తనే ఇంటికి వెళ్లి ఏం చెప్తావో ఏంటో అంటుంది. నీ పేరు ఎందుకు తీసుకు వస్తాను, నాకు తెలుసు కదా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఆ తర్వాత ఏంటి ఈ మధ్య నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. నాకేమీ అర్థం కావడం లేదు అని అప్పుతో చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది అన్నపూర్ణ.
తన ప్రవర్తనలో మార్పు వస్తుందా అని తనలో తనే అనుకుంటుంది అప్పు. మరోవైపు రాజ్ కి ఫోన్ వస్తుంది. రాజ్ అక్కడ లేకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేయాలనుకుంటుంది కావ్య. ఇంతలోనే రాజ్ వచ్చి నా ఫోన్ ముట్టుకుంటావా అంటూ ఆమె మీద కోప్పడతాడు. కావ్య మీరు మారతానన్నారు, ఇదేనా మారటం అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ఎంత ఇంప్రెస్ చేద్దామనుకున్నా ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు తనని ఎలాగైనా కూల్ చేయాలి అనుకొని ఆమెతోపాటు బయటికి వచ్చి ఆమె చీర పట్టుకుంటాడు. హల్లో అందరూ వాళ్ళిద్దర్నీ చూస్తూ ఉండడాన్ని గమనించి సిగ్గు పడిపోతాడు. ఇంతలోనే కళ్యాణ్ కట్టుతో ఇంటికి వచ్చేసరికి అందరూ కంగారు పడతారు. ఏం జరిగింది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు.
చిన్న దెబ్బ తగిలింది ఏం జరగలేదు అని కళ్యాణ్ చెప్తూ ఉండగానే అక్కడికి అనమికా కంగారుగా వచ్చి ఏం జరిగింది, నాకు చెప్పాలి కదా అంటూ అధికారికంగా మాట్లాడుతుంది. చుట్టూ అందరు ఉన్నారని విషయం కూడా మర్చిపోతుంది. కళ్యాణ్ కంగారుగా అందర్నీ చూస్తూ ఉంటే నేను నీతో మాట్లాడుతుంటే నువ్వేంటి చుట్టూ చూస్తావ్ అంటుంది అనామిక.
చుట్టూ మేము ఉన్నాం కాబట్టి అంటుంది చిట్టి. అప్పుడు అక్కడ ఉన్న అందర్నీ గమనించి సిగ్గు పడిపోతుంది అనామిక. అందరికీ సారీ చెప్తుంది. ఇదంతా జరుగుతున్న సమయంలో కావ్యతో ఏదో చెప్పాలని తన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు రాజ్. అది గమనించిన అపర్ణ కోపంతో రగిలిపోతుంది. కళ్ళతోనే కొడుకు పక్క నుంచి పక్కకు తప్పుకోమన్నట్లుగా కోపంగా కోడలికి సైగ చేస్తుంది.
కావ్య నెమ్మదిగా భర్త పక్కనుంచి తప్పుకుంటుంది. కళ్యాణ్ ఇంట్లో అందరికీ అనామికని పరిచయం చేస్తాడు. అనామిక తన రూమ్ చూపించమనటంతో తన రూమ్ కి తీసుకు వెళ్తాడు కళ్యాణ్. మీరు వెళ్ళండి ఈ లోపు నేను స్వీట్ చేసి తీసుకు వస్తాను అంటుంది కావ్య. గదిలోకి వెళ్లిన కళ్యాణ్ అనామిక మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కళ్యాణ్ పిల్లో కింద తన ఫోటో ఉండడం గమనిస్తుంది అనామిక.
తరువాయి భాగంలో కావ్య ని ఇంప్రెస్ చేయడం కోసం ఆమెకి స్వీట్ చేయడంలో సహాయపడతాడు రాజ్. అయితే ఆ స్వీట్ లో పంచదారకి బదులు ఉప్పు వేసేస్తాడు. కావ్య కూడా గమనించకపోవడంతో ఆ స్వీట్ తీసుకువెళ్లి అందరికీ ఇస్తుంది. అది తిని అందరూ ఇబ్బందిగా మొహం పెడతారు. ఏం జరిగింది అంటుంది కావ్య. స్వీట్ లో ఉప్పు ఎక్కువ అయింది అంటారు అందరూ ఒకేసారి.