Brahmamudi: అపర్ణని భయపెడుతున్న రుద్రాణి.. రాహుల్ కి కోలుకోలేని షాకిచ్చిన స్వప్న!
Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ముందుకి దూసుకుపోతుంది. అత్యాశతో నిండు జీవితాన్ని చేజార్చుకొని రోడ్డున పడ్డ ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో స్వప్న ఫోన్ చేస్తుంటే దీన్ని తెలిపితే ఫుడ్డు, హోటల్ అంటూ మేపాలి అనుకుంటూ ఫోన్ కట్ చేసేస్తాడు రాహుల్. అందుకు హర్ట్ అయిన స్వప్న లాభం లేదు రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్లి తాడోపేడో తేల్చుకోవాలి ఇంక నేను ఈ అవమానాలు భరించలేను అనుకుంటుంది స్వప్న. మరోవైపు అల్లుడు కోసం చాలా రకాల వంటలు చేసి పెడతారు కనకం, మీనాక్షి.ఇన్ని రకాలు ఎందుకు చేశారమ్మ మీకు కష్టం కదా అంటుంది కావ్య. కష్టం కాదమ్మా ఇష్టం అసలు మన ఇంటి ఛాయలకే రారు అనుకున్న అల్లుడు ఇంటి లోపలికి వచ్చారు అలాంటి ఆయనకి మనం ఎంత మర్యాద చేయాలి అంటుంది కనకం.
అసలు విషయం మరొకటి ఉంది మన ఇంటి ఆడపిల్ల ఆ ఇంట్లో సుఖపడాలంటే ముందు అల్లుడ్ని మనం తృప్తి పరచాలి. మన ఆప్యాయతకి తలవంచిన అల్లుడు ఆ ఇంట్లో మన ఇంటి పిల్లని ప్రేమగా చూసుకుంటాడు అంటాడు కృష్ణమూర్తి. అంతలోనే రాజ్, క్రిష్ణమూర్తి వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకొని బయటికి వస్తాడు. భర్తని అలా చూసినా కావ్య ఆశ్చర్యపోయి వేసుకొని అని విసిరేసిన మనిషి ఎలా వేసుకున్నారు అనుకుంటుంది. జరిగిన విషయం ఏంటంటే అప్పు రాజ్ దగ్గరికి వెళ్లి ఐస్ క్రీమ్ తినమంటుంది. అతను తినను అనటంతో కావాలని అతని ఫ్యాంట్ మీద ఐస్ క్రీమ్ పడేస్తుంది.
రాజ్ కంగారు పడుతుండటంతో ఆ ఫ్యాంటు నాకు ఇవ్వు ఉతికి ఇస్తాను అంతవరకు ఆ బట్టలు వేసుకో అంటూ కృష్ణమూర్తి వాళ్ళు ఇచ్చిన బట్టలు చూపిస్తుంది అప్పు. అది తలుచుకొని అప్పు వైపు కోపంగా చూస్తాడు రాజ్. మరోవైపు భోజనానికి వడ్డించిన వంటలు చూసి ఏంటి ఈ ఎగ్జిబిషన్ అయినా డైనింగ్ టేబుల్ లేదా అని అడుగుతాడు రాజ్. కింద కూర్చుంటే అన్ని పదార్థాలు కనబడతాయి అంటుంది మీనాక్షి. కిందనా అంటూ ఇబ్బందిగా మొహం పెడతాడు రాజ్. మరోవైపు దిగులుగా కూర్చున్న అపర్ణ దగ్గరికి వస్తుంది రుద్రాణి.
ఎందుకు నన్ను దెప్పడానికి వచ్చావా, నా కొడుకు అత్తగారింటికి వెళ్ళటం నీకు ఇష్టమే కదా అంటుంది అపర్ణ. ఎవరు అవునన్నా కాదన్నా నేను ఏంటి ఆడపడుచుని ఈ ఉప్పు తిన్న విశ్వాసం నాకు ఉంది అందుకే చెప్తున్నాను. రాజ్ అత్తగారింటికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు వాడిలో మార్పు మొదలైంది అంటుంది రుద్రాణి. ఒక్కసారి అత్తగారింటికి వెళ్లినంత మాత్రాన కాపురం నిలబడి పోదు అంటుంది అపర్ణ. ఈ అబ్బాయిలంతా ఇంతే పెళ్లికి ముందు వరకే అమ్మ అంటూ తిరుగుతారు ఒకసారి పెళ్లి అయితే భార్య కొంగు పట్టుకుని తిరుగుతారు అంటూ భయపెడుతుంది రుద్రాణి.
వాడు ఇష్టంతో అత్తారింటికి వెళ్లలేదు అంటుంది అపర్ణ. ఎలా అయితేనేమి వెళ్ళాడు కదా అక్కడ వాళ్ళ బుట్టలో పడిపోయి ఉంటాడు కావాలంటే వీడియో కాల్ చేద్దాం అంటుంది రుద్రాణి. వద్దు అంటుంది అపర్ణ. నేను ఊరుకుంటానా అనుకుంటుంది రుద్రాణి. మరోవైపు రాజ్ కి ప్రేమతో భోజనం వడ్డిస్తూ ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు ఉంటారు కనకం, మీనాక్షి.ఇంతలో రుద్రాణి ఫోన్ చేయడంతో అప్పు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లుంగీ తో ఉన్న రాజ్ ని చుట్టూ ఉన్న పదార్థాలను చూసి ఆశ్చర్య పోతుంది. అప్పటికే ఇబ్బంది పడుతున్న రాజ్ తర్వాత ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసేస్తాడు. వాడు ఎంత మారిపోయాడు ఆ అలగా జనం వాడికి ఎక్కువైపోయారు అంటూ కోపంతో రుద్రాణికి చెప్తుంది అపర్ణ.
మరోవైపు భోజనం చేస్తున్న రాజ్ గొంతులో చేప ముల్లు ఉప్పుగుచ్చుకోవటంతో కంగారు పడతాడు. అది చూసి కంగారుతో రాజ్ ని మరింత ఇబ్బంది పెడతారు కనకం, మీనాక్షి. మీరు కంగారుపడి ఆయన్ని కంగారు పెట్టకండి అంటూ వైట్ రైస్ ని ఉండగా చేసి నమలకుండా మింగేయమంటుంది కావ్య. కావ్య చెప్పినట్లు చేయటంతో కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతాడు రాజ్.మరోవైపు రాజ్ వాళ్ల ఇంటికి వచ్చిన స్వప్న ముందుగా రాహుల్ కి ఫోన్ చేస్తాను అయినా రాకపోతే అప్పుడు లోపలికి వెళ్తాను అనుకుంటూ రాహుల్ కి ఫోన్ చేస్తుంది.
రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుంది. వేరే దారి లేక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రాహుల్. ఎందుకు పదేపదే ఫోన్ చేస్తున్నావు నా పరిస్థితిని చెప్పాను కదా అంటాడు. నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను కాబట్టే ఇంట్లోకి రాకుండా ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను అంటుంది స్వప్న. ఆ మాటలకి షాక్ అయిన రాహుల్ జోక్ చేస్తున్నావ్ కదా అంటాడు. బయటికి వచ్చి చూస్తే నిజమో కాదో నీకే తెలుస్తుంది అంటుంది స్వప్న. బయటికి వచ్చి చూసేసరికి స్వప్న కనిపించడంతో షాక్ అవుతాడు రాహుల్. తరువాయి భాగంలో బాత్రూం కి వెళ్లిన రాజ్ కాలుజారి నడుం విరగగొట్టుకొని మంచం మీద పడతాడు.