- Home
- Entertainment
- Prema Entha Madhuram: కీలక మలుపు...చెల్లి రాగాసుధా కోసం ఎదురుచూస్తున్న అను.. ఆమె ఎక్కడుందో తెలుసుకున్న జిండే!
Prema Entha Madhuram: కీలక మలుపు...చెల్లి రాగాసుధా కోసం ఎదురుచూస్తున్న అను.. ఆమె ఎక్కడుందో తెలుసుకున్న జిండే!
Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సీరియల్ లో ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక గుడిలో ఉన్న అను (Anu) మనసులో ఇలా అనుకుంటుంది. 'చెల్లి నా కోసం 20 ఏళ్లు పూజలు చేస్తున్నావు. నేను ఇలాంటి భర్త కోసం జీవితాంతం చేయాలి. ఇలాంటి భర్తను నీకు పరిచయం చేయాలి. ఏమైపోయావు. ఎక్కడ ఉన్నావు నీ కోసం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాను.
కనీసం రేపైనా కనిపిస్తావా' అని అనుకుంటుంది. మరోవైపు ఆఫీస్ లో ఉన్న రాగసుధ (Raga sudha) సెక్యూరిటీ వాళ్లకు కనిపించకుండా తప్పించుకొని ఒక రూమ్ లో తల దాచుకుంటుంది. ఆ తర్వాత ఆ రూమ్ లో ఆర్య ఫోటో చూసి ఇది ఆర్య వర్ధన్ (Arya Vardhan) ఆఫీస్ ఆ.. అని మనసులో ఎంతో కోపం పడుతుంది.
ఇదే ఆఫీస్ లో వైస్ ప్రెసిడెంట్ సీట్ లో ఉండాల్సిన నేను ఇలా దొంగలా ఒక రూమ్ లో దాక్కోవాల్సి వచ్చిందని అనుకుంటుంది. ఇక రాగసుధ (Ragasudha) ఆర్య (Arya) గతంలో చేసిన కుట్రలను బయట పెడుతూ ఎప్పటికైనా నీ సంగతి చూస్తా అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది.
అంతేకాకుండా ఆర్య ఫోటోను గట్టిగా గుద్ది వచ్చిన బ్లడ్ తో ఆర్య ఫోటోపై ఒక హస్తం గుర్తు వేస్తుంది. ఇది అంతం కాదు ఆరంభం అని చెబుతోంది. ఆ తర్వాత అను, ఆర్యలు (Anu, arya) ఒక లాడ్జిలో స్టే చేయడానికి వెళతారు. అదే లాడ్జిలో ఒక రూమ్ లో రాగసుధను (Ragasudha) వెతుకుతున్న వ్యక్తి ఉంటాడు.
'రాగ సుధ (Ragasudha) పేరును పాతికమంది జపం లా చెప్పిస్తూ వెతకండి' అని ఆ వ్యక్తి తన మనుషులతో చెబుతాడు. ఆ తర్వాత ఆ ఆఫీస్ లో ఒక జిండే (Jinde) రాగసుధను సీసీ కెమెరా ద్వారా గుర్తు పట్టి గతంలో కి వెళతాడు. ఆ తర్వాత జరిగిన సంగతిని లాడ్జి లో ఉన్న ఆర్య కు ఫోన్ చేసి చెబుతాడు.
ఇక ఆర్య (Arya) ఇది మళ్లీ రిపీట్ కావద్దు అని అంటాడు. దాంతో జిండే (Jinde) ఆఫీస్ లో ఉన్న వాళ్ళని బయటికి పంపిస్తాడు. ఇక రాగసుధకోసం వెతుకుతున్న వ్యక్తి హోటల్ లో ఫోన్ మాట్లాడుతున్న ఆర్య ను చూసి షాక్ అవుతాడు.