MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లై పిల్లలున్నా సరే, ఆ స్టార్‌ హీరోనే కావాలి.. పెద్ద గొడవ చేసిన హీరోయిన్‌ రాశీ

పెళ్లై పిల్లలున్నా సరే, ఆ స్టార్‌ హీరోనే కావాలి.. పెద్ద గొడవ చేసిన హీరోయిన్‌ రాశీ

హీరోయిన్‌ రాశీ సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఆకట్టుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ టీనేజ్‌లో మాత్రం ఓ స్టార్‌ హీరోపై మనసు పడంది. ఆయన్న పెళ్లి చేసుకుంటా అంటూ గొడవ చేసిందట.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 03 2024, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రాశీ ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన నటి. హోమ్లీ హీరోయిన్‌గా మెప్పించింది. ఇంటిళ్లిపాదికి దగ్గరయ్యింది. గ్లామర్‌ హీరోయిన్ల జోరు సాగుతున్న సమయంలో సాంప్రదాయానికి పెద్ద పీఠ వేస్తూ హీరోయిన్‌గా రాణించింది. స్టార్‌ హీరోయిన్‌ గా మెప్పించింది. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశీ. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

బాలనటిగానే సినిమాల్లోకి వచ్చింది రాశీ. మద్రాస్‌లో వాహిని స్టూడియో పక్కన రాశీ పేరెంట్స్ టీ షాప్‌ నడిపించేవాళ్లు. వారి ద్వారా హీరోహీరోయిన్లు, దర్శకులు పరిచయం అయ్యారు. రాశీ చిన్నప్పుడు క్యూట్‌గా ఉండటంతో చైల్డ్ఆర్టిస్ట్ గా పెట్టుకున్నారు. అలా బాలనటిగా అలరించిన ఆమె, ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. అనేక సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే రాశీకి చిన్నప్పట్నుంచి ఓ ఫాంటసీ ఉండేది. అందరికి హీరోయిన్ కావాలనో, డాక్టర్‌ కావాలనో, ఇంజనీర్‌ కావాలనో, కలెక్టర్‌ కావాలనో ఇలా ఏదో ఒకటి అనుకుంటారు. 
 

36

కానీ రాశీ మాత్రం మంచి భార్య కావాలనుకుందట. ఇంట్లో ఇల్లాలుగా ఉండాలనుకుందట. స్కూల్‌లో తన టీచర్‌ అడిగితే, మంచి హౌజ్‌వైఫ్‌ అవుతా అని చెప్పిందట. అప్పుడు అంతా షాక్‌ అయ్యారు. రాశీ టేస్ట్ కి ఆశ్చర్యపోయారు. కానీ నిజంగానే రాశీలో ఈ పెళ్లి, ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉండేదట. టీనేజ్‌కి వచ్చేటప్పటికీ తాను హీరోలపై క్రష్‌ పెట్టుకునేదట. అలా ఓ స్టార్‌ హీరోపై క్రష్‌ పెట్టుకుందట రాశీ.
 

46

ఆయన ఎవరో కాదు హీరో వెంకటేష్‌. ఓ సినిమాలో ఆయన్ని చూసి ఇష్టం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటే ఆయన్నే చేసుకోవాలని డిసైడ్‌ అయ్యిందట. అంతేకాదు ఇంట్లో గొడవ కూడా చేసిందట. వెంకటేష్‌ హీరో అని, పెళ్లైంది, ఆయనకు పిల్లలు కూడా ఉన్నారని చెప్పినా వినలేదట, కొన్నాళ్లపాట్లు ఇంట్లో మారాం చేసిందట రాశీ. ఆ తర్వాత రాజీవ్‌ గాంధీని పెళ్లి చేసుకుంటానని రచ్చ చేసిందట. 

56

ఇలా ఇన్నోసెంట్‌గా ఉండేదట రాశీ. పెళ్లంటే అంత ఇష్టంగా ఉండేది. అంతేకాదు సినిమాలు చేస్తున్న సమయంలో తాను మ్యారేజ్‌ చేసుకుంటానని, మంచి అబ్బాయిని చూడమని డైరెక్టర్లు, నిర్మాతలకు కూడా చెప్పేందట. ఈ విషయాలను రాశీనే వెల్లడించడం విశేషం. `అలీతో సరదాగా` ప్రోగ్రామ్‌తోపాటు పలు యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది రాశీ. అయితే పెద్దయ్యాక వెంకటేష్‌తో ఒకటి రెండు సార్లు నటించే అవకాశం వచ్చిందని, కానీ సెట్‌ కాలేదని తెలిపింది. అయితే చివరికి `శీను` సినిమాలో మాత్రం వెంకటేష్‌తో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది రాశీ. 
 

66

రాశీ.. `పెళ్లిపందిరి`, `గోకులంలో సీత`, `శుభాకాంక్షలు`, `పండగ`, `సుప్రభాతం`, `మనసిచ్చి చూడు`, `డాడీ డాడీ`, `స్వప్నలోకం`, `కృష్ణబాబు`, `ప్రేయసి రావే`, `పోస్ట్ మ్యాన్‌`, `మూడు ముక్కలాట`, `అమ్మో ఒకటో తారీకా`, `దేవుళ్లు`, `మా ఆవిడి మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది`, `దీవించండి`, `సందడే సందడి`, `నిజం` వంటి సినిమాలతో నటిగా ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. `నిజం` తర్వాత ఆమె హీరోయిన్‌గా తెలుగులో సినిమాలకు గుడ్‌ బై చెప్పింది.

ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్‌ చేసి ఇక మ్యారేజ్‌ చేసుకుంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీముణిని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలు మానేసిన ఆమె కొన్నాళ్లు గ్యాప్‌ తీసుకుని ఇటీవల మళ్లీ సినిమాలు చేస్తుంది. అడపాదడపా మూవీస్‌లో మెరుస్తుంది. కాకపోతే చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. దీంతోపాటు వెబ్‌ సిరీస్‌లు, సీరియల్స్ లోనూ నటిస్తూ బిజీగా ఉంది రాశీ. 

Read more: పవన్‌ కళ్యాణ్‌, సౌందర్య చేయాల్సిన సినిమా ఏంటో తెలుసా? ఎలా మిస్‌ అయ్యింది? పవన్‌ భయపడ్డాడా?

Also read: యష్మికి ఓటేస్తే షో చూడటం మానేస్తా, నెటిజన్లు ఫైర్‌.. ఒక్క దెబ్బకి హీరో అయిపోయిన గౌతమ్‌

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR First Remuneration: ఎన్టీఆర్‌ తన ఫస్ట్ పారితోషికం ఏం చేశాడో తెలుసా? నెల రోజులు అదే పని, చివరికి
Recommended image2
ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?
Recommended image3
Narrow Escape: చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆరుగురు స్టార్లు, ఆ హీరోయిన్ కూడా.. అతడికి అదృష్టం మామూలుగా లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved