రష్మిక కుక్క బిస్కెట్స్ తింటుంది, నాకు ముద్దు సీన్ లేదు ఐ యామ్ హ్యాపీ!
ఎవరికైనా ఆకలేస్తే స్నాక్స్, బిస్కెట్స్ , చాక్లెట్స్ తింటారు. కానీ రష్మిక మందాన కుక్క బిస్కెట్లు తింటుందట. ఈ విషయాన్ని ఆమెతో నటించిన ఓ హీరో స్వయంగా వెల్లడించాడు.

రష్మిక మందాన కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమెకు ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. బాలీవుడ్ లో సైతం బ్లాక్ బస్టర్స్ నమోదు చేస్తుంది. గత ఏడాది యానిమల్ మూవీతో అతిపెద్ద విజయం అందుకుంది. రన్బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈ ఏడాదికి గాను అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది. వరల్డ్ వైడ్ పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1700 కోట్ల మార్క్ దాటేశాయి. ఒక్క హిందీలోనే పుష్ప 2 చిత్రం రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రష్మిక మందాన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా పుష్ప 2 నిలిచింది. ఆమె ఫేమ్ మరో స్థాయికి తీసుకెళ్లింది.
Rashmika Mandanna
రష్మిక మందాన నటిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ సికిందర్. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కి జంటగా రష్మిక నటిస్తుంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. రంజాన్ కానుకగా 2025లో సికిందర్ విడుదల కానుంది. సాలిడ్ హిట్ కోసం ప్రయత్నం చేస్తున్న సల్మాన్ ఖాన్.. ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. పలువురు హీరోలకు లక్కీ చామ్ గా ఉన్న రష్మిక మందాన, సల్మాన్ కి కూడా హిట్ కట్టబెడుతుందేమో చూడాలి.
మళ్లీ బుక్కైన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న, న్యూ ఇయర్ వెకేషన్ కు వెళ్తున్నారా..?
సికిందర్ తో పాటు రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో రష్మిక నటిస్తుంది. గర్ల్ ఫ్రెండ్, రైన్ బో చిత్రాలతో ఇవి తెరకెక్కుతున్నాయి. ఇక రష్మిక చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కుబేర మూవీ. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకుడు. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ గా కోట్లు ఆర్జిస్తున్న రష్మిక మందానకు ఉన్న ఓ చెడ్డ అలవాటు ఉంది. ఆమె కుక్క బిస్కెట్లు తింటుందట. ఈ విషయాన్ని నితిన్ నేరుగా చెప్పాడు. రష్మిక-నితిన్ జంటగా భీష్మ మూవీ చేశారు. ఈ చిత్రానికి వెంకీ కుడుములు దర్శకుడు. భీష్మ సూపర్ హిట్ కొట్టింది. భీష్మ ప్రమోషనల్ ఈవెంట్లో నితిన్ ని యాంకర్ ఓ ప్రశ్న అడిగింది. మాకు ఎవరికీ తెలియని రష్మికకు సంబంధించిన ఒక రహస్యం చెప్పాలని కోరింది..
మనం ఆకలైతే స్నాక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ తింటాము. కానీ రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంది. ఆమెతో నాకు ముద్దు సీన్ లేనందుకు హ్యాపీ అన్నారు. రష్మిక చెప్పకు అని వారిస్తున్నా.. నితిన్ చెప్పేశాడు. రష్మిక మనసులో ఏమనుకుందో కానీ పాపం నవ్వుకుని వదిలేసింది. రష్మిక కుక్క బిస్కెట్లు తినడం హాట్ టాపిక్ అయ్యింది.