- Home
- Entertainment
- Puneeth Rajkumar: భగవంతుడు పునీత్‌కి అన్యాయం చేశాడంటూ చిరంజీవి భావోద్వేగం.. వెంకీ, శ్రీకాంత్, అలీ నివాళి..
Puneeth Rajkumar: భగవంతుడు పునీత్‌కి అన్యాయం చేశాడంటూ చిరంజీవి భావోద్వేగం.. వెంకీ, శ్రీకాంత్, అలీ నివాళి..
బాలకృష్ణ, ఎన్టీఆర్..పునీత్ రాజ్‌కుమార్‌కి నివాళ్లు అర్పించారు. బాలకృష్ణ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్, అలీ, అర్జున్ వంటి హీరోలు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి చలించిపోయారు చిరంజీవి. భావోద్వేగానికి గురయ్యారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar) గుండెపోటుతో శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. అభిమాన నటుడిని చివరి సారిగా చూసేందుకు అభిమానులు వేలాది మంది బారులు తీరారు. సినీ ప్రముఖులు సైతం కంఠీరవ స్టేడియానికి క్యూ కట్టారు. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పిస్తున్నారు.
బాలకృష్ణ (Balakrishna), ఎన్టీఆర్..పునీత్ రాజ్‌కుమార్‌కి నివాళ్లు అర్పించారు. బాలకృష్ణ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్(Venkatesh), శ్రీకాంత్, అలీ, అర్జున్ వంటి హీరోలు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి చలించిపోయారు. చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు. హీరో శివరాజ్‌కుమార్ ని సైతం ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు.
తన సంతాపాన్ని తెలియజేస్తూ పునీత్ చాలా మంది వారని, ఇటీవలే కలిశామని, బెంగుళూరు వచ్చిన ప్రతిసారి పునీత్‌ని కలిసే వాడిని తెలిపారు Chiranjeevi. పునీత్ అకాల మరణం తీవ్రంగా కలిచి వేసిందని, ఆయన మరణాన్ని జీర్ణించకోలేకపోతున్నా, భగవంతుడు అన్యాయం చేశాడని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు చిరు.
`పునీత్ మరణం చాలా బాధగా ఉంది. భగవంతుడు పునీత్ పట్ల చాలా అన్యాయం చేశాడు. వారి కుటుంబానికి అన్నిరకాలుగా ఆత్మస్థైర్యాన్నివాలని, పై లోకాన ఆయనకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నారు. బెంగుళూరు ఎప్పుడు వచ్చిన రాజ్‌కుమార్ ఇంటికి వెళ్లేవాడిని. మంచి అనుబంధం ఉంది. మంచి మనసున్న వ్యక్తి, గొప్ప వ్యక్తత్వం ఉన్న వ్యక్తి` అని చిరంజీవి వెల్లడించారు.
పునీత్ మరణం తీరని లోటని హీరో వెంకటేష్ తెలిపారు. మంచి నటుడుని కోల్పోయామని శ్రీకాంత్ చెప్పారు. తనకు 35ఏళ్లుగా పునీత్ తెలుసని కమెడీయన్ అలీ అన్నారు. చిరంజీవి, వెంకీ, శ్రీకాంత్‌లతోపాటు అలీ కూడా బెంగుళూరుకి వెళ్లి కంఠీరవ స్టేడియంలో పునీత్ భౌతిక కాయానికి నివాళ్లర్పించారు.
పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని అలీ తెలిపారు. వీరితోపాటు యాక్షన్ కింగ్ అర్జున్ కూడా పునీత్‌కి నివాళ్లర్పించారు. మంచి వ్యక్తిని కోల్పోయామని అర్జున్ తెలిపారు. `మంచి వ్యక్తి. మంచి నటుడు. మంచి మనిషి. చిన్నప్పుడే జాతీయ అవార్డు అందుకున్నారు. నాన్న మాదిరిగానే ఆయన మంచి గాయకుడు` అని అర్జున్ చెప్పారు.
ఇదిలా ఉంటే పునీత్ రాజ్ కుమార్ కూతురు ధృతి రాజ్‌కుమార్ అమెరికా నుంచి బెంగుళూరు చేరుకున్నారు. ఆమె ఎయిర్ పోర్ట్ నుంచి కంఠీరవ స్టేడియానికి వెళ్తున్నారు. కాసేపట్లో ఆమె తన తండ్రి పునీత్ రాజ్‌కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించనున్నారు. కూతురు ధృతి అమెరికా నుంచి ప్రయాణం ఆలస్యం కావడంతో పునీత్ అంత్యక్రియలు రేపటికి వాయిదా వేశారు.
related news; పునీత్ పార్థివదేహం వద్ద కంటతడి పెట్టుకున్న ఎన్టీఆర్.. నోట మాటరాక అలాగే చూస్తూ..