నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై నిర్మాత నాగవంశీ కామెంట్స్.. ఎన్టీఆర్ మనవడు కాబట్టి..
బాలకృష్ణ తనయుడు చిత్ర పరిశ్రమలోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఇంత కాలం వెయిట్ చేశారు.
బాలకృష్ణ తనయుడు చిత్ర పరిశ్రమలోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఇంత కాలం వెయిట్ చేశారు. ప్రశాంత్ వర్మ అద్భుతమైన మైన కథ తో రావడంతో బాలయ్య ఈ చిత్రాన్ని ఫిక్స్ చేశారు.
ప్రశాంత్ వర్మ ఆల్రెడీ పాన్ ఇండియా స్థాయిలో ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్. దీనితో తన కొడుకు తొలి చిత్రానికి బాలయ్య ప్రశాంత్ వర్మని డైరెక్టర్ గా ఫిక్స్ చేశారు. ప్రశాంత్ వర్మ హను మాన్ చిత్రంతో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకి మించేలా విజువల్ ఎఫెక్ట్స్ ఉండే భారీ కథని మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ సిద్ధం చేశారట.
Nagavamsi
మోక్షజ్ఞ ఎంట్రీపై నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోక్షజ్ఞని నేను రెండు మూడు సార్లు కలిశాను. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మోక్షజ్ఞ తన తొలి చిత్రంతో తప్పకుండా అదరగొడతాడు. ఎందుకంటే మోక్షజ్ఞ.. ఎన్టీఆర్ మనవడు.. అదేవిధంగా బాలయ్య కొడుకు అని నాగవంశీ సమాధానం ఇచ్చారు.
ప్రశాంత్ వర్మ ట్యాలెంట్ ఉన్న దర్శకుడు అని నాగవంశీ ప్రశంసించారు. చిత్రాన్ని ఎలా అద్భుతంగా మలచాలో ప్రశాంత్ వర్మకి బాగా తెలుసు అని నాగవంశీ తెలిపారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాతగా ఎన్బీకే 109 చిత్రంలో నటిస్తున్న సంగతి తేలింది.