`గేమ్ ఛేంజర్`కి లైన్ క్లీయర్.. `పుష్ప 2` టీమ్ వెనక్కి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న దిల్ రాజు
రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్`కి లైన్ క్లీయర్ అయ్యింది. దిల్ రాజు ఊపిరి పీల్చుకున్నారు. కారణం `పుష్ప 2` టీమ్ వెనక్కి తగ్గడమే. మరి ఇంతకి ఏం జరిగింది? ఆ కథేంటి?
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన `గేమ్ ఛేంజర్` మూవీ మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ సుమారు రూ. 450కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ముఖ్యపాత్రలు పోషించారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
`గేమ్ ఛేంజర్` విడుదల వేళ `పుష్ప 2` రూపంలో పెద్ద అడ్డంకి వచ్చింది. `గేమ్ ఛేంజర్`కి మాత్రమే కాదు, సంక్రాంతి సినిమాలన్నీంటికి షాకిచ్చేలా `పుష్ప 2` టీమ్ నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ ఇప్పటికే భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నార్త్ లో దుమ్మురేపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా `బాహుబలి 2` రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. ఈ క్రమంలో దీనికి మరికొంత కంటెంట్‌ని యాడ్ చేస్తున్నారు.
read more: 'గేమ్ ఛేంజర్' కాపీనా? స్టార్ హీరో సినిమా కథే, రిలీజ్ కి ముందు మరో వివాదం
లెంన్త్ ఎక్కువ కావడం వల్ల కొంత కంటెంట్‌ని పక్కన పెట్టింది టీమ్. అయినా `పుష్ప 2` మూడు గంటల ఇరవై నిమిషాలతో విడుదల చేశారు. నిడివిని లెక్క చేయకుండా ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు మరో ఇరవై నిమిషాలు యాడ్ చేయాలని ప్లాన్ చేశారు. `పుష్ప 2 రీలోడెడ్` పేరుతో జనవరి 11 నుంచి మరో ఇరవై నిమిషాలు యాడ్ చేస్తామని టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇది `గేమ్ ఛేంజర్`,`డాకు మహారాజ్`, `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలకు పెద్ద ఎఫెక్ట్ కాబోతుందని భావించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వణికిపోయారు. అయితే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది `పుష్ప 2` టీమ్. కొంత ఆలస్యంగా జనవరి 17 నుంచి యాడ్ చేయబోతున్నట్టు తెలిపింది.
కొన్ని టెక్నీకల్ కారణాలతో కొత్త కంటెంట్‌ని యాడ్ చేయలేకపోతున్నామని, జనవరి 11 నుంచి `పుష్ప 2` లో కొత్త కంటెంట్ యాడ్ కావడం లేదని, జనవరి 17 నుంచి కలుపబోతున్నట్టు తెలిపింది. దీంతో అటు నిర్మాత దిల్ రాజు, `గేమ్ ఛేంజర్` టీమ్, అలాగే `డాకు మహారాజ్` టీమ్, `సంక్రాంతికి వస్తున్నాం` టీమ్ ఊపిరి పీల్చుకుంది.
also read: నాగార్జున పాటకి బాలకృష్ణ ఊరమాస్ డాన్స్ చూశారా? ఈ అరుదైన సందర్భానికి కారణం ఏంటంటే?
అయితే `పుష్ప 2`లో మరో ఇరవై నిమిషాలు యాడ్ చేస్తున్నారని తెలిసి భయపడ్డ దిల్ రాజు `పుష్ప 2` టీమ్‌తో మాట్లాడి దాన్ని పోస్ట్ పోన్ చేయించాడట. సంక్రాంతి సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో వాళ్లు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది.
లేదంటే ఆ మూవీకే ఆడియెన్స్ మళ్లీ క్యూ కడితే సంక్రాంతి సినిమాలకు కలెక్షన్ల పరంగా పెద్ద దెబ్బ అవుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మొత్తంగా దిల్ రాజు ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యారని చెప్పొచ్చు.
అల్లు అర్జున్ హీరోగా రూపొందిన `పుష్ప 2` సినిమాకి సుకుమార్ దర్శకుడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా, ఫహద్ ఫాజిల్ నెగటివ్ రోల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 1800కోట్లు దాటింది. `బాహుబలి 2` కలెక్షన్లని దాటేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ కలెక్షన్లు 1600 కోట్లలోనే ఉంటాయని టాక్. నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది.
read more: సంక్రాంతికి ప్రభాస్ కొత్త సినిమా ప్రకటన?, దర్శకుడు ఎవరో తెలిస్తే పూనకాలే!