‘పుష్ప’ క్రేజ్ తగ్గేట్టే లేదుగా.. ‘దసరా’ పండగకు శ్రీవల్లి శారీస్.. ట్రెండింగ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్న కలిసి నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పుష్ఫ’ (Pushpa : The Rise) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ మూవీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఏదోరకంగా ట్రెండ్ అవుతూనే ఉంది.

క్రియేటివ్ అండ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఏముహూర్తాన ‘పుష్ఫ : ది రైజ్’ చిత్రానికి ముహూర్తం పెట్టాడోగానీ చిత్రం రిలీజ్ నాటి నుంచి ఇప్పటి వరకు ఏదో రకంగా ట్రెండింగ్ లోనే ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపిన ‘పుష్ఫ’ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది.
‘పుష్ఫ’ చిత్రంలో ప్రతిది పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేశారు దర్శకుడు సుకుమార్. 24 క్రాఫ్ట్స్ లో ఎక్కడా లోపం లేకుండా చూశారు. ఫలితంగా ఆడియెన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. డైలాగ్స్, పుష్ఫ రాజ్ మేనరిజం, సాంగ్స్, ఫైట్స్, క్యారెక్టరైజేషన్ పరంగా ట్రెండ్ సెట్ చేసిందీ చిత్రం. తాజాగా ఈ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న ధరించిన కాస్ట్యూమ్స్ ట్రెండింగ్ గా మారాయి.
శ్రీవల్లి పాత్ర కోసం కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతీషీల్ సింగ్ డిసౌజా (Preetisheel Singh D'Souza) ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా ‘రారా స్వామి’ పాటలో రష్మిక మందన్న ధరించిన గ్రీన్ బ్లౌజ్, రెడ్ శారీ ఆడియెన్స్ ను ఎంతగానో నచ్చింది. ఈ దుస్తులు వెండితెరపైనా కొట్టొచ్చినట్టు కనిపించాయి.
ప్రస్తుతం ఆ శారీలను ‘శ్రీవల్లి శారీస్’ పేరిట మార్కెట్లో సేల్ చేస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలు, మహిళలు కూడా సమీపిస్తున్న పండుగల్లో Srivalli Sarees ను ధరించాలని కోరకుంటున్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని ఆయా దుకాణాల్లో ఇప్పటికే ఈ స్టాక్ వచ్చేసింది.
దీంతో సోషల్ మీడియాలో శ్రీవల్లి శారీస్ కు సంబంధించిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ‘పుష్ఫ రాజ్’ పాత్రలో అల్లు అర్జున్ ధరించిన టీషర్ట్, షర్ట్స్ కూడా మార్కెట్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ‘పుష్ఫ’ ప్రింటెండ్ షర్ట్స్, వెహికిల్స్ పైనా ‘పుష్ఫ’ టైటిల్ ను, అల్లు అర్జున్ ఫొటోలను ప్రింట్ చేసి ట్రెండ్ చేశారు. తాజాగా శ్రీవల్లి శారీస్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
‘పుష్ఫ’ మొదటి పార్ట్ విజయవంతం కావడంతో.. రెండో పార్ట్ ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ‘పుష్ఫ2’లో మరిన్ని క్యారెక్టర్లు కూడా యాడ్ చేయనున్నట్టు తెలిపారు. ఇటీవలనే గ్రాండ్ గా పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ నెలలోనే మూవీ రెగ్యూలర్ షూట్ కూడా ప్రారంభం కానుంది.