MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • పూరీ భామ దూకుడు.. తన స్పోర్ట్స్ సీక్రెట్‌ బయటపెట్టిన హాట్‌ బ్యూటీ కేతిక శర్మ.. రష్మికతో పోల్చుతున్నారట

పూరీ భామ దూకుడు.. తన స్పోర్ట్స్ సీక్రెట్‌ బయటపెట్టిన హాట్‌ బ్యూటీ కేతిక శర్మ.. రష్మికతో పోల్చుతున్నారట

యంగ్‌ సెన్సేషన్‌గా మారింది `రొమాంటిక్‌` బ్యూటీ కేతిక శర్మ. తొలి చిత్రంతోనే గ్లామర్‌ షోతో హద్దులు చెరిపేసిన ఈ భామ లేటెస్ట్ గా తన సీక్రెట్‌ బయటపెట్టింది. అంతేకాదు తనని రష్మిక మందన్నాతో పోల్చుతున్నారని తెలిపింది.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Dec 03 2021, 11:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పూరీ జగన్నాథ్ బ్యానర్‌ నుంచి వచ్చిన `రొమాంటిక్‌` చిత్రంతో హీరోయిన్‌గా మెప్పించింది కేతిక శర్మ. ప్రస్తుతం నాగ శౌర్య హీరోగా  స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం `లక్ష్య`.  సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్బంగా కేతిక శర్మ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్‌ చేసుకుంది.  కరోనా వల్ల ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ వచ్చాయి. `రొమాంటిక్` సినిమా షూటింగ్ చివరి రోజు. షూట్ మొత్తం పూర్తయింది. సంతోష్ గారు కలిసి ఓ కథ చెప్పారు. అదే రోజు ఓ సినిమా షూట్ పూర్తవ్వడం, ఇలా వెంటనే మరో కథ రావడం ఆనందంగా అనిపించింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 `రొమాంటిక్` చిత్రంలో చేసిన పాత్రకు, `లక్ష్య` సినిమాలో చేసిన కారెక్టర్‌కు సంబంధం ఉండదు. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒప్పుకున్నాను. `లక్ష్య` సినిమాలో రితిక పాత్రను పోషించాను. ఆమె తన మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తుంది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. సినిమా పార్దు(నాగశౌర్య) చుట్టూ తిరుగుతుంది. అతన్ని ప్రేమించే పాత్రలో రితిక కనిపిస్తుంది.  నాగ శౌర్య గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. హార్డ్ వర్కింగ్, డెడికేషన్ ఉన్న నటుడు.

 
 

37

నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. నేను స్టేట్ లెవెల్ స్విమ్మర్, మా అమ్మ నేషనల్ లెవెల్ స్విమ్మర్. నాకు స్విమ్మింగ్ బేస్డ్ సినిమా వస్తే చేస్తాను. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నాగ శౌర్య గారు అద్భుతంగా నటించారు. ఎన్నో వేరియేషన్స్ కనిపిస్తాయి. నా కారెక్టర్ ఎమోషనల్‌గా ఉంటుంది.  మొదటి సినిమా రొమాంటిక్. పూరి జగన్నాథ్ గారి సినిమా. ఆయన్నుంచి కాల్ వస్తే ఎలా కాదనగలం. అలా పూరి జగన్నాథ్ గారు పిలవడంతో సినిమాకు ఓకే చెప్పేశాను. రొమాంటిక్ సినిమాలో గ్లామరస్ రోల్. ఇందులో మాత్రం ఎమోషనల్ పాత్రలో కనిపిస్తాను.  లక్ష్య సినిమాలో రితిక తన మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తుంటుంది. నేను కూడా నిజ జీవితంలో అంతే. కానీ రితికలా పెళ్లి గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించను. నాలాంటి వాళ్లను భరించడం కష్టం. మనసుకు ఏదనిపిస్తే అది చేసే వాళ్లతో వేగడం కష్టం.

47

ఆర్చరీ మీద సినిమాలు ఇంత వరకు సినిమాలు రాలేదు. అదే నాకు ఇంట్రెస్ట్‌గా అనిపించింది. అందుకే ఈ సినిమాను చేయాలనిపించింది. ఈ సినిమా సమయంలో ఎంతో మంది ఆర్చర్స్‌ను కలిశాను. నేను కూడా ఆర్చరీ గురించి కొంచెం నేర్చుకున్నాను.  దర్శకుడు సంతోష్ జాగర్లపూడికి చాలా క్లారిటీ ఉంది. ఆయనకేం కావాలో క్లియర్‌గా తెలుసు. సినిమా మీద చాలా నమ్మకంగా ఉంటారు. ఈ సీన్‌ ఎలా చేయాలని టెన్షన్‌ పడుతుంటే, ఆయన మాత్రం చాలా కూల్‌గా చెబుతారు. మన టెన్షన్‌ని తీసేస్తారు. చాలా ఫ్రీడమ్‌ ఇస్తారు. సరదాగా వర్క్ చేయిస్తారు. ఆయన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. ఇలాంటి డైరెక్టర్ ఉంటే అందరిలోనూ ఎనర్జీ వస్తుంది. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

57

`రొమాంటిక్` సినిమాలో పాట పాడాను. మా సినిమాలో ఎందుకు పాడలేదని లక్ష్య టీం వాళ్లు కూడా అడిగారు. త్వరలోనే డబ్బింగ్ కూడా ట్రై చేస్తాను. నా వాయిస్‌కు చిన్మయి డబ్బింగ్ చెప్పారు. ప్రతీ ఒక్క సన్నివేశాన్ని ఎంతో క్లియర్‌గా వివరిస్తారు. నా స్టైల్‌ను కూడా యాడ్ చేసి నటిస్తాను. ఆమె ఎంతో బాధలో ఉంటుంది. ఆమె పార్థను ఎంతగానో ప్రేమిస్తుంది. జగపతి బాబు, నాగ శౌర్య, కమెడియన్ సత్య వంటి వారితో కలిసి నటించడం సవాల్‌గా మారింది. వారితో పాటు పోటీ పడి నటించడం కష్టంగా అనిపించింది.


 

67

ప్రస్తుతం నా మూడో ప్రాజెక్ట్ వైష్ణవ్ తేజ్‌తో చేస్తున్నాను. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. కాలేజ్, ప్రేమ చుట్టూ తిరుగుతుంది. అదొక డైనమిక్ స్టోరి. ప్రతీ భాషలో నటించాలని ఉంది. తమిళంలో అయితే ఎక్కువ నటనను కోరుకుంటారు. నాకు భాష అనేది హద్దు కాదు. అలా అనుకుంటే మొదటి చిత్రం తెలుగులో చేసేదాన్ని కాదు.  స్పోర్ట్స్ ఫిల్మ్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. జనాలకు ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.
 

77

 నా జీవితంలో ఒకే ఒక్క కల ఉండేది. నటిని అవ్వాలని అనుకున్నాను. అయ్యాను. కానీ అదెలా జరిగిందో నాకు కూడా తెలియదు. నా పేరెంట్స్ డాక్టర్స్. మాకు ఇండస్ట్రీతో సంబంధం లేదు. వారు నాకు ఓ ఏడాది టైం ఇచ్చారు. అంతలోనే నటిని అయ్యాను. ఇదిలా ఉంటే అందరు నన్ను రష్మిక మందన్నాలా ఉన్నావని ప్రశంసిస్తున్నారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు ఆమెలా పెద్ద హీరోయిన్‌ అవుతావనే కాంప్లిమెంట్స్ ఇవ్వడం మరింత ఆనందంగా ఉంది. అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు.

also read: హాట్ బాంబ్‌ పేల్చిన యాంకర్‌ శ్రీముఖి.. జాకెట్‌ బటన్స్ విప్పేసి పరువాల విందు.. ఆ బిగువైన అందాలు చూడతరమా..

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved