బన్నీని రాజకీయాల్లోకి లాగొద్దు..పుష్ప 2 నుంచి జానీ మాస్టర్ అవుట్, పవన్ కళ్యాణ్ సాయంపై నిర్మాతల కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం హంగామా మొదలైంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నిర్మాతలు గుడ్ న్యూస్ చెప్పారు. అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుగానే పుష్ప 2 చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అంటే డిసెంబర్ 6న కాకుండా డిసెంబర్ 5నే పుష్ప రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం హంగామా మొదలైంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నిర్మాతలు గుడ్ న్యూస్ చెప్పారు. అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుగానే పుష్ప 2 చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అంటే డిసెంబర్ 6న కాకుండా డిసెంబర్ 5నే పుష్ప రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. లాంగ్ వీకెండ్ కోసం డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ తెలిపారు.
గ్రాండ్ గా మీడియా సమావేశం నిర్వహించి పుష్ప 2 రిలీజ్ డేట్ ని డిసెంబర్ 6 నుంచి 5 కి మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. మీడియా ప్రతినిధులు అడిగిన అన్ని ప్రశ్నలకు పుష్ప 2 నిర్మాతలు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో కొన్ని వివాదస్పద ప్రశ్నలు కూడా చర్చకు వచ్చాయి.
గత ఎన్నికల నేపథ్యంలో అల్లు అర్జున్ పై కాస్త ట్రోలింగ్ జరిగింది. మెగా ఫ్యామిలీ గతంలో ఉన్నంత యూనిటీగా లేదని ప్రచారం జరుగుతోంది. రాజకీయాల వల్ల మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా విడిపోయినట్లు సోషల్ మీడియా ద్వారా రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2కి మెగా ఫ్యాన్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. నిర్మాత నవీన్ ఎర్నేని స్పందిస్తూ ఎలక్షన్ సమయంలో చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్యాన్స్ అంతా ఒక్కటే అని అన్నారు.
వెంటనే రవిశంకర్ మాట్లాడుతూ దయచేసి అల్లు అర్జున్ ని రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు అని చెప్పారు. అల్లు అర్జున్ కి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అని రవిశంకర్ అన్నారు. ఇలాంటి వివాదాస్పద ప్రశ్నలు అడగొద్దని రిక్వస్ట్ చేశారు. టికెట్ ధరల విషయం కూడా చర్చకి వచ్చింది. బెనిఫిట్ షోల వల్ల ఫ్యాన్స్ జేబులు ఖాళీ అవుతున్నాయి. టికెట్ ధర వేలల్లో ఉంటోంది అని ప్రశ్నించగా.. బెనిఫిట్ షోలు ఎంజాయ్ చేసేది ఫ్యాన్స్ మాత్రమే. అల్లు అర్జున్ సినిమా మూడేళ్ళ తర్వాత వస్తోంది. మూడేళ్ళకి ఒకసారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తే తప్పేముంది అని రవిశంకర్ అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీ హీరోనే కాదా.. టికెట్ ధరల విషయంలో ఇండస్ట్రీకి ఆయన సపోర్ట్ ఎలా ఉంది అని అడిగారు. కళ్యాణ్ గారు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. సినిమా బట్టి టికెట్ ధరలు పెట్టుకోండి అంటూ ఇండస్ట్రీకి ఆయన ఎంతో సాయం చేస్తున్నారు అని మైత్రి నిర్మాతలు తెలిపారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Jani master
ఇటీవల టాలీవుడ్ లో జానీ మాస్టర్ సంఘటన కూడా పెద్ద వివాదం అయింది. ఇటీవల జానీ మాస్టర్ కి బెయిల్ కూడా వచ్చింది. ఆయన పుష్ప 2లో ఒక సాంగ్ చేయాల్సింది. కానీ ఈ కాంట్రవర్సీ వల్ల కుదర్లేదు. ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి పుష్ప 2లో ఆయనతో సాంగ్ చేయిస్తారా అని అడగగా నవీన్ యెర్నేని లేదని అన్నారు. ఆ సాంగ్ కి వేరే డ్యాన్స్ మాస్టర్ సెట్ అయ్యారని ప్రకటించారు. మొత్తంగా జానీ మాస్టర్ కి పుష్ప 2 ఛాన్స్ పోయింది.