చెత్త సినిమా, విసిరి కొట్టాలనిపించింది.. రాధిక వివాదాస్పద వ్యాఖ్యలు యానిమల్ మూవీపైనేనా
సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ సంచలన విజయం గా నిలిచిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ ని సందీప్ తనదైన శైలిలో చాలా బోల్డ్ గా ప్రజెంట్ చేశారు.
Animal
సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ సంచలన విజయం గా నిలిచిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ ని సందీప్ తనదైన శైలిలో చాలా బోల్డ్ గా ప్రజెంట్ చేశారు. సందీప్ రెడ్డి టేకింగ్ కి ప్రశంసలు దక్కాయి. సందీప్ రెడ్డి చిత్రం అంటే రొమాన్స్ కూడా బోల్డ్ గానే ఉంటుంది. దీనితో యువత పండగ చేసుకున్నారు.
రణబీర్ కపూర్ మాత్రం యాంగ్రీ అండ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరహో అనిపించాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యానిమల్ మూవీ మీమ్స్ కనిపిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అయితే సంక్రాంతికే ఈ చిత్రం ఓటిటిలోకి వస్తుందని అనుకున్నారు. కానీ రిపబ్లిక్ డే రోజున నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఓటిటిలో కూడా ఈ విశేషమైన స్పందన దక్కుతోంది. థియేటర్స్ లో రిలీజైనప్పుడు కూడా కొందరు ఈ చిత్రాన్ని తప్పుబట్టారు. విమర్శించారు. ఇలాంటి చిత్రాల ద్వారా సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు జరిగింది.
ఇప్పుడు ఓటిటిలోకి రిలీజైన తర్వాత తాజాగా సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె యానిమల్ చిత్ర పేరు ప్రస్తావించలేదు. పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది.
రాధికా శరత్ కుమార్ తన సోషల్ మీడియాలో ' ఇలాంటి చెత్త సినిమా ఎవరైనా చూశారా ?నాకైతే విసిరి కొట్టాలన్నంత కోపం వచ్చింది అని రాధికా పోస్ట్ చేసింది. రాధికా చేసిన ఈ వ్యాఖ్యలు యానిమల్ మూవీ గురించే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. యానిమల్ చిత్రంపై చాలా మంది మహిళలు నెగిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఓటిటిలోకి రిలీజ్ కాగానే యానిమల్ మూవీని రాధిక వీక్షించినట్లు ఉన్నారు. అందుకే వెంటనే ట్వీట్ చేశారు. సందీప్ వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. లేటెస్ట్ సెన్సేషన్ తృప్తి డమ్రి రొమాంటిక్ సీన్ లో రెచ్చిపోయింది. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు.