- Home
- Entertainment
- Prema Entha Madhuram: వశిష్టను వదిలేసిన జిండే.. నా గురించి నీకెందుకంటూ అనుని నిలదీసిన రాగసుధ!
Prema Entha Madhuram: వశిష్టను వదిలేసిన జిండే.. నా గురించి నీకెందుకంటూ అనుని నిలదీసిన రాగసుధ!
Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్ ఏంటో తెలుసుకుందాం. రాగసుధ టిఫిన్ సెంటర్లో పని చేయడం ఇష్టం లేక అను రాగసుధ ను తనతో పాటు తీసుకెళ్తుంది. మరోవైపు ఆర్య, జిండే (Jinde) తో వశిష్ఠ ను వదిలేయ్ అని చెబుతాడు.

వశిష్టుని (Vasista) వదిలేయడం ద్వారా రాగసుధ ఎక్కడున్నా మనకు తెలిసిపోతుంది అని ఆర్య జిండే తో చెబుతాడు. ఇక అనుకున్న విధంగానే జిండే వశిష్ట ని వదిలేసి వెంబడిస్తాడు. మరోవైపు అను, రాగసుధ ఒక చోటికి తీసుకు వెళ్లి అక్కడ ఆమె గతం గురించి అడుగుతుంది. ఇక దాంతో రాగసుధ (Raga sudha)నా గతానికి నీకు సంబంధం ఏంటి అని అడుగుతుంది.
అను (Anu) మనసులో 'గతం గురించి చెప్పడం ఇష్టం లేని రాగ సుధకు నేనే రాజ నందిని అని చెప్పడం ఇప్పుడు కరెక్ట్ కాదు' అని అనుకుంటుంది. అదే క్రమంలో నా మీద రాగ సుధ (Raga sudha) కు పూర్తి నమ్మకం క్రియేట్ అయిన తర్వాతే నిజం చెప్పాలి అని అను అనుకుంటుంది.
ఇక ఆ తర్వాత అను, రాగ సుధ (raga sudha) ను అక్కా అని పిలిచి కౌగిలించుకుంటుంది. ఇక లేట్ అవ్వడంతో వాళ్ళిద్దరు తల్లిదండ్రుల ఇంటికి వెళతారు. మరోవైపు మాన్సీ 50 లక్షలు కావాలని నీరజ్ (Neeraj)ను అడుగుతుంది. ఇక నీరజ్ ఆశ్చర్యపోతాడు.
ఇక నీరజ్ పర్పస్ ఏంటో చెబితే నే ఆ డబ్బు ఇస్తాను లేకపోతే లేదు అని చెబుతాడు. దాంతో మాన్సీ (Mansi) ఎందుకు ఇవ్వలేవు నీరజ్ (Neeraj) మీ అమ్మకి నువ్వు కొడుకు వేగా ఇదంతా నీ ఆస్తి కాదా అని అడుగుతుంది. అంతేకాకుండా బ్రో ఇన్ లా.. ను నిలదీసి అడుగు అని చెబుతుంది.
ఇక తర్వాత మాన్సీ (Mansi) చిరాకు పడుతూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ క్రమంలో వాళ్ళ అత్తగారు.. ఏంటి మాన్సీ ఏం జరిగింది అని అడగగా చెబితే మీరు ఏమైనా తీరుస్తారా అని విరుచుకు పడుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో జిండే, ఆర్య లు రాగసుధా ఎక్కడుందో తెలుసుకుంటారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.