MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: జానకమ్మకి ఇవ్వాల్సిన మందులు మార్చేసిన మాధవ్! విషయం తెలుసుకున్న రాధ ఆపగలదా?

Devatha: జానకమ్మకి ఇవ్వాల్సిన మందులు మార్చేసిన మాధవ్! విషయం తెలుసుకున్న రాధ ఆపగలదా?

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 5వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Oct 05 2022, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రుక్మిణి ఆదిత్యతో, నువ్వు సత్తమ్మకు తెలియకుండా వచ్చావు. దేవమ్మా నీ దగ్గర ఎక్కువసేపు ఉండడం సత్తమ్మకు నచ్చడం లేదు.నువ్వు తనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటుంది అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పకుండా వచ్చావు అంటే తను ఇంకా అపార్థం చేసుకుంటుంది. కనుక ఇప్పుడు నువ్వు వెళ్ళిపో పెనిమిటి అని అంటుంది.అప్పుడు ఆదిత్య, నీకు అన్ని తెలుసు కదా రుక్మిణి నేను దేవి కోసమే వచ్చాను. దేవిని ఎప్పుడు ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా ఏదో ఒక విషయం ఆపుతూనే ఉన్నది అని అంటాడు.
 

27

అవును పెనిమిటి దేవమ్మను మీకు అప్పగిస్తాను అన్నాను కానీ ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది.అప్పుడు మాధవ్ వీళ్ళ మాటలు అన్నీ విని, నాకు మంచి ఉపాయాన్ని ఇచ్చారు అని అనుకుంటాడు. మరోవైపు సత్య, అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది. కుటుంబం అంతా కనిపించడం లేదు మెసేజ్ చేద్దామా. వద్దు అక్కతో నేను స్వయంగానే మాట్లాడాలి, నిలదీయాలి పోనీ మాధవ్ కి మెసేజ్ చేద్దాము అని అనే లోగా  మాధవ్ సత్య కు మెసేజ్ చేస్తాడు. ఏం పంపించాడు అని చూసేసరికి ఆదిత్య, రుక్మిణి మాట్లాడుకుంటూ ఉన్న ఫోటో ఉంటుంది.
 

37

 అప్పుడు సత్య ఆశ్చర్యపోయి, ఆదిత్య వెళ్ళింది అక్కతోనా!క్యాంప్ అని అబద్ధం చెప్పాడా అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో మాధవ్ ఒక నర్సుని పిలిచి పక్కకు వెళ్లి మాట్లాడి, నేను నీకు ఒక విషయం చెప్తాను నువ్వు అలాగే చేయాలి. మా అమ్మకు రాసిన మందులు మార్చేయాలి అని అనగా, నేను మా డాక్టర్ చెప్పినట్టే వింటాను కానీ మీరు చెప్పినట్టు ఎందుకు వింటాను అని నర్స్ అంటుంది. అప్పుడు మాధవ్ తనకి డబ్బులు ఇస్తాడు. నువ్వు మిగిలిన వాళ్ళందరికీ మీ డాక్టర్ చెప్పినట్టే చెయ్యు కానీ ఒక్క మా అమ్మకు తప్ప అని అనగా, తను మీ అమ్మగారే కదా అని నర్స్ అంటుంది.
 

47

నీకు సమాధానం కావాలా లేకపోతే డబ్బు కావాలా అని మాధవ్ అనగా, తను డబ్బు తీసుకొని అలాగే అని చెప్తుంది. ఆ తర్వాత తను జానకమ్మకి తాగడానికి జ్యూస్ ఇస్తుంది. అప్పుడు జానకమ్మ దాన్ని తాగుతుంది. మాధవ్ మనసులో ఎంతో ఆనంద పడుతూ ఉంటాడు. అప్పుడు జానకమ్మ భయపడుతూ ఉండగా, ఏమైంది అవ్వ ఎందుకు అలా భయపడుతున్నారు ఇలాగే ఒక వారం పాటు మందులు వేసుకుంటే నీకు మాటలు తిరిగి వస్తాయి, తిరిగి నడుస్తావు కూడా భయపడొద్దు అని అంటారు. దానికి రామ్మూర్తి,ఎప్పుడైతే జానకి కి పడిపోయిందో అప్పుడు నుంచి రాధతో ఏదో చెప్పాలి అని అనుకుంటుంది.
 

57

కానీ చెప్పడం కుదరడం లేదు అని అనగా, జానకమ్మ తన వేలు మాధవ్ వైపు చూపిస్తూ ఉంటుంది.అప్పుడు రామ్మూర్తి,మాధవ్ తో మాట్లాడాలి అనుకుంటున్నావా? చూడు మాధవ్ మీ అమ్మ నీ గురించి ఆలోచిస్తుంది అని అనగా, అమ్మ నువ్వు నా గురించి ఆలోచించొద్దు. నీకు నేనున్నాను కదా అలాగే నీ బంగారమైన కోడలు రాద కూడా ఉన్నది కదా మేము చూసుకుంటాము అని మాధవ్ అంటాడు. ఆదిత్య, రుక్మిణిలు ఆ మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆ తర్వాత రుక్మిణి పిల్లలు ఇద్దరికీ భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో మాధవ్ జానకమ్మ దగ్గరికి వస్తాడు.
 

67

ఏంటమ్మా నీకు  నయమవుతుంది అని వాళ్ళు చెప్తే నువ్వు కూడా నమ్ముతున్నావా? నువ్వు ఇలాగ ఉన్నంతవరకు నాకు ఏ ప్రమాదము లేదు.నువ్వు ఎప్పుడైతే మాట పోయింది అన్నావో అప్పుడు నుంచి నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంక రాధ ఇక్కడ నుంచి వెళ్తాది అన్న అనుమానమే లేదు అని అంటాడు మాధవ్. అదే సమయంలో రాద, అవ్వకు మంచినీళ్లు ఇస్తాను మీరు ఇక్కడే ఉండండి అని పిల్లలకి చెప్పి జానకమ్మ దగ్గరకి వస్తుంది. వెనకాతల నుంచి మాధవ్ మాటలు వింటుంది రాద.అప్పుడు మాధవ్, నువ్వు ఎన్ని రోజులైతే ఇలాగ ఉంటావో అన్ని రోజులు రాధ నా దగ్గర ఉంటుంది కనుక నీకు మాట వచ్చే ఏ ప్రయత్నం అయినా చెడగొడతాను.
 

77

 ఇంక నీకు జీవితంలో మాట రాకుండా చేస్తాను. అప్పుడు నన్ను, రాదను ఎవరు విడదీయలేరు. రేపు మందులు వేసుకుని నయం అయిపోతుంది అనుకుంటున్నావు కదా దాని గురించి కూడా నాకు ఒక ప్లాన్ ఉంది. ఆ మందులన్నీ మార్చేసాను ఇంక నీకు పూర్తిగా మాట పడిపోతే అప్పుడు ఇక్కడికి తీసుకు వచ్చినందుకు ఆదిత్య మీదే నింద వేస్తాను అని అనగా రాద ఆశ్చర్యపోయి తెచ్చిన గ్లాసు కింద పడేసి అక్కడ నుంచి పారిపోతుంది. రాధ పారిపోవడం చూసిన మాధవ్ బయటకు వచ్చి సత్యకు ఫోన్ చేసి, సత్య నీతో మాట్లాడాలి చెప్పిన చోటుకు రా అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Recommended image2
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Recommended image3
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved