- Home
- Entertainment
- Radheshyam shocking Rate: డిజిటల్-శాటిలైట్ రైట్స్ లో దుమ్మురేతున్న `రాధేశ్యామ్` .. ఇండియన్ టాప్..
Radheshyam shocking Rate: డిజిటల్-శాటిలైట్ రైట్స్ లో దుమ్మురేతున్న `రాధేశ్యామ్` .. ఇండియన్ టాప్..
`రాధేశ్యామ్`.. ప్రస్తుతం ఉన్న ఇండియన్ బిగ్గెస్ట్ మూవీస్‌లో ఒకటి. గ్లోబల్‌స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తాజాగా డిజిటల్ రైట్స్ విషయంలో సంచలనంగా మారింది. భారీ రేటుకి అమ్ముడు పోయిందని టాక్.

ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా `రాధేశ్యామ్`. రాధాకృష్ణ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. కృష్ణంరాజు సమర్పకులు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించింది. మార్చి 11న విడుదల చేయాలని నిర్ణయించారు. థర్డ్ వేవ్ కరోనా అనంతరం వస్తోన్న బిగ్గెస్ట్ క్రౌడ్‌పుల్లర్ `రాధేశ్యామ్` కాబోతుండటం విశేషం.
ఇతర సినిమాలు రిలీజ్ విషయంలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ రెండు డేట్లు ప్రకటించి డబుల్ గేమ్ ఆడగా, ప్రభాస్ మాత్రం సింగిల్‌గా రంగంలోకి దిగారు. డేరింగ్ స్టెప్‌తో పెద్ద సినిమాల అందరి కంటే ముందే వస్తున్నారు. ఈ సినిమాపై `ఆర్‌ఆర్‌ఆర్` వంటి భారీ చిత్రాలు ఆశలు పెట్టుకోవడం విశేషం. అంతేకాదు బాలీవుడ్ మార్కెట్ పెంచడంలోనూ `రాధేశ్యామ్` మిగిలిన పాన్ ఇండియా చిత్రాలకు హెల్ప్ కాబోతుంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించి భారీగా ఓటీటీ ఆఫర్ వచ్చిందని ఇంతకు ముందు ప్రచారం జరిగింది. ఏకంగా నాలుగు వందల కోట్లని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆఫర్ చేసిందని ప్రచారం జరిగింది. కానీ దాన్ని తిరస్కరించిన `రాధేశ్యామ్` టీమ్ థియేటర్లలోనే రాబోతున్నట్టు ప్రకటించారు. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని థియేటర్‌లోనే చూస్తే ఆ కిక్కు వేరే లెవల్ అని వెయిటింగ్‌లో పెట్టారు. ఎట్టకేలకు మరో నెల రోజుల్లో ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతుంది. అయితే రిలీజ్ విషయంలోనూ భారీగా ప్లాన్ చేశారట. ఏకంగా ఇరవై వేల స్క్రీన్లలో ఈసినిమాని ప్రదర్శించేందుకు ప్లాన్ జరుగుతుందని టాక్.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి మరో గూస్‌బంమ్స్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా `రాధేశ్యామ్` డిజిటల్(ఓటీటీ), శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయని తెలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్(హిందీ), జీ5 సంస్థలు భారీగా వెచ్చించి ఈ రైట్స్ దక్కిచుకున్నాయట. అందులో భాగంగా `రాధేశ్యామ్` డిజిటల్-శాటిలైట్స్ రైట్స్ ఏకంగా 250కోట్లకి అమ్ముడుపోయాయని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ విషయంలో `రాధేశ్యామ్` రికార్డ్ సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే డిజిటల్స్ రైట్స్ విషయంలో `ఆర్‌ఆర్‌ఆర్` టాప్‌లో ఉంది. ఇది 325కోట్లకు సేల్ అయ్యింది. ఆ తర్వాత `రాధేశ్యామ్` నిలవడం విశేషం. దీంతో ఇప్పుడిది ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అవుతుంది. మరోవైపు తమిళంకి సంబంధించిన థియేటర్ రైట్స్ కూడా కన్ఫమ్ అయ్యింది. రెడ్ గెయింట్ మూవీస్‌సంస్థ కోలీవుడ్ థియేట్రికల్ రైట్స్ ని భారీ మొత్తానికి దక్కించుకుందట.