అల్లు అర్జున్ నో అన్నాడు, నాని మాత్రం హిట్ కొట్టాడు, ఇంతకీ ఏంటా సినిమా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొన్ని సినిమాలు వదలుకున్న సంగతి తెలిసిందే. ఆయన వదలుకున్న కథలతో కొంత మంది హీరోలు హిట్ సినిమాలు చేశారు. ఈక్రమంలేనే బన్నీ నో చెప్పిన సినిమాతో నాని హిట్ కోట్టాడని మీకు తెలుసా? ఇంకీ ఏంటా సినిమా?

స్టార్ హీరోలు చాలా కథలను మిస్ చేసుకోకండం ఇండస్ట్రీలో సహజంగానే జరుగుతుంటుంది. ఆ కథలు వేరే హీరోలు చేసి హిట్ కొట్టిన సందర్భాలు కూడా అనేకం. ఈక్రమంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల కథను రిజెక్ట్ చేశాడు. అందుకు బెస్ట్ ఎజ్జాంపుల్ అర్జున్ రెడ్డి. ఈసినిమాను ఆయన చేయలేదు. కాని విజయ్ దేవరకొండ ఈసినిమాతో సెన్సేషనల్ స్టార్ గా మారడు. ఇలా అల్లు అర్జున్ వద్దు అనుకున్న మరో కథలో నేచ్యూరల్ స్టార్ నాని హిట్ సినిమాను చేశారనిమీకు తెలుసా? ఇంతకీ ఏంటా సినిమా?
టాలీవుడ్ లో కథలు హీరోల చేతులు మారడం సర్వసాధారణం. ఒక్కోసారి మొదట ఒక హీరోకు ఉద్దేశించిన కథ, వివిధ కారణాలతో మరో హీరో వద్దకు చేరి భారీ హిట్స్ అందుకుంటుంది. అలాంటి సినిమాలకు ఉదాహరణ నాని నటించిన గ్యాంగ్ లీడర్. ఈ సినిమా కథను ముందుగా అల్లు అర్జున్ కోసం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాని ఆయన ఈసినిమాను చేయడానకిి ఇష్టపడలేదట. అఫీషియల్ గా ఈ విషయం తెలియకపోయినా ఇండస్ట్రీలో మాత్రం ఇది హాట్ టాపిక్ గా మారింది.
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్, పుష్ప, పుష్ప 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మరోవైపు న్యాచురల్ స్టార్ నాని మాత్రం తన ప్రతిభతో టాలీవుడ్‌లో స్థిరంగా ఎదిగిన హీరో. తాజాగా నాని నటించిన హిట్ 3 సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఘన విజయం సాధించింది.
టాలీవుడ్ నుంచి వచ్చిన ఆసక్తికర సమాచారం ప్రకారం, 2019లో విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా కథను మొదటగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ అల్లు అర్జున్ కు వినిపించాడట. బన్నీకి కథ నచ్చినప్పటికీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఇందుకు కారణం అప్పటికే కమిట్ అయిన ఇతర సినిమాలు కావచ్చు, కానీ అధికారికంగా కారణాలు వెల్లడి కాలేదు.ఆపై అదే కథను నానితో తెరకెక్కించిన విక్రమ్ కుమార్, గ్యాంగ్ లీడర్ పేరుతో 2019లో విడుదల చేశాడు. ఇందులో నానికి జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, విలన్ పాత్రలో కార్తికేయ గుమ్మకొండ కనిపించారు. ఇది ఒక రివెంజ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల మన్ననలు పొందింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.
గ్యాంగ్ లీడర్ సినిమా నానికెరీర్ లో మైలురాయిగా నిలిచింది. గ్యాంగ్ లీడర్ తర్వాత కూడా దర్శకుడు విక్రమ్ కుమార్ మరో రెండు మూడు కథలు అల్లు అర్జున్ కు వినిపించినా, అవి వర్కౌట్ కాలేదని సమాచారం. ఒక కథని ఎవరు చేస్తున్నారు అనేది మాత్రమే కాదు, ఎవరు వదిలిపెడుతున్నారు అన్నదీ అప్పుడప్పుడు కీలకంగా మారుతోంది. ఈ విషయంలో గ్యాంగ్ లీడర్ సినిమా ఉదాహరణగా నిలిచింది.