- Home
- Entertainment
- త్వరలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ వివాహం.. కాబోయే భార్యకు లిప్ కిస్ ఇస్తూ, ఆ ఛానల్ ని ఏకిపారేస్తూ..
త్వరలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ వివాహం.. కాబోయే భార్యకు లిప్ కిస్ ఇస్తూ, ఆ ఛానల్ ని ఏకిపారేస్తూ..
యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు.

యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, జాతి రత్నాలు లాంటి చిత్రాల్లో రాహుల్ రామకృష్ణ తనదైన మార్క్ ప్రదర్శించాడు. ఇటీవల రాహుల్ రామకృష్ణ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీలో రామకృష్ణ ది చాలా ఇంపార్టెంట్ రోల్. ఒక రకంగా చెప్పాలంటే కథని మలుపు తిప్పే పాత్రే. ఎన్టీఆర్ పక్కన ఉంటూ అద్భుతంగా నటించాడు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణకి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా రాహుల్ తాజాగా ఓ గుడ్ న్యూస్ ప్రకటించాడు.
rahul ramakrishna
తాను త్వరలో ఓ ఇంటివాడిని కాబోతున్నట్లు ట్విటర్ లో తెలిపాడు. అది కూడా కాస్త బోల్డ్ గానే. తన ఫియాన్సీతో ఘాటుగా లిప్ కిస్ లో మునిగితేలుతున్న ఫోటో షేర్ చేశాడు. ఎట్టకేలకు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా అంటూ కామెంట్ పెట్టాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Vishwak Sen
అభిమానులు రాహుల్ రామకృష్ణకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటీవల విశ్వక్ సేన్ వివాదంలో రాహుల్ రామకృష్ణ సదరు టీవీ ఛానల్ పై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. టీఆర్పీ, డబ్బు కోసమే ఆ ఛానల్ పనిచేస్తోంది అంటూ రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా రాహుల్ రామకృష్ణ తన ఫియాన్సీతో ఉన్న ఫోటో విషయంలో కూడా ఆ చానల్ పై సెటైర్లు వేశాడు. ఈ ఫోటోపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు డిబేట్ పెట్టండి. నేను నా ఫియాన్సీ తప్పకుండా డిబేట్ కి వస్తాం.. మీరు ఇలాంటివి చేస్తారు కదా అంటూ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విశ్వక్ సేన్, యాంకర్ దేవి నాగవల్లి వివాదం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. విశ్వక్ సేన్ తన చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం కోసం ఫ్రాంక్ వీడియో చేశాడు. దీనిపై ఆ ఛానల్ లో జరిగిన డిబేట్ లో విశ్వక్ సేన్, నాగవల్లి మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే.