- Home
- Entertainment
- Brahmamudi: స్వప్న ప్రవర్తనకి షాకైన దుగ్గిరాల కుటుంబం.. నిజం తెలుసంటూ భార్యకి షాకిచ్చిన రాజ్!
Brahmamudi: స్వప్న ప్రవర్తనకి షాకైన దుగ్గిరాల కుటుంబం.. నిజం తెలుసంటూ భార్యకి షాకిచ్చిన రాజ్!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. డబ్బున్న ఇంటికి కోడలై అధికారం చెలాయిస్తున్న ఒక పేదింటి ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రాహుల్ దగ్గరికి వచ్చిన రుద్రాణి కోపంతో ఊగిపోతూ అసలు ఆ కావ్యని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది కానీ వదినకి పోటీగా ఉంటుందని కోరుకున్నాను అలాంటిది ఆ ఇంటి ఆడపిల్లని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు అంటూ కేకలు వేస్తుంది. ఇలా జరుగుతుందనుకో లేదమ్మా అసలు ఆ కామరాజు అడ్రస్ రాజ్ వాళ్ళకి ఎలా దొరికిందో అర్థం కావడం లేదు అంటాడు రాహుల్.
ఏదైతేనేమి ఇప్పుడు ఆ స్వప్నని ఇంట్లోంచి బయటికి పంపించే ఏర్పాటు చేయు ఉంటుంది రుద్రాణి. అది అంత సులువైన పని కాదు ఇప్పటికే అందరూ నేను తప్పు చేశాను అని నమ్ముతున్నారు. ఇప్పుడు మనం ఏం చేసినా తిరిగి మన మీదకే వస్తుంది అందుకే కాస్త నువ్వు ఏం తీసుకుని ఏం చేయాలో ఆలోచిద్దాం అంటాడు రాహుల్. మరోవైపు లేటుగా నిద్రలేచిన స్వప్న మొత్తానికి అనుకున్నట్లుగా దుగ్గిరాల ఇంటి కోడల్ని అయిపోయాను.
ఇకనుంచి ఆ కృష్ణమూర్తి, కనకం ల పేద అరుపులు నాకు వినపడవు అనుకుంటుంది. బెడ్ కాఫీ తాగటం కోసం నైట్ డ్రెస్ తోనే కిందికి వచ్చేస్తుంది. వస్తూనే సుభాష్ పేపరు చదువుతూ ఉంటే అతని దగ్గర పేపర్ లాక్కుని తను పేపర్ చదువుతుంది స్వప్న. ఆమె ప్రవర్తనకి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. స్నానం చేసి పద్ధతిగా కిందకి దిగడం మానేసి అలా వచ్చేసావేంటి అని మందలిస్తుంది చిట్టి.
అలాంటివన్నీ నాకు అలవాటు లేదు మా ఇంట్లో నేను లేవటమే 11 కి లెగుస్తాను అంటుంది స్వప్న. కావ్య కూడా మీ ఇంటి నుంచే వచ్చింది అంటుంది ధాన్యలక్ష్మి. తను ఈ కాలంలో కొట్టవలసింది కాదు అని పొగరుగా సమాధానం ఇస్తుంది స్వప్న. ఆ చెల్లెలికి ఈ అక్కకి ఎంత తేడా అని తమ్ముడితో చెప్తాడు సుభాష్. ఈ లోపు కావ్య వచ్చి ఇలా వచ్చేసావేంటి వెళ్లి స్నానం చేసి రా అని చెప్తుంది.
అలా మాట్లాడతావేంటి నేను బెడ్ కాఫీ తాగకుండా ఏ పని చేయనని తెలుసు కదా పెళ్లి కాపీ పెట్టరా అని పొగరుగా మాట్లాడుతుంది స్వప్న. అరవకు అని చెప్పి కాఫీ తేవటానికి వెళ్తుంది కావ్య. తను మాట్లాడుతుంటే అచ్చం రుద్రాణి మాట్లాడినట్లుగా ఉంది అంటాడు సుభాష్. నడ మంత్రపు సిరి కదా అన్నయ్య అంటాడు ప్రకాష్. కావ్య కాఫీ తీసుకువస్తే వెళ్లి స్ట్రాంగ్ గా కాఫీ కలుపుకొని డాబా మీదకి తీసుకురా అని చెప్పి పొగరుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. ఇది ఇలాగే ప్రవర్తిస్తే నాలుగు రోజుల్లో అందరూ కలిపి దీన్ని బయటకు వెళ్లగొడతారు దరిద్రం వదిలిపోతుంది అని మనసులో అనుకుంటాడు రాహుల్.
