MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి సినిమా నాకు శాపం.. కమెడియన్ కామెంట్స్, స్టార్ హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చినా అతడి పరిస్థితి ఇదే

చిరంజీవి సినిమా నాకు శాపం.. కమెడియన్ కామెంట్స్, స్టార్ హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చినా అతడి పరిస్థితి ఇదే

చిరంజీవి సినిమా తనకు శాపమైంది అని ఓ క్రేజీ కమెడియన్ తెలిపారు. చిరంజీవి సినిమాకు పని చేసే అవకాశం రావడం అదృష్టం. కానీ ఆ కమెడియన్ ఎందుకు అలా అన్నారో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 28 2026, 07:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎల్బీ శ్రీరామ్ కామెంట్స్
Image Credit : Asianet News

ఎల్బీ శ్రీరామ్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని దర్శకులు, రచయితలు, నిర్మాతలు, నటీనటులు అందరూ కోరుకుంటారు. చిరంజీవితో నటించడంతో పాటు ఆయన సినిమాకి రచయితగా పనిచేసే అవకాశం ఓ కమెడియన్ కి దక్కింది. ఆ కమెడియన్ ఎవరో కాలేదు ఎల్ బి శ్రీరామ్. ఎన్నో సినిమాల్లో తన హాస్యంతో తెలుగు ప్రేక్షకులని ఆయన కడుపుబ్బా నవ్వించారు.

25
రచయితగా ఎల్బీ శ్రీరామ్
Image Credit : our own

రచయితగా ఎల్బీ శ్రీరామ్

కమెడియన్ గా ఆయన అందరికీ బాగా తెలుసు. కానీ ఆయన రచయిత అనే విషయం అందరికీ తెలియకపోవచ్చు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఎల్ బి శ్రీరామ్ రచయితగా పనిచేశారు. ఆ ఒక్కటీ అడక్కు, అప్పుల అప్పారావు, వారసుడు, హలో బ్రదర్ లాంటి విజయవంతమైన చిత్రాలకు ఎల్ బి శ్రీరామ్ రచయితగా పనిచేశారు.

Related Articles

Related image1
బాలకృష్ణ భార్యకి బాగా ఇష్టమైన మూవీ.. సినిమా ఫ్లాప్ అయినా డైరెక్టర్ ని పిలిచి మరీ థ్యాంక్స్ చెప్పిన వసుంధర
Related image2
Peddi Movie: ధురంధర్ రికార్డులు బద్దలు కొట్టేలా పక్కా ప్లాన్ తో పెద్ది.. ఎలాగో తెలుసా ?
35
చిరంజీవి సినిమాకి డైలాగ్స్
Image Credit : Pinterest

చిరంజీవి సినిమాకి డైలాగ్స్

ఎల్బీ శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి గారి సినిమాకి రాయాలని ప్రతి రచయిత కోరుకుంటారు. నాకు కూడా ఆ కోరిక ఉండేది. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న టైంలో హిట్లర్ సినిమాకి ఛాన్స్ వచ్చింది. కొంత గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా అది. అందరి ఫోకస్ దానిపైనే. చిరంజీవి సినిమాకి డైలాగ్స్ రాయడం ఒక వరం. అదే విధంగా నాకు ఒక శాపం కూడా అనిపించింది.

45
ఐదుగురు చెల్లెళ్లకు అన్న
Image Credit : Pinterest

ఐదుగురు చెల్లెళ్లకు అన్న

ఆ మూవీలో ఆయన ఐదుగురు చెల్లెళ్లకు అన్న. బాధ్యతగా ఉండే వ్యక్తి. కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి డైలాగ్ తూకం లా సరిగ్గా ఉండాలి. పైగా ఆ మూవీలో ఆయనకి ఎక్కువ డైలాగ్స్ ఉండవు. కొద్దిపాటి డైలాగ్స్ నే పవర్ ఫుల్ గా రాయాలి. అదే నాకు శాపంగా అనిపించింది. ఒలంపిక్స్ లో అవకాశం అందుకున్న రన్నర్ కి కాళ్లకు సంకెళ్లు ఉంటే ఎలా ఉంటుంది. నా పరిస్థితి కూడా అలాంటిదే.

55
అంతొద్దు ఇది చాలు
Image Credit : Asianet News

అంతొద్దు ఇది చాలు

ఈ విషయం చిరంజీవి గారికి చెప్పాను. నిజమే కదా.. ఇది పెద్ద ఛాలెంజ్, నువ్వు చేయగలవు అని ప్రోత్సాహించారు. ఆయన ప్రోత్సాహంతో 'అంతొద్దు ఇది చాలు' లాంటి మ్యానరిజమ్స్ తో డైలాగులు రాశాను అని ఎల్బీ శ్రీరామ్ అన్నారు. హిట్లర్, హలో బ్రదర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు డైలాగ్స్ రాశాను. ఆ సినిమాల తర్వాత నాకు గొప్పగా ఏమీ రైటర్ గా ఆఫర్స్ రాలేదు. ఇండస్ట్రీ అంటే అంతే. మనం బాగా కష్టపడ్డాం అవకాశం రాలేదు అనుకుంటాం. మనకన్నా బాగా కష్టపడి, ట్యాలెంట్ ఉన్నవాళ్లు ఎందరో ఛాన్సులు లేకుండా ఉన్నారు అని ఎల్బీ శ్రీరామ్ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
పుష్ప 2ని దాటేసిన ధురంధర్ 2.. ఫస్ట్ వీక్‌ కలెక్షన్స్ లో టాప్ 5 మూవీస్ ఇవే!
Recommended image2
OTT లోనే అత్యంత ఖరీదైన సిరీస్.. ఒక్క ఎపిసోడ్‌ బడ్జెట్‌తో 4 'ధురంధర్ 2' సినిమాలు తీయొచ్చు!
Recommended image3
బాలకృష్ణ భార్యకి బాగా ఇష్టమైన మూవీ.. సినిమా ఫ్లాప్ అయినా డైరెక్టర్ ని పిలిచి మరీ థ్యాంక్స్ చెప్పిన వసుంధర
Related Stories
Recommended image1
బాలకృష్ణ భార్యకి బాగా ఇష్టమైన మూవీ.. సినిమా ఫ్లాప్ అయినా డైరెక్టర్ ని పిలిచి మరీ థ్యాంక్స్ చెప్పిన వసుంధర
Recommended image2
Peddi Movie: ధురంధర్ రికార్డులు బద్దలు కొట్టేలా పక్కా ప్లాన్ తో పెద్ది.. ఎలాగో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved