ఆమె అవసరానికి వాడుకునే రకం, రతిక సింపతీ గేమ్ మొత్తం ఫేక్.. మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 గత సీజన్స్ తో పోల్చుకుంటే పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఏం చేయబోతున్నారో ఎలా ఆడబోతున్నారో ముందే పసిగట్టేస్తున్నారు.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 గత సీజన్స్ తో పోల్చుకుంటే పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఏం చేయబోతున్నారో ఎలా ఆడబోతున్నారో ముందే పసిగట్టేస్తున్నారు. ఎందుకంటే గత ఆరు సీజన్లలో జరుగుతోంది ఇదే. భిన్నంగా అయితే కాస్త కూడా లేదు అనే ఫీలింగ్ ఆడియన్స్ లో ఉంది.
కొన్ని రూల్స్ మార్చినంత మాత్రాన డిఫెరెంట్ గేమ్ అనే ఫీలింగ్ రావడం లేదు. పాత తరహా చాడీలు, రొట్టగా అనిపించే గేమ్ ప్లాన్స్ తో విసుగు తెప్పిస్తున్నారు అంటూ ఆడియన్స్ రియాక్షన్ ఉంది. అయితే హౌస్ లో కొందరు కంటెస్టెంట్స్ మాత్రం ప్రేక్షకుల అటెన్షన్ పొందండంలో సక్సెస్ అయ్యారు. వారిలో గ్లామర్ బ్యూటీ రతిక రోజ్ ఒకరు.
ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 7లో ఎక్కువగా కెమెరా అటెన్షన్ పొందింది రతిక మాత్రమే. అయితే రతికని ఫాలో అయ్యే వాళ్ళు విమర్శించే వాళ్ళు ఉన్నారు. తాజాగా రతిక హౌస్ లో గేమ్ ఫ్లాన్స్ పై ఆమె మాజీ ప్రియుడు, ఆస్కార్ స్టేజి పై పెర్ఫామ్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రతిక పేరెత్తకుండా తీవ్ర ఆరోపణలు చేశాడు. రతిక బిగ్ బాస్ 7 హౌస్ లో రాహుల్ గగురించి పరోక్షంగా ప్రస్తావించింది. నా మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ తనని టార్గెట్ చేస్తున్నారు అని రతిక శివాజీ వద్ద ఎమోషనల్ అయింది. దీనితో శివాజీ ఆమెపై సింపతీ చూపించారు. అంటే రతిక సింపతీ గేమ్ వర్కౌట్ అవుతుందనే అందరూ అంటున్నారు.
దీనితో రాహుల్ సిప్లిగంజ్ రతికని టార్గెట్ చేస్తూ ఆమె పేరు ఎత్తకుండా దుమ్మెత్తి పోసాడు. 'ఈ ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటి వరకు ? అందరూ తమ సొంత ట్యాలెంట్ ని నమ్ముకుని ఎదగాలనుకుంటారు. కానీ కొందరు పక్కన వాళ్ళ పేరు ట్యాలెంట్ ఉపయోగించుకుని ఎదిగే ప్రయత్నం చేస్తారు.
కొందరు ఫేమ్ కోసం పక్క వాళ్ళ పేరుని అవసరానికన్నా ఎక్కువ వాడుకుంటున్నారు. లోపలున్న వ్యక్తికి కంగ్రాట్స్ అంటూ రాహుల్ సిప్లిగంజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రతిక మొదటి వారంలో పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా మూవీ అయింది. హౌస్ లో ఎలాంటి గొడవ వచ్చినా మొదట వినిపించే గొంతు రతికదే.