MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా తమ్ముడి చావుకు కారణం అదే, బ్యాన్ చేయండి..అత్యంత విషాదంలో సీఎంకి కమెడియన్ రిక్వస్ట్

నా తమ్ముడి చావుకు కారణం అదే, బ్యాన్ చేయండి..అత్యంత విషాదంలో సీఎంకి కమెడియన్ రిక్వస్ట్

ఆర్ఆర్ఆర్ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ కుటుంబంలో అత్యంత విషాదం చోటు చేసుకుంది. రాహుల్ రామకృష్ణ తన తమ్ముడిని కోల్పోయారు. వ్యవసాయంలో ఉపయోగించే ఒక రసాయనం వల్ల తన సోదరుడు మరణించాడు అని రాహుల్ తెలిపారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 28 2026, 09:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినీ నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మృతి
Image Credit : Asianet News

సినీ నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మృతి

తెలుగు సినీ నటుడు రాహుల్ రామకృష్ణ తన కుటుంబంలో చోటుచేసుకున్న విషాద ఘటనతో తీవ్రంగా మానసిక వేదనకు గురయ్యారు. పారా క్వాట్ అనే ప్రమాదకర రసాయనంతో విషప్రయోగం జరగడంతో ఆయన సోదరుడు గురువారం మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన రాహుల్ రామకృష్ణ, ఈ హెర్బిసైడ్ వినియోగంపై కఠిన నియంత్రణలు విధించాలని ప్రభుత్వాన్ని కోరారు.

25
గడ్డి మందు
Image Credit : Asianet News

గడ్డి మందు

పారా క్వాట్ అనేది కలుపు మొక్కలను నియంత్రించేందుకు ఉపయోగించే అత్యంత విషపూరిత హెర్బిసైడ్‌గా గుర్తించబడింది. దీనిని రైతులు వ్యవసాయంలో గడ్డి మందు అని పిలుస్తూ ఉంటారు. ఈ రసాయనం ప్రాణాంతకంగా మారే అవకాశాలు అధికంగా ఉండటంతో, దీని వినియోగంపై ఇప్పటికే పలువురు వైద్యులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడి మరణం తర్వాత రాహుల్ రామకృష్ణ ఈ అంశాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ప్రజల్లో చర్చకు దారితీశారు.

Related Articles

Related image1
బాలకృష్ణ భార్యకి బాగా ఇష్టమైన మూవీ.. సినిమా ఫ్లాప్ అయినా డైరెక్టర్ ని పిలిచి మరీ థ్యాంక్స్ చెప్పిన వసుంధర
Related image2
చిరంజీవి సినిమా నాకు శాపం.. కమెడియన్ కామెంట్స్, స్టార్ హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చినా అతడి పరిస్థితి ఇదే
35
వెంటనే దీనిని నిషేధించి ప్రాణాలను కాపాడండి
Image Credit : Asianet News

వెంటనే దీనిని నిషేధించి ప్రాణాలను కాపాడండి

ఎక్స్‌లో రాహుల్ రామకృష్ణ చేసిన పోస్టులో, “ఈ రోజు నా సోదరుడిని పారా క్వాట్ విషప్రయోగంతో కోల్పోయాను. ఇది చాలా ప్రమాదకరం, స్వయంహానికీ విస్తృతంగా దుర్వినియోగం అవుతోంది. ఇది ఎంత సులభంగా అందుబాటులో ఉందో ఆశ్చర్యంగా ఉంది. కేసుల సంఖ్య పెరగడంతో వైద్యులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వెంటనే దీనిని నిషేధించి ప్రాణాలను కాపాడండి” అని పేర్కొన్నారు. ఈ పోస్టులో ఆయన ప్రధానమంత్రి కార్యాలయం, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ట్యాగ్ చేశారు.

45
రాహుల్ రామకృష్ణ విజ్ఞప్తి
Image Credit : Asianet News

రాహుల్ రామకృష్ణ విజ్ఞప్తి

రాహుల్ రామకృష్ణ చేసిన ఈ విజ్ఞప్తికి వైద్య రంగం నుంచి కూడా స్పందన లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్య నిపుణుడు, పారా క్వాట్ నిషేధం కోసం ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. “మేము డాక్టర్ల సమూహంగా దీన్ని నిషేధించేందుకు పోరాడుతున్నాం. ‘డాక్టర్స్ అగెనెస్ట్ పారా క్వాట్ పాయిజనింగ్’ అనే గ్రూప్‌ను ప్రారంభించాం. ఇటీవల తెలంగాణ ఫార్మర్స్ కమిషనర్‌ను కలిసి చర్చించాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అసెంబ్లీ, పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించేలా చర్యలు తీసుకున్నాం” అని తెలిపారు.

55
పారా క్వాట్ వినియోగంపై చర్చ
Image Credit : Asianet News

పారా క్వాట్ వినియోగంపై చర్చ

ఈ ఘటనతో పారా క్వాట్ వినియోగంపై మరింత చర్చ మొదలైంది. వ్యవసాయ రంగంలో ఉపయోగించే రసాయనాల భద్రత, వాటి నియంత్రణపై ప్రభుత్వాలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అంశం మరోసారి ముందుకు వచ్చింది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే రసాయనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు కోరుతున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas vs Salman Khan: ఈద్ బరిలో సల్మాన్ ఖాన్, ప్రభాస్?.. 2027లో బాక్సాఫీస్ బద్దలే
Recommended image2
బడ్జెట్ 9 కోట్లు, కలెక్షన్లు 80 కోట్లు.. అత్యధిక లాభాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా ఇదే
Recommended image3
Ram Charan-Akhil: రామ్‌ చరణ్‌ కోసం వెనక్కి తగ్గిన అఖిల్‌ అక్కినేని.. `లెనిన్‌` కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే
Related Stories
Recommended image1
బాలకృష్ణ భార్యకి బాగా ఇష్టమైన మూవీ.. సినిమా ఫ్లాప్ అయినా డైరెక్టర్ ని పిలిచి మరీ థ్యాంక్స్ చెప్పిన వసుంధర
Recommended image2
చిరంజీవి సినిమా నాకు శాపం.. కమెడియన్ కామెంట్స్, స్టార్ హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చినా అతడి పరిస్థితి ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved