MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Radhe Shyam:భీమ్లా నాయక్ ని దాటలేకపోయిన రాధే శ్యామ్... టాప్ ఫస్ట్ డే గ్రాసర్స్ లిస్ట్ లో పొజిషన్ ఎక్కడంటే!

Radhe Shyam:భీమ్లా నాయక్ ని దాటలేకపోయిన రాధే శ్యామ్... టాప్ ఫస్ట్ డే గ్రాసర్స్ లిస్ట్ లో పొజిషన్ ఎక్కడంటే!

ప్రభాస్ (Prabhas)పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన రాధే శ్యామ్ చిత్రం కోసం ఫ్యాన్స్, సినీ ప్రేమికులు ఎగబడ్డారు. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన రాధే శ్యామ్ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 12 2022, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రాధే శ్యామ్ (Radhe Shyam collections)మూవీ మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఓపెనింగ్ డే రికార్డు కి ఆమడ దూరంలో ఆగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ కి ఊహించినంత రెస్పాన్స్ దక్కలేదు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలేమిటో...? ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించాయో? పరిశీలిద్దాం..

28


టాలీవుడ్ రికార్డ్స్ గత ఐదేళ్లుగా బాహుబలి 2 (Bahubali 2)పేరిటే ఉంటున్నాయి. పాక్షికంగా కొన్ని రికార్డులు బ్రేక్ అయినా... టోటల్ కలెక్షన్స్ తో పాటు అనేక రికార్డ్స్ బాహుబలి 2 పేరిటే ఉన్నాయి. 2017లో విడుదలైన బాహుబలి 2 మొదటి రోజు ఏపీ&తెలంగాణలో దాదాపు రూ. 43 కోట్ల షేర్ రాబట్టింది. ఇదే ఇప్పటి వరకు టాలీవుడ్ టాప్ ఫస్ట్ డే షేర్. 

38

టాప్ టూ పొజిషన్ కూడా ప్రభాస్ దే. ఆయన హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన సాహో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలైన సాహో పూర్తి నెగిటివ్ టాక్ లో కూడా రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకుంది. సాహో ఏపీ&తెలంగాణలో కలిపి మొదటి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల షేర్ అందుకుంది.

48

చిరంజీవి నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సైరా నరసింహారెడ్డి. 2019లో విడుదలైన సైరా మూవీని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో మొదటి రోజు సుమారు రూ. 36.37 కోట్ల షేర్ రాబట్టింది.

58

2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు ఈ లిస్ట్ లో 4వ స్థానంలో ఉంది. మహేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.77 కోట్ల షేర్ అందుకుంది. 
 

68

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్. హిందీ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కింది. 2021లో విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్ డే 32.20 కోట్ల షేర్ వసూలు చేసింది. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

78

టాప్ ఫైవ్ లో ఈ చిత్రాలు ఉండగా పవన్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్(Bheemla Nayak) 6వ స్థానం ఆక్రమించింది.   భీమ్లా నాయక్ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 26.31 కోట్ల షేర్ అందుకుంది. 
 

88


రాధే శ్యామ్ మూవీతో ప్రభాస్ అన్ని రికార్డ్స్ తిరగ రాస్తాను అందరూ భావించారు. అయితే రాధే శ్యామ్ ఈ విషయంలో ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఓపెనింగ్స్ పరంగా వెనుకబడింది. రాధే శ్యామ్ ఫస్ట్ డే రూ. 26. 67 కోట్ల ఏపీ&టీజీ షేర్ సాధించిందని తెలుస్తుండగా... 8వ స్థానంతో సరిపెట్టుకుంది. 7వ స్థానంలో పవన్ అజ్ఞాతవాసి రూ. 26.29 కోట్లతో ఉంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: నువ్వు రిక్వెస్టు చేస్తే తప్ప నీతో సినిమాలు చేయను... భర్తకు రష్మిక కండిషన్
Recommended image2
Vijay Trisha: దళపతి విజయ్ అభిమానులకు కోపం తెప్పించిన త్రిష, ఆమె పెట్టిన ఒక్క పోస్ట్.. అంత రచ్చ చేసిందా? !
Recommended image3
Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved