పుష్ప 3 ఉంటుందా, లేదా? సైమా వేదిక పై సంచలన ప్రకటన చేసిన సుకుమార్
పుష్ప రెండు సినిమాలు అల్లు ఫ్యాన్స్ నే కాకుండా, సినిమా ప్రియులందరిని ఎంతగానో అలరించాయి. ఈక్రమంలో పుష్ప3 పై రకరకాల ఊహగానాలు షికార్లు చేస్తున్నవేళ, అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు డైరెక్టర్ సుకుమార్. ఆయన ఏమన్నారంటే?

సైమాలో సత్తా చాటిన పుష్ప2
సైమా 2025 అవార్డుల వేడుక దుబాయ్‌లో భారీగా జరిగింది. ఈ సందర్భంగా సౌత్ నుంచి పెద్ద పెద్ద స్టార్లు ఇందులో సందడి చేశారు. ఈక్రమంలో ఎన్నో సినిమా, మరెంతో మంది స్టార్స్ సైమా అవార్డ్స్ అందుకున్నారు. ఈక్రమంలో పుష్ప 2: ది రూల్ సినిమాకు అవార్డుల పంట పండింది. ఎన్నో విభాగాల్లో నామినేషన్లు సాధించింది. ఫలితంగా ఈ సినిమా ఐదు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది:
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్
ఉత్తమ నటి: రష్మిక మందన్న
ఉత్తమ దర్శకుడు: సుకుమార్
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
ఉత్తమ గాయకుడు: శంకర్ మహాదేవన్
పుష్ప3 పై సుకుమార్ క్లారిటీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్తకు సైమా 2025 అవార్డుల వేడుక వేదికైంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఈ వేడుకలో పాల్గొని పుష్ప సిరీస్‌కు సంబంధించి ఎంతో కీలక ప్రకటన చేశారు. “పుష్ప 3 కచ్చితంగా వస్తుంది” అని ఆయన వేదికపై నుండి అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో గత కొంతకాలంగా పుష్ప 3 సినిమాపై కొనసాగుతున్న అనుమానాలకు తెరపడినట్లయింది. ఇప్పటివరకు పుష్ప 3 గురించి కొన్ని ప్రచారాలే బయటకు వచ్చాయి. "Pushpa 3: The Rampage" అనే టైటిల్‌తో ఓ పోస్టర్ మినహా, ప్రాజెక్ట్‌పై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో ఎన్నో అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు సుకుమార్ ప్రకటనతో సినిమాపై స్పష్టత వచ్చింది.
భారీ అంచనాలు
దర్శకుడు సుకుమార్, ఉత్తమ దర్శకుడిగా అవార్డు స్వీకరించిన అనంతరం పుష్ప ఫ్రాంచైజీపై స్పష్టతనిచ్చారు. "పుష్ప 3 కచ్చితంగా ఉంటుంది" అని ఆయన వేదికపై ప్రకటించడంతో, అల్లు అర్జున్ అభిమానుల హర్షం మిన్నంటింది. పుష్ప సిరీస్ మొదటి భాగం "పుష్ప: ది రైజ్" 2021లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాతి భాగమైన "పుష్ప 2: ది రూల్" 2024లో భారీ అంచనాల మధ్య విడుదలై కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు, సుకుమార్ అధికారిక ప్రకటనతో పుష్ప 3 కూడా తెరపైకి వస్తుండడం సినిమా పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.
పుష్ప3 ముహూర్తం ఎప్పుడు?
ఈ నేపథ్యంలో, పుష్ప 3 సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయా? ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది? కథ ఎలా ఉండబోతోంది? అన్న విషయాల్లో ఇంకా అధికారిక సమాచారం అందాల్సి ఉంది. సుకుమార్ రామ్ చరణ్ తో ఓ సినిమాచేయబోతున్నాడు, అటు అల్లు అర్జున్ అట్లీతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దాంతో ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కుతుందా అన్న డౌట్ మాత్రం ఫ్యాన్స్ లో ఉంది. అయితే, దర్శకుడు స్వయంగా ఇచ్చిన హామీతో పుష్ప 3పై అభిమానుల్లో నమ్మకం ఏర్పడినట్టు అయ్యింది. అయితే పుష్ప 3కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక “పుష్ప: ది ర్యాంపేజ్” టైటిల్‌తోనే మూడో భాగం వస్తుందా లేక కొత్త టైటిల్‌తో రానుందా అనే దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది.