- Home
- Entertainment
- ప్రభాస్ ఆధార్ కార్డు లో ఎలా ఉన్నాడో చూశారా, యంగ్ రెబల్ స్టార్ అసలు పేరు, వయసు ఎంతంటే?
ప్రభాస్ ఆధార్ కార్డు లో ఎలా ఉన్నాడో చూశారా, యంగ్ రెబల్ స్టార్ అసలు పేరు, వయసు ఎంతంటే?
పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆధార్ కార్డులో ఎలా ఉన్నాడో చూశారా? అందులో ఆయన అసలు పేరు ఏమని ఉంటుందో తెలుసా? ఇంతకీ ప్రభాస్ అసలుపేరు ఏంటి?

దూసుకుపోతున్న ప్రభాస్
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వెంట వెంటనే రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రభాస్, నెక్ట్స్ రాజాసాబ్ సినిమాతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. బాహుబలి సిరీస్ ల హిట్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించిన ప్రభాస్, ఆతరువాత వరుసగా మూడు సినిమాలు ప్లాప్అవ్వడంతో డేంజర్ జోన్ లోకివెళ్లిపోయాడు, హ్యాట్రిక్ ఫెయిల్యూర్ తరువాత కూడా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పట్టుదలతో సినిమాలు చేస్తూ..మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు యంగ్ రెబల్ స్టార్. ఈక్రమంలోనే ప్రభాస్ కు సబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభాస్ ఆధార్ కార్డు వైరల్
ఇటీవల సోషల్ మీడియాలో “ప్రభాస్ ఆధార్ కార్డు” అంటూ ఒక చిన్న వీడియో చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని, అందులో ప్రభాస్ అతని పూర్తి పేరు, పుట్టిన తేది, ఆధార్ నంబర్ వంటి వివరాలు కనిపిస్తున్నాయి. దీనిపై ప్రభాస్ అభిమానులలో ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో మరింతగా వైరల్ చేస్తున్నారు. ఇది నిజంగా ప్రభాస్ ఆధార్ కార్డేనా, లేక ఏదైనా ఎడిటింగ్ చేసి ఇలా వేశారా అనేది తెలియడంలేదు. అఫీషియల్ గా మాత్రం ఈ కార్డును ఎవరు గుర్తించలేదు.
ప్రభాస్ అసలు పేరు
ఈ వీడియోలో కనిపించిన ఆధార్ కార్డు ప్రకారం ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్. పుట్టిన తేది 23-10-1979గా పేర్కొనబడింది. ఆధార్ నంబర్ 5986 6623 9932గా చూపబడుతోంది. అయితే ఈ ఆధార్ డేటా నిజమైనదేనా లేదా అనేది ఇప్పటికీ అధికారికంగా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ, ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం సూపర్ ఫాస్ట్ గా వైరలవుతోంది.
ఆధార్ కార్డులో ప్రభాస్ ఎలా ఉన్నాడంటే?
ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ ఆధార్ కార్డు ఫొటోలో ఉన్న ప్రభాస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. బయట ఎంత అందంగా ఉన్నా. ఆధార్ కార్డులో ఫోటోలు ఎలా వస్తాయో అందరికి తెలుసు. కాని ప్రభాస్ ఓల్డ్ లుక్ ఫోటో మాత్రంఆధార్ లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ప్రభాస్ ఫోటోను చూసి ఫ్యాన్స్ మాత్రం భలే ఉన్నాడు మా హీరో అంటున్నారు. “ఆ ఫొటోలో కూడా డార్లింగ్ ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో చూడండి!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసి కొందరు ఫ్యాన్స్ ఫోటోను డౌన్‌లోడ్ చేసుకుని ప్రొఫైల్ పిక్చర్‌గా కూడా పెట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్ కామెడీ చిత్రం 'ది రాజా సాబ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా 2025 డిసెంబర్లో, క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.ఇకపోతే, 'ది రాజా సాబ్'తో పాటు ప్రభాస్ చేతిలో స్పిరిట్, ఫౌజీ, సలార్ 2, కల్కి 2 సినిమాలు ఉన్నాయి. గతేడాది విడుదలైన కల్కి 2898 ఏ.డి. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ప్రభాస్ హవా మరింతగా పెరిగింది.
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు?
ఇక ప్రభాస్ పెళ్లిపై చాలా కాలంగా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ ఆధార్ కార్డు ప్రకారం ప్రభాస్ ప్రస్తుతం 46 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ బ్యాచిలర్‌గానే ఉన్నాడు ప్రభాస్. ఆయన పెళ్లి గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లిపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుష్కతో లవ్ అంటూ ఎప్పటి నుంచో రూమర్స్ నడుస్తున్నాయి. ఈక్రమంలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ, “ప్రభాస్ పెళ్లి చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను,” అని వ్యాఖ్యానించారు.