- Home
- Entertainment
- మంత్రగత్తెలా మెరిసిపోతున్న రాశీఖన్నా.. పలుచని కొంగుదాయలేని పరువాలతో పిచ్చెక్కిస్తున్న హాట్ హీరోయిన్
మంత్రగత్తెలా మెరిసిపోతున్న రాశీఖన్నా.. పలుచని కొంగుదాయలేని పరువాలతో పిచ్చెక్కిస్తున్న హాట్ హీరోయిన్
రాశీఖన్నా స్టార్ హీరోయిన్ ఇమేజ్‌కి ఒక్కడ అడుగు దూరంలో ఉన్న హీరోయిన్. అది అందినట్టే అంది వెళ్తుంది. హీరోయిన్‌గా నెక్ట్స్ లెవల్ కి చేర్చే సినిమా పడటం లేదు. అందుకోసం తాపత్రయపడుతోంది రాశీ.

తాజాగా రాశీఖన్నా(Raashi Khanna) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె చీరలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ అందం మరింత పెరగడం విశేషం. మామూలుగానే రాశీ రాజకుమారిలా ఉంటుంది. కాస్త అందంగా ముస్తాబైతే ఈ అమ్మడి అందం మరింత రెట్టింపు అవుతుంది.
ఇప్పుడు లైట్ పింక్ కలర్ శారీలో మెరిసిపోతుంది. డోర్ వద్ద నిల్చొని కవ్వించే పోజులిచ్చింది. ఇందులో రాశీ ఓ ఏంజెల్‌లా మెరిసిపోతుండటం విశేషం. నెటిజన్లు కూడా ఆమెని ఏంజెల్‌లా కీర్తిస్తున్నారు. అయితే లుక్ అందాల రాశీలా ఉన్నా,ఆమె ఇచ్చిన పోజులు మాత్రం హీటు పెంచేలా ఉన్నాయి. మత్తు ఎక్కిస్తున్నాయి.
రాశీఖన్నా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఆమె ఓ పోస్ట్ పెట్టింది. అది ఆసక్తికరంగా ఉండటం విశేషం. `మీరు చిన్న సందర్శన కోసమే ఇక్కడ ఉన్నారు. ఈ దారిలో పువ్వుల సువాసనలను కచ్చితంగా ఆస్వాదించండి అంటూ పోస్ట్ పెట్టింది.
ఇందులో రాశీఖన్నా జీవితానికి సంబంధించిన ఫిలాసఫీ చెప్పడం విశేషం. మనం ఈ భూమిపైకి ఓ గెస్ట్ లాగానే వచ్చామని, ఈ జీవిత జర్నీని అందంగా, ఆనందంగా మలుచుకోవాలని, జీవితంలోని మధురానుభూతులను పొందాలనే సందేశంతో రాశీ ఈ పోస్ట్ పెట్టిందని తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.
రాశీఖన్నా తాజాగా `సర్దార్`తో విజయాన్ని అందుకుంది. కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైంది. మంచి ఆదరణ పొందుతుంది. అయితే ఈ చిత్రంలో రాశీఖన్నా పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదట. అందుకే బహుశా ఆమె ప్రమోషన్స్ లోనూ పెద్దగా పాల్గొనలేదు.
ఇక తెలుగులో చివరగా రాశీఖన్నా `థ్యాంక్యూ` చిత్రంలో నటించింది. నాగచైతన్య హీరోగా రూపొందిన చిత్రమిది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా, దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం ఘోర పరాజయం చెందింది. అంతకు ముందు గోపీచంద్‌తో `పక్కా కమర్షియల్` చిత్రం చేసింది. అది కూడా పరాజయం చెందింది. దీంతో తెలుగుకి ఈ బ్యూటీ దూరమైందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో `యోధ` చిత్రంలో నటిస్తుంది. అలాగే `ఫర్జీ` అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తుంది. సినిమా ఛాన్స్ లు పెద్దగా లేకపోవడంతో మరోసారి గ్లామర్ డోస్ పెంచుతుంది. వరుసగా హాట్ ఫోటో షూట్లు చేస్తూ మేకర్స్ కి ఎర వేస్తుంది. అవకాశాలు ఏ మేరకు వస్తాయనేది చూడాలి.