పూరి జగన్నాథ్ తమ్ముడు `ఒక పథకం ప్రకారం` ఏం చేశాడో తెలుసా? అన్నయ్య లోటు కనిపిస్తుందా?
దర్శకుడు పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా సక్సెస్ అయ్యాడు, కానీ మధ్యలో బ్రేక్ వచ్చింది. కానీ ఇప్పుడు రెట్టింపు ఎనర్జీతో వస్తున్నాడు.

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవల కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆదరణ పొందటం లేదు. సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయనే కాదు, ఆయన తమ్ముడు హీరో సాయి రామ్ శంకర్ పరిస్థితి కూడా అంతే. ఆయన వెండితెరపై కనిపించి చాలా ఏళ్లు అవుతుంది.
ఇప్పుడు కమ్ బ్యాక్ కోసం వస్తున్నాడు. `ఒక పథకం ప్రకారం` వస్తున్నాడు. ఇదే ఆయన చేస్తున్న సినిమా. `ఒక పథకం ప్రకారం` పేరుతో తెరకెక్కుతుంది. ఈ మూవీకి వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో వినోద్ విహాన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్ పై గార్లపాటి రమేష్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని మంగళవారం విడుదల చేశారు.
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని, సరికొత్త ట్రీట్‌ని ఇస్తుందని, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా అలరిస్తుందని, కొత్త అనుభూతిని ఇస్తుందని టీమ్ తెలిపింది. ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. అయితే సినిమాని జనాల్లోకి వెళ్లేందుకు ఓ ప్రమోషనల్ కంటెంట్‌ని వాడారు.
ఇందులో విలన్ ఎవరో ఫస్టాఫ్ వరకు గుర్తిస్తే పది వేల రూపాయలు ఇస్తామనే కంటెస్టెంట్ పెట్టారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. హీరో సాయి రామ్ శంకర మాట్లాడుతూ, ఇది నా కెరీర్ కి ఎంతో హెల్పయ్యే సినిమా. నాకు కచ్చితంగా కమ్ బ్యాక్ ఫిల్మ్ ఆవుతుంది. ఈచిత్ర దర్శకుడు వినోద్ ప్రతిష్టాత్మక బెర్లిన్ అవార్డుతోపాటు నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్న వ్యక్తి.
ఇందులో నేను సీదార్ధ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నటించాను. నా నటనలో చిన్నపాటి కృత్రిమత్వం కూడా ఉండకూడదని నెలరోజులపాటు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ తీసుకుని నటించాను. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో చాలామంది నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఉన్నారు. నేను మళ్ళీ భవిష్యత్తులో ఇంతటి టెక్నీకల్లీ రిచ్ ఫిల్మ్ లో నటించే ఛాన్స్ వస్తుందని నేననుకోను. ఈ చిత్రం ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయదు. ఇది నా హామీ. ఇటువంటి సినిమ కోసమే ఇన్నాళ్లుగా వెయిట్ చేశాను. ఇందులో నా పాత్ర స్టోరీని డ్రైవ్ చేస్తుంది` అని అన్నారు.
ఈ క్రమంలో అన్నయ్య పూరీ జగన్నాథ్ ప్రమేయ గురించి చెబుతూ, ఇన్నేళ్ల తర్వాత కూడా కథల ఎంపికలో, కెరీర్ విషయంలో తన అన్నయ్య పూరి జగన్నాధ్ ను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నది తన భావన అని, అందుకే ఆయన్ని ఒత్తిడి చేయను అని చెప్పాడు. అన్నయ్య మోరల్ సపోర్ట్ తనకు ఎప్పుడూ ఉంటుందని, అడగడం ఆలస్యం సలహాలు-సూచనలు ఇస్తారని సాయిరామ్ తెలిపారు.
ఇద్దరం కలిసి సినిమా చేయడం తన చేతుల్లో లేదని, తాను ఏం చెప్పలేను అన్నారు. ఆకాష్ పూరీతో కలిసి సినిమా చేయాలని ఉందని, ఆ ప్లాన్ చేస్తామన్నారు సాయి రామ్ శంకర్. అన్నయ్య పూరీ ప్రారంభంలో సలహాలు ఇచ్చేవారని, స్క్రిప్ట్ ఎంపికలో ఉండేవారని, అందుకే వరుస విజయాలు దక్కాయని, కానీ ఇటీవల అన్నయ్యతో సలహాలు తీసుకోని లోటు కనిపిస్తుందన్నారు.
చిత్ర దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ... నాకు చిన్నప్పటినుంచి తెలుగు సినిమాలన్నా, తెలుగువాళ్ళన్నా, తెలుగు పచ్చళ్లన్నా చాలా చాలా ఇష్టం. ఒక పథకం ప్రకారం చిత్రంలో ప్రతి మూడు నాలుగు సీన్స్ కు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇందులో ఉన్న రెండు పాటలూ కథను ముందుకు తీసుకువెళ్లేలా ఉంటాయి.
రెండు పాటలూ సిడ్ శ్రీరామ్ పాడారు. రాజీవ్ రాయ్ సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి" అన్నారు. సాయి రామ్ శంకర్, శృతి సోధి, ఆషిమా నర్వాల్, సముద్రఖని, రవి పచ్చముత్తు, భానుశ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ ముఖ్య పాత్రలు పోషించారు.