- Home
- Entertainment
- అఖిల్ పై కుట్ర,తొక్కేస్తోంది ఆయనే..నాగార్జునకి అర్థం కావడం లేదు, బాంబు పేల్చిన నిర్మాత నట్టి కుమార్
అఖిల్ పై కుట్ర,తొక్కేస్తోంది ఆయనే..నాగార్జునకి అర్థం కావడం లేదు, బాంబు పేల్చిన నిర్మాత నట్టి కుమార్
అక్కినేని వారసుడు అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం అక్కినేని ఫ్యాన్స్ తో పాటు, కామన్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూశారు.

అక్కినేని వారసుడు అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం అక్కినేని ఫ్యాన్స్ తో పాటు, కామన్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూశారు. ట్రైలర్ టీజర్స్ లో అఖిల్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా కనిపించడంతో అఖిల్ ఈసారి గట్టిగా కొట్టబోతున్నట్లు అంతా భావించారు.
కానీ నేడు తెల్లవారు జాము ప్రీమియర్ షోల నుంచే ఏజెంట్ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలైంది. సినిమాలో వైల్డ్ సాలా అనే హంగామా తప్ప కథ, కథనం చాలా వీక్ గా ఉన్నాయి అంటూ ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఏజెంట్ తో పాటు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2 కూడా నేడు రిలీజ్ అయింది. ఆ చిత్రానికి పర్వాలేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో భారీ బడ్జెట్ లో తెరకెక్కించిన ఏజెంట్ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ప్రకంపనలు సృష్టించే వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో అక్కినేని అఖిల్ ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది అంటూ నట్టి కుమార్ రీసెంట్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో రాజకీయాలు, ఎత్తుగడలు జరుగుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీ చాలా సైలెంట్ గా ఉంటారు. అలాంటి వారు ఈ ఎత్తుగడలని అధికమించి నిలబడగలరా అనే సందేహం కలుగుతోంది.
అఖిల్ ని తొక్కేందుకు ఒక అగ్ర నిర్మాత థియేటర్స్ ని బ్లాక్ చేశారు. అఖిల్ ఏజెంట్ తో పాటు తమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2 కూడా నేడు రిలీజ్ అయింది. కానీ పొన్నియిన్ సెల్వన్ 2 కే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారు. మణిరత్నం గారి గురించి నేను మాట్లాడడం లేదు. కానీ నాకు తెలుగు సినిమానే గొప్ప. తెలుగు సినిమాని కాదని తమిళ చిత్రానికి థియేటర్స్ ఇవ్వడం ఏంటి ? ఏజెంట్ చిత్రానికి నిన్నటి వరకు కూడా డిస్ట్రిబ్యూటర్లు దొరక్కుండా చేశారు.
ఇండస్ట్రీ మొత్తం ఒకరి గుప్పెట్లోనే ఉంది. ఏజెంట్ కి కావాలనే అన్యాయం చేస్తున్నారు. ఏ విషయం నాగార్జునగారికి ఎందుకు అర్థం కావడం లేదో తెలియడం లేదు. నాగార్జున ఫ్యామిలీకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక మా లాంటి చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి అని నట్టి కుమార్ ప్రశ్నించారు. ఒక అగ్ర నిర్మాత వల్ల ఏజెంట్ చిత్రానికి థియేటర్స్ లేవు అని చెప్పిన నట్టి కుమార్ ఆ నిర్మాత పేరు చెప్పలేదు.
వైజాగ్ మొత్తం పొన్నియిన్ సెల్వన్ 2 కే థియేటర్స్ ఇచ్చారు. కొన్ని చోట్ల మాత్రం ఇక తప్పదు అని ఏజెంట్ కి ఇచ్చారు. ఈ పరిస్థితి మారాలి. ఇండస్ట్రీ ఒకరి గుప్పెట్లో ఉండకూడదు. మనం తమిళం కంటే తెలుగుకే ప్రాధాన్యత ఇచ్చుకోవాలి అని నట్టి కుమార్ సూచించారు.