- Home
- Entertainment
- ఇంత అమాయకుడిని సుకుమార్ విలన్ ని ఎలా చేశాడో.. భార్య తన పాదాలు నమస్కరించేందుకు ప్రయత్నిస్తే
ఇంత అమాయకుడిని సుకుమార్ విలన్ ని ఎలా చేశాడో.. భార్య తన పాదాలు నమస్కరించేందుకు ప్రయత్నిస్తే
పుష్ప 1 లో కొండారెడ్డి బ్రదర్ పాత్రలో కన్నడ నటుడు ధనంజయ్.. జాలి రెడ్డిగా నటించాడు. పుష్ప లో ప్రత్యేకంగా నిలిచిన పాత్రల్లో ఇది కూడా ఒకటి. రీసెంట్ గా ధనంజయ్ ఓ ఇంటివాడు అయ్యారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించాయి. పుష్ప 2 అయితే ఇండియాలో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పుష్ప 1 లో కొండారెడ్డి బ్రదర్ పాత్రలో కన్నడ నటుడు ధనంజయ్.. జాలి రెడ్డిగా నటించాడు. పుష్ప లో ప్రత్యేకంగా నిలిచిన పాత్రల్లో ఇది కూడా ఒకటి. రీసెంట్ గా ధనంజయ్ ఓ ఇంటివాడు అయ్యారు.
ధన్యత అనే డాక్టర్ ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం మొదలు పెట్టారు. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా ధనంజయ్ వివాహం జరిగింది. ధన్యత గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. వీళ్లిద్దరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే పెళ్లిలో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. చాలా క్యూట్ గా ఉన్న ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్ళిలో హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త కాళ్ళకి భార్య నమస్కరించడం ఆనవాయితీ. పూజారి ధన్యతని ధనంజయ్ పాదాలకి నమస్కరించమని చెబుతారు. దీనితో ధన్యత అతడి పాదాలు తాకేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ధనంజయ్ వద్దు పర్లేదు అని చెబుతాడు.
పాదాలు ముందుకు పెట్టు దండం పెట్టుకుంటా అని ధన్యత బతిమాలినా వినడు. దీనితో చివరికి ధన్యత అతడి గడ్డం రిక్వస్ట్ చేస్తుంది. అప్పుడు ధనంజయ్ అంగీకరిస్తాడు. ధన్యత తన పాదాలు నమస్కరించిన వెంటనే ధనంజయ్ కూడా మీ పాదాలకు నమస్కరిస్తాడు. ఈ దృశ్యాలు చాలా ఫన్నీగా, క్యూట్ గా ఉన్నాయి.
Dhananjay
ఈ రోజుల్లో ఇలాంటి జంట చాలా అరుదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే ఇంకా ఫన్నీగా ధనంజయ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇంత అమాయకుడిని సుకుమార్ పుష్ప చిత్రంలో విలన్ గా ఎలా చూపించడబ్బా అని కామెంట్స్ పెడుతున్నారు. పుష్ప చిత్రంలో ధనంజయ్ జాలిరెడ్డి పాత్రలో మహిళలపై వ్యామోహం ఉన్నట్లు నటించాడు. కానీ ఆ పాత్రకి పూర్తి విరుద్ధంగా రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్ గా ఉన్నారు.