MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Puneeth Rajkumar: పునీత్ అంత్యక్రియలు పూర్తి.. బాబాయ్ రుణం తీర్చుకుంటూ, కన్నీటి వీడ్కోలు

Puneeth Rajkumar: పునీత్ అంత్యక్రియలు పూర్తి.. బాబాయ్ రుణం తీర్చుకుంటూ, కన్నీటి వీడ్కోలు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంతిమయాత్ర, అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.అభిమానులు, కుటుంబ సభ్యుల కన్నీటి వీడ్కోల నడుమ పునీత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. 

2 Min read
Author : pratap reddy
Published : Oct 31 2021, 08:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంతిమయాత్ర, అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.అభిమానులు, కుటుంబ సభ్యుల కన్నీటి వీడ్కోల నడుమ పునీత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.  ప్రభుత్వం ఆదివారం ఉదయం 4.40 గంటలకే పునీత్ అంత్యక్రియలు ప్రారంభించింది. శుక్రవారం తీవ్ర గుండెపోటుకు గురైన పునీత్ రాజ్ కుమార్ తుదిశ్వాస విడిచారు. అభిమానులని, కుటుంబ సభ్యులని శోకసంద్రంలో ముంచుతూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

Puneeth Rajkumar అంత్యక్రియలు శనివారమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే యుఎస్ నుంచి పునీత్ పెద్ద కుమార్తె వందిత రాక ఆలస్యం కావడంతో ఆదివారానికి అంత్యక్రియలు వాయిదా వేశారు. కాగా పునీత్ అంత్యక్రియలు ఆయన తల్లిదండ్రుల సమాధి వద్దే కంఠీరవ స్టేడియంలో నిర్వహించారు. స్టేడియం వద్ద అభిమానులు వేలాదిగా బారులు తీరారు. 

37

పునీత్ అంత్యక్రియలు ఆయన అన్న కొడుకు వినయ్ రాజ్ కుమార్ చేతుల మీదుగాజరిగాయి. పునీత్ కి వందిత,  దృతి ఇద్దరూ కుమార్తెలే. కొడుకులు లేరు. కాబట్టి పునీత్ సోదరుడు రాఘవేంద్ర తనయుడు విజయ్ రాజ్ కుమార్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించారు. 

47

వినయ్ రాజ్ కుమార్ కూడా కన్నడ చిత్రల్లో హీరోగా నటిస్తున్నాడు. వినయ్ రాజ్ కుమార్ హీరో కావడంలో పునీత్ చాలా కీలక పాత్ర పోషించాడు. పునీత్ కన్నడనాట తిరుగులేని స్టార్ హీరో. తన పరిచయాలని ఉపయోగించి వినయ్ రాజ్ కుమార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేలా చేసాడు పునీత్. 

57

తనకు కెరీర్ ఇచ్చిన బాబాయ్ రుణం ఇలా తీర్చుకున్నాడు వినయ్ రాజ్ కుమార్. కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై సహా ఇతర ప్రముఖులంతా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా పునీత్ కు తన ఇద్దరు కుమార్తెలు వందిత, దృతి అంటే ప్రాణం. అలాగే కూతుళ్ళకు కూడా తండ్రి అంతే వెలకట్టలేని ప్రేమ. 

67

తండ్రి మరణవార్తని పునీత్ కుమార్తెలు దృతి, వందిత జీర్ణించుకోలేకున్నారు. వారిద్దరిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. ఇద్దరు కుమార్తెలు తండ్రి కోసం గుండెలు పగిలేలా రోదిస్తుండడం అందరిని కలచివేస్తోంది. పునీత్ తో అనుబంధం ఉన్న తెలుగు స్టార్స్ చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, వెంకటేష్ లు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. శనివారం వీరంతా బెంగళూరుకు వెళ్లి పునీత్ కు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. 

77

పునీత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో సోదరుడు శివరాజ్ కుమార్ తీవ్రంగా రోధిస్తూ కనిపించారు. ముఖ్యమంత్రి బొమ్మై పునీత్ పార్థివ దేహానికి సెల్యూట్ చేశారు. పోలిసుల గౌరవ లాంఛనాల తర్వాత సాంప్రదాయంగా పునీత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అభిమానులు ముద్దుగా అప్పు, పవర్ స్టార్ అని పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ ఇక లేరనేది కఠిన వాస్తవం. 

Also Read: Puneeth Rajkumar: భగవంతుడు పునీత్‌కి అన్యాయం చేశాడంటూ చిరంజీవి భావోద్వేగం.. వెంకీ, శ్రీకాంత్‌, అలీ నివాళి..

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Home Tour: యూరోపియన్ స్టైల్‌లో స్టార్ హీరోయిన్ తాప్సీఇల్లు.. ఇంటీరియర్‌ చూస్తే వావ్ అనాల్సిందే
Recommended image2
Anchor Suma: పెళ్లికి ముందే సుమకు షాకింగ్ కండీషన్ పెట్టిన రాజీవ్ కనకాల, సినిమాలకు దూరమవ్వడానికి అసలు కారణం అదేనా?
Recommended image3
Taapsee Pannu Birthday: తాప్సి ఇంత క్రేజీ హీరోయిన్ గా ఎలా ఎదిగింది.. 5 కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved