MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Naga Vamsi: అజ్ఞాతవాసి ఫ్లాపే, కానీ గుంటూరు కారం ఫ్లాప్ కాదు.. ఒక్కడి వల్లే దెబ్బ పడింది, ఒప్పుకున్న నాగవంశీ

Naga Vamsi: అజ్ఞాతవాసి ఫ్లాపే, కానీ గుంటూరు కారం ఫ్లాప్ కాదు.. ఒక్కడి వల్లే దెబ్బ పడింది, ఒప్పుకున్న నాగవంశీ

ప్రముఖ నిర్మాత నాగవంశీ గుంటూరు కారం, అజ్ఞాతవాసి చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు కారం మూవీ నిరాశ పరచడానికి కారణం బయట పరిస్థితులే అని అన్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 11 2026, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mahesh Babu
Image Credit : Asianet News

Mahesh Babu

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నిర్మాతలలో నాగవంశీ ఒకరు. చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమా, భారీ సినిమా ఇలా తేడా లేకుండా నాగవంశీ సితార సంస్థ నుంచి క్రేజీ చిత్రాలు వస్తున్నాయి. ఆగష్టు 14న నాగవంశీ నిర్మించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం రిలీజ్ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అగ్ర హీరో సూర్య నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో నాగవంశీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పవన్ కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్
Image Credit : Youtube print shot/Sithara Entertainments

పవన్ కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్

తన బాబాయ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత చినబాబు (రాధాకృష్ణ) సహకారంతో సహకారంతో నాగవంశీ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. హారిక అండ్ హాసిని సంస్థ సినిమాలలో కూడా నాగవంశీ ఇన్వాల్వ్ అవుతుంటారు. నాగవంశీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, మహేష్ బాబు గుంటూరు కారం సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అజ్ఞాతవాసి మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

35
గుంటూరు కారం చిత్రానికి నెగిటివ్ టాక్
Image Credit : our own

గుంటూరు కారం చిత్రానికి నెగిటివ్ టాక్

మహేష్ బాబు గుంటూరు కారం చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ పరంగా పర్వాలేదు అనిపించింది. నాగవంశీ మాట్లాడుతూ.. అజ్ఞాతవాసి మూవీ బాక్సాఫీస్ వద్ద బాగా నిరాశపరిచింది. అది వాస్తవమే. కానీ గుంటూరు కారం అలా కాదు. కొన్ని ఏరియాలో చాలా బాగా వర్కౌట్ అయింది. నైజాం, ఓవర్సీస్ లో సరిగ్గా ఆడలేదు.

45
తేజ సజ్జా సినిమా వల్లే దెబ్బ పడింది
Image Credit : our own

తేజ సజ్జా సినిమా వల్లే దెబ్బ పడింది

కానీ గుంటూరు కారం చిత్రానికి ఎక్కువగా నెగిటివ్ టాక్ వచ్చింది. దీనికి సినిమా కంటెంట్ కంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎక్కువ కారణం అయ్యాయి. అదే సినిమాని డ్యామేజ్ చేసింది. అదే సంక్రాంతికి గుంటూరు కారంతో పాటు హనుమాన్ కూడా రిలీజ్ అయింది. అందరూ ