MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లైగర్ దెబ్బతో కొడుకు దగ్గరికి వచ్చిన పూరి.. రూటు మారింది, బండ్ల గణేష్ మాటలు నిజమవుతాయా ?

లైగర్ దెబ్బతో కొడుకు దగ్గరికి వచ్చిన పూరి.. రూటు మారింది, బండ్ల గణేష్ మాటలు నిజమవుతాయా ?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద డబుల్ డిజాస్టర్ గా మారిపోయింది. ఈ సినిమా పరిస్థితి ఇంత ఘోరంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 05 2022, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద డబుల్ డిజాస్టర్ గా మారిపోయింది. ఈ సినిమా పరిస్థితి ఇంత ఘోరంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. సరైన కథ లేకుండా పైపై మెరుగులతో ఒక రేంజ్ లో బిల్డప్ ఇవ్వడం.. తీరా థియేటర్స్ లో సినిమా విసుగు పుట్టించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

లైగర్ ప్రభావంతో పూరి, విజయ్ కాంబోలో తెరకెక్కాల్సిన జనగణమన కూడా ఆగిపోయింది. దీనితో పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం ఏంటనే చర్చ మొదలైంది. పూరి జగన్నాధ్ కమర్షియల్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు. అందులో తిరుగులేదు. కానీ లైగర్ రిజల్ట్, రీసెంట్ గా పూరి ట్రాక్ రికార్డ్ గమనిస్తే.. ఈ డాషింగ్ డైరెక్టర్ స్టార్ హీరోలెవరూ సినిమా చేసేందుకు సాహసించని పరిస్థితి. 

36

అయితే పూరి జగన్నాధ్ నెక్స్ట్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. పూరి జగన్నాధ్ తన తనయుడు ఆకాష్ పూరితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తన కథలతో సాహసం చేయకుండా తన కొడుకు కోసం పూరి రీమేక్ కథని నమ్ముకున్నారట. అత్యంత ఆసక్తికరంగా సాగే కొరియన్ చిత్రాన్ని పూరి చూశారట. 

46

ఆ మూవీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ గా ఆ కొరియన్ చిత్రాన్ని ఆకాష్ పూరి హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఆకాష్ తో పూరి జగన్నాధ్ మెహబూబా అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ మూవీ డిజాస్టర్ గా మారింది. 

56

ఇప్పుడు తన కొడుకుని హీరోగా పెట్టి అయినా బౌన్స్ బ్యాక్ కావాలని పూరి ట్రై చేస్తున్నారు. ఈ మూవీ గురించి న్యూస్ రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు బండ్ల గణేష్ మాటలు గుర్తు చేసుకుంటున్నారు. పూరి గురించి విమర్శనాత్మకంగా మాట్లాడుతూ.. ఎవరెవరినో స్టార్స్ సూపర్ స్టార్స్ చేస్తావు.. నీ కొడుకుని స్టార్ చెయ్ అన్నా అంటూ కామెంట్స్ చేశాడు. చోర్ బజార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ ఈ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 

66
Puri jagannadh

Puri jagannadh

వ్యాంపులు ర్యాంపులు వస్తుంటారు పోతుంటారు.. ఫ్యామిలీ ముఖ్యం అంటూ బండ్ల గణేష్ పూరికి చురకలు అంటించడం.. ఆ తర్వాత పూరి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి బండ్ల గణేష్ మాటలు నిజమై.. పూరి జగన్నాధ్ తన కొడుకుని స్టార్ హీరో చేస్తాడేమో చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image2
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image3
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved