MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas Father: ప్రభాస్ తండ్రి అంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారా.. సగం షూటింగ్ పూర్తయ్యే సరికే భారీ నష్టాలు

Prabhas Father: ప్రభాస్ తండ్రి అంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారా.. సగం షూటింగ్ పూర్తయ్యే సరికే భారీ నష్టాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఓ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యే సరికే నిర్మాతలు నష్టాల్లో కూరుకుపోయారు. ఆ చిత్రం ప్రారంభం అయ్యే ముందే ప్రభాస్ తండ్రి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 07 2026, 07:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు
Image Credit : Asianet News

ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ప్రభాస్ ప్రశంసలు అందుకుంటున్నారు. హిట్ టాక్ వస్తే చాలు ప్రభాస్ నటించే సినిమాలు అలవోకగా 1000 కోట్లు దాటేస్తున్నాయి. అయితే ప్రభాస్ నటించిన ఒక ఫ్లాప్ మూవీపై నిర్మాతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఫ్లాప్ సినిమా మరేదో కాదు రెబల్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రభాస్ రెబల్ మూవీ
Image Credit : our own

ప్రభాస్ రెబల్ మూవీ

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 2012లో విడుదలై తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ చిత్రాన్ని భగవాన్, పుల్లారావు అనే నిర్మాతలు నిర్మించారు. వీళ్ళు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనతో సినిమా చేయమని ప్రభాస్ గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు. కానీ దర్శకుడు రాఘవ లారెన్స్ చేసిన తప్పుల వల్ల రెబల్ హిట్ కాలేదు. పైగా మాకు భారీ నష్టాలని మిగిల్చింది.

Related Articles

Related image1
Namitha: బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా నమితని అసభ్యంగా అలా చేయమన్న డైరెక్టర్, రివేంజ్ తీర్చుకున్న హీరో
Related image2
Box Office: తొలిరోజే 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించగలిగే ఐదుగురు హీరోలు.. టాప్‌లో ఎవరు?
35
సగం షూటింగ్ కే బడ్జెట్ మొత్తం ఖాళీ
Image Credit : Asianet News

సగం షూటింగ్ కే బడ్జెట్ మొత్తం ఖాళీ

రెబల్ ప్రారంభానికి ముందు మేము ఒక బడ్జెట్ అనుకున్నాం. కానీ సగం షూటింగ్ పూర్తయ్యేసరికే బడ్జెట్ మొత్తం ఖర్చు చేసేశారు లారెన్స్. మిగిలిన షూటింగ్ పూర్తి చేయడానికి బడ్జెట్ లేటు. ఇక ఈ సినిమా రిలీజ్ కావడం కష్టం అనే పరిస్థితి తలెత్తింది. అప్పటికే భారీగా నష్టాల్లో కూరుకుపోయాం. కానీ ప్రభాస్ గారు ఇచ్చిన సపోర్ట్ తో మిగిలిన షూటింగ్ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేశాం అని నిర్మాతలు తెలిపారు.

45
ప్రభాస్ తండ్రి వార్నింగ్ ?
Image Credit : Prabhas\Instagram

ప్రభాస్ తండ్రి వార్నింగ్ ?

రాఘవ లారెన్స్ ని దర్శకుడిగా ఎంచుకోవడమే మేము చేసిన తప్పు. లారెన్స్ ని దర్శకుడిగా ప్రభాస్ గారికి ప్రపోజ్ చేసింది మేమే. అప్పుడు ప్రభాస్ తండ్రి మాకు వార్నింగ్ ఇచ్చారు. లారెన్స్ తో మీరు వేగలేరు. వేరే దర్శకుడిని చూసుకోండి అని హెచ్చరించారు. కానీ అప్పటికే లారెన్స్ దర్శకుడిగా ఫైనల్ అయ్యారు. ఇక్కడ నిర్మాతలు చేసిన కామెంట్ కాస్త గందర గోళంగా ఉంది. రెబల్ సినిమా రిలీజ్ అయింది 2012లో. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు 2010లోనే మరణించారు.

55
అభిమానుల కామెంట్ ఇదే
Image Credit : Film Scene

అభిమానుల కామెంట్ ఇదే

అంటే ఆయన మారాణించడానికి ముందే రెబల్ మూవీ ప్రారంభం అయిందా ? నిర్మాతలకు నిజంగా వార్నింగ్ ఇచ్చింది ప్రభాస్ తండ్రేనా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఏమంటున్నారు అంటే.. అలా వార్నింగ్ ఇచ్చింది కృష్ణం రాజు అయి ఉంటారు. నిర్మాతలు పొరపాటుగా ప్రభాస్ తండ్రి అని చెప్పారు అని అంటున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Namitha: బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా నమితని అసభ్యంగా అలా చేయమన్న డైరెక్టర్, రివేంజ్ తీర్చుకున్న హీరో
Recommended image2
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image3
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Related Stories
Recommended image1
Namitha: బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా నమితని అసభ్యంగా అలా చేయమన్న డైరెక్టర్, రివేంజ్ తీర్చుకున్న హీరో
Recommended image2
Box Office: తొలిరోజే 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించగలిగే ఐదుగురు హీరోలు.. టాప్‌లో ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved