అనసూయ అందాలను దగ్గరగా ఆస్వాదిస్తున్న ఆయనదే అదృష్టం... అసలు తగ్గడం లేదుగా!
రొమాంటిక్ వెకేషన్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది అనసూయ. నచ్చిన బట్టలు ధరిస్తూ, రుచికరమైన భోజనం తింటూ, ఇష్టమైన ప్రదేశాల్లో భర్తతో విహరిస్తోంది.

Anasuya Bharadwaj
అనసూయ తన టూర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ప్రస్తుతం ఆమె థాయిలాండ్ లో ఉన్నట్లు సమాచారం. తాజాగా డెనిమ్ షార్ట్, షర్ట్ ధరించి కిరాక్ ఫోజుల్లో అల్లాడించింది. అనసూయ అందాలను భర్త సుశాంక్ భరద్వాజ్ కెమెరాలో బంధించాడు. ఈ క్రమంలో ఆయనదే అదృష్టం అంటున్నారు.
Anasuya Bharadwaj
తమ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో భాగంగా అనసూయ విదేశాలకు వెళ్లారు . విదేశాల్లో విహంగంలా స్వేచ్ఛగా విహరిస్తోంది. ఈ టూర్ లో అనసూయ బికీనీ వేయడం విశేషం. ఎప్పటి నుండి ఫ్యాన్స్ ఆమెను బికినీలో చూడాలని కోరుకుంటున్నారు. అది కూడా తీర్చేసింది.
Anasuya Bharadwaj
ఇక అనసూయ నటించిన చిత్రం విమానం జూన్ 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో అనసూయ వేశ్య పాత్ర చేయడం కొసమెరుపు. సుమతి అనే వేశ్యగా ఆమె నటిస్తున్నారు. అనసూయపై తెరకెక్కిన సాంగ్ విడుదల చేయగా ఆకట్టుకుంది.
Anasuya Bharadwaj
అదే సమయంలో అనసూయ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య యుద్ధం నడిచింది. అనసూయను వాళ్ళు ట్రోల్ చేశారు. అనసూయ ఏమాత్రం తగ్గలేదు. నేనేమిటో చూపిస్తానంటూ సవాల్ విసిరారు.
Anasuya Bharadwaj
పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది.
Anasuya Bharadwaj
యాంకరింగ్ మానేసిన అనసూయ పూర్తి దృష్టి నటనపై పెట్టారు. ఆమెకు ఆఫర్స్ సైతం వెల్లువెత్తుతున్నాయి. అనసూయ సంపాదన కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. ఒక్కో కాల్షీట్ కి లక్షల్లో వసూలు చేస్తున్నారట. షాప్ ఓపెనింగ్స్, ప్రమోషన్స్ ద్వారా మరికొంత సంపాదిస్తున్నారు.