- Home
- Entertainment
- Brahmamudi: కళ్యాణ్ మార్పు కోసం ఆరాటపడుతున్న అప్పు.. అడ్డంగా దొరికిపోయి టెన్షన్ పడుతున్న స్వప్న?
Brahmamudi: కళ్యాణ్ మార్పు కోసం ఆరాటపడుతున్న అప్పు.. అడ్డంగా దొరికిపోయి టెన్షన్ పడుతున్న స్వప్న?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. ఒకే ఇంట్లోకి కోడలుగా వచ్చిన రెండు భిన్న మనస్తత్వాలు కల ఇద్దరు అక్కచెల్లెళ్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కళ్యాణ్ మీదికి ఎటాక్ చేయబోతున్న రౌడీలని చితక్కొడుతుంది అప్పు. వాళ్లు పారిపోయిన తర్వాత వాళ్లు నీ మీద అటాక్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావేంటి నీకు సిగ్గు అనిపించడం లేదా రేపు పెళ్లి అయ్యాక కూడా ఇలాగే ఉంటే నీ పెళ్ళాం నిన్ను ఒక ఆట ఆడిస్తుంది అప్పు. ఏం చేయటం నేను మా వాళ్ళ మధ్యలో సున్నితంగా పెరిగాను నువ్వు గల్లీలో స్ట్రాంగ్ గా పెరిగావు అంటాడు కళ్యాణ్.
అందుకే నిన్ను కూడా నా లెక్కనే తయారు చేస్తాను రేపటి నుంచి గ్రౌండ్కి వచ్చేయ్ అంటుంది అప్పు. సరే అంటాడు కళ్యాణ్. సీన్ కట్ చేస్తే తననే దొంగలాగా చూస్తూ వస్తున్న కావ్యని ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. దొంగ పనులు చేసే వాళ్ళని దొంగలా చూడకపోతే మరి ఎలా చూడాలి అంటుంది కావ్య. నేనేం దొంగను కాదు అంటాడు రాజ్. మరి దొంగ చాటుగా వెనకనుంచి ఏం తీసుకువచ్చారు అంటుంది కావ్య.
నా మంచితనం అంటూ తను తీసుకొచ్చిన మూటని ఓపెన్ చేస్తాడు రాజ్. అందులో పరుపు ఉండడాన్ని చూసి షాక్ అవుతుంది కావ్య. నాకోసం తీసుకువచ్చారా అంటూ ఆనందపడుతుంది. కింద పడుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తాయని నేను కింద పడుకున్నాకే తెలిసింది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. భర్త చేసిన పనికి సంతోషిస్తుంది కావ్య.
మరోవైపు మూటలో కట్టిన సేటుని మళ్లీ స్టోర్ రూమ్ లోకి తీసుకు వస్తారు కనకం, మీనాక్షి. మూటలో నుంచి బయటికి వచ్చిన సేటు తన మీద కూర్చున్న మీనాక్షిని క్వింటాలు బరువున్నావు అంటూ తిడతాడు. పిచ్చి వెధవ అవకాశం వచ్చిన రక్షించండి అని అరవటం మానేసి నన్ను తిడుతున్నాడు అంటుంది మీనాక్షి. అవును కదా అంటూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తాడు సేటు.
లేనిపోని ఐడియాలు ఇస్తున్నావు అంటూ మీనాక్షి ని తిట్టి సేటుకి మత్తుమందు ఇచ్చి స్పృహ తప్పేలాగా చేస్తుంది కనకం. నువ్వు బాగా ప్రొఫెషనల్ గా తయారయ్యావు అంటుంది మీనాక్షి. ఇంతలో అప్పు రావడంతో కంగారు పడి బయటకు వెళ్తుంది కనకం. నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని పెరుగు తీసుకురమ్మని తనని బయటికి పంపిస్తుంది.
తిరిగి స్టోర్ రూమ్ కి వెళ్ళేసరికి మత్తుమందు రుమాలు వాసన పీల్చి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది మీనాక్షి. వదిలేలాగా చేసి బయటకు తీసుకు వస్తుంది కనకం. సీన్ కట్ చేస్తే రాహుల్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది స్వప్న. ఎలా అయినా రాహుల్ ని తనువైపు తిప్పుకొని నిజం చేయాలి అనుకుంటుంది. మరోవైపు వాష్ రూమ్ నుంచి బయటికి వచ్చేసరికి మల్లెపూలతో థాంక్స్ అని రాసిపెడుతుంది కావ్య.
నాకు ఇలాంటివి నచ్చవు, అయినా నేనేమీ నీ మీద ప్రేమతో తీసుకురాలేదు అని చెప్పి పూలని పక్కకు తోసేస్తాడు రాజ్. మీరు చెప్పకపోయినా ఇది ప్రేమే అంటుంది కావ్య. ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందం అంటాడు రాజ్. సీన్ కట్ చేస్తే 11 దాటిన రాహుల్ రాకపోవడంతో అతనికి ఫోన్ చేస్తుంది. ఒకసారి ఫోన్ బిజీ వస్తుంది తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుంది. కోపంతో రగిలిపోయిన స్వప్న బయటికి వెళ్లి కాలింగ్ బెల్ కొడుతుంది.ఏం జరిగిందా అనుకొని అందరూ బయటకు వస్తారు.
ఇంత టైం అయినా రాహుల్ ఇంకా ఇంటికి రాలేదు నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అంటుంది స్వప్న. మగాడు అన్నాక చాలా పనులు ఉంటాయి అని కొడుకుని వెనకేసుకొస్తుంది రుద్రాణి. మా ఆయనకి మా మరిది గారికి నా కొడుక్కి పనులు లేవా అంటుంది అపర్ణ. నన్ను వదిలించుకుందామనుకున్నా నేను పట్టు పట్టి పెళ్లి చేసుకోవడంతో నన్ను మా అత్తగారు, నా భర్త ఒక వస్తువుని చూసినట్లే చూస్తున్నారు అంటూ సీతారామయ్యకి తను బాధని చెప్పుకుంటుంది స్వప్న.
తరువాయి భాగంలో పప్పాయి తింటున్న స్వప్నను చూసి అందరూ షాక్ అవుతారు. అది గమనించిన కావ్య వచ్చి ఇవి తింటే కడుపు పోతుంది ఆ మాత్రం తెలియదా అంటుంది. అప్పుడు తను చేసిన తప్పు గ్రహిస్తుంది స్వప్న. సీతారామయ్య డాక్టర్ కి ఫోన్ చేయమనడంతో నిజం బయటపడిపోతుందేమో అని టెన్షన్ పడతారు స్వప్న కావ్య.