- Home
- Entertainment
- ట్రెడిషనల్ లుక్ లో ఆకర్షిస్తున్న రాశీ ఖన్నా.. కొంటె చూపులతో మైమరిపిస్తున్న గ్లామర్ బ్యూటీ..
ట్రెడిషనల్ లుక్ లో ఆకర్షిస్తున్న రాశీ ఖన్నా.. కొంటె చూపులతో మైమరిపిస్తున్న గ్లామర్ బ్యూటీ..
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా (Raashi Khanna) ట్రెడిషనల్ లుక్ లో ఆకర్షిస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. అదిరిపోయే ఫోజులతో మైమరిపిస్తోంది.

ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఇంత వరకు ఈ బ్యూటీకి అసలై హిట్ పడకున్నా హీరోయిన్ గా మాత్రం మంచి ఆఫర్లనే అందుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. అటు బాలీవుడ్ లోనూ పలు ఆఫర్లు అందుకుంటోంది.
ఇటీవల సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతీ - గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial). ఈ మూవీలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. లాయర్ పాత్రలో రాశీ చక్కగా నటించి ప్రేక్షకులను అలరించింది.
పక్కా కమర్షియల్ మూవీతో ఇటు గోపీచంద్ (Gopichand), అటు రాశీకి కొంత పాజిటివ్ రెస్పాన్సే వచ్చిందని చెప్పొచ్చు. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. ప్రస్తుతం రాశీ ఖన్నా నటించిన ‘థ్యాంక్ యూ’ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
అలాగే మరో తమిళ చిత్రం ‘తిరుచిత్రంబలం’ కూడా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఆ చిత్ర యూనిట్స్ ప్రస్తుతం జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా రాశీ ఖన్నా కూడా అదిరిపోయే ఫోటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా మరిన్ని ఫొటోస్ ను పంచుకుంది.
ఎప్పుడూ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అందాలు ఆరబోసే ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. ఎల్లో చుడీదార్ లో రాశీ అందం రెండింతలైంది. కొంటె చూపులతో కుర్రాళ్ల గుండెల్ని ఇట్టే కొల్లగొడుతోందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాశీ ఖన్నా ఇన్నాళ్లు టాలీవుడ్ హీరోయిన్ గా వరుస చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ పాపులారిటీని పెంచుకుంటోంది. విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హిందీలో ‘యుద్ర’ అనే చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ‘సర్దార్’ అనే మరో చిత్రంలోనూ నటించింది.