మరోవైపు సేటు కనకానికి ఫోన్ చేసి నాకు అర్జెంటుగా అసలు కట్టు అని అడుగుతాడు. కంగారు పడిన కనకం ఇది అన్యాయం అగ్రిమెంట్ ప్రకారం అసలు కట్టడానికి ఇంకా చాలా టైం ఉంది అంటుంది. అదంతా నాకు తెలియదు నువ్వు అసలు కట్టలేవనే ఉద్దేశంతోనే నీకు అప్పిచ్చాను అంతేకానీ నువ్వు ఇచ్చే వడ్డీ కోసం కాదు అంటూ తన కుళ్ళు ఆలోచన బయటపడతాడు సేటు. రెండు రోజుల్లో డబ్బు ఇస్తే సరే సరే లేదంటే కృష్ణమూర్తి గారికి జరిగిందంతా చెప్పి ఆ ఇల్లు నేను ఆక్రమించుకుంటాను అని బెదిరించి ఫోన్ పెట్టేస్తాడు సేటు.
కంగారుపడిన కనకం ఎప్పటిలాగే మీనాక్షి సహాయం కోసం వెళ్తుంది. మరోవైపు కాఫీ తీసుకువచ్చిన కావ్య స్వప్నతో పెద్దవాళ్లతో అలాగేనా ప్రవర్తించేది ఇదేమి మన పుట్టిల్లు కాదు అని మందలిస్తుంది. నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు అని పొగరుగా మాట్లాడుతుంది స్వప్న. కనీసం కడుపుతో ఉన్న ఆడవాళ్లు ఎలా ప్రవర్తిస్తారు అదైనా తెలుసుకో లేదంటే నిజం తెలిస్తే నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు అని చెప్పి బయటకు వచ్చేస్తుంది కావ్య. ఎదురుగా ఉన్న రాజ్ ని చూసి షాక్ అవుతుంది. నేను అక్కతో మాట్లాడిందంతా వినేశారా అని కంగారు పడుతుంది.
ఏదో చెప్పటం కోసం రాజ్ తో మాట్లాడబోతే కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్. నా మాటలు విన్నారా.. వినలేదా అనుకుంటూ టెన్షన్ పడుతుంది కావ్య. మరోవైపు మీనాక్షిని సేటు ఇంటికి తీసుకువచ్చి మీనాక్షిని రెచ్చగొట్టి సేటు దగ్గరికి పంపించి ఇంటి పత్రాలు తీసుకొని సేటుతో పాటు మన ఇంటికి వచ్చేయ్ అని చెప్పి కామ్ గా తన ఇంటికి వెళ్ళిపోతుంది కనకం. చెల్లెలి మాటలకి రెచ్చిపోయిన మీనాక్షి మీ డబ్బు కట్టడానికి కనకం రెడీగా ఉంది ఇంటి పత్రాలు తీసుకొని నాతో రండి అని చెప్తుంది.
తనకు ఎక్కడిది అంత డబ్బు అని అడుగుతాడు సేటు. అదేంటి తన ఇద్దరు కూతుర్లు దుగ్గిరాల ఇంటి కోడళ్ళు మర్చిపోయావా అంటుంది మీనాక్షి. తన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు బాధపడుతూ ఇంటి పత్రాలు తీసుకొని మీనాక్షి వెనక వెళ్తాడు సేటు. తరువాయి భాగంలో భర్తకి నిజం చెప్పటానికి ప్రయత్నిస్తుంది కావ్య. అదంతా నాకు ముందే తెలుసు అంటాడు రాజ్. నేను అక్క తో మాట్లాడినప్పుడు వినేసాడా అని కంగారు పడిపోతుంది కావ్య.