సుకుమార్ అందుకే స్టార్ డైరెక్టర్ అయ్యారు.. రాఘవేంద్ర రావు కామెంట్స్
అమెరికాలో జరుగుతున్న తెలుగువారి నాట్స్ 2025 సంబరాల్లో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. రాఘవేంద్ర రావు కూడా నాట్స్ 2025 సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు డైరెక్టర్ సుకుమార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో జరుగుతున్న తెలుగువారి నాట్స్ 2025 సంబరాల్లో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ సుకుమార్, శ్రీలీల, దిల్ రాజు లాంటి వారంతా అమెరికాకి వెళ్లిన సంగతి తెలిసిందే.
లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు కూడా నాట్స్ 2025 సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు డైరెక్టర్ సుకుమార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. నేను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఇక్కడే ఉండడం సంతోషాన్ని ఇచ్చే అంశం.
ఇక డైరెక్టర్ సుకుమార్ కి నాకు ఒక పోలిక ఉంది. అదేంటంటే మా ఇద్దరికీ గడ్డం ఉంది. నేను అడవి రాముడు చిత్రంలో అడవిని నమ్ముకుని స్టార్ట్ డైరెక్టర్ ను అయ్యాను. సుకుమార్ పుష్ప చిత్రంతో అడవిని నమ్ముకుని పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు అని రాఘవేంద్రరావు అన్నారు.
సుకుమార్ కూడా ఈ వేడుకలో ప్రసంగించారు. అమెరికాలో ఉన్న తెలుగు వారందరికీ నేను రుణపడి ఉంటాను. రెండు విషయాల్లో మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలి. అదేంటంటే 1 నేనొక్కడినే చిత్రం అంతటా నిరాశపరిచినప్పటికీ అమెరికాలో మాత్రం మంచి ఆదరణ లభించింది. ఆ చిత్రాన్ని మీరు ఆదరించడం వల్లే నాకు డైరెక్టర్ గా మరో అవకాశం వచ్చింది.
అదే విధంగా మైత్రి మూవీస్ నవీన్ లాంటి నిర్మాతని మీరే టాలీవుడ్ కి ఇచ్చారు. మైత్రి మూవీ సంస్థ వల్ల టాలీవుడ్ లో చాలా మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఈ రెండు విషయాల్లో అమెరికాలో ఉన్న తెలుగు వారికి నేను కృతజ్ఞతలు చెబుతున్నా అని సుకుమార్ అన్నారు.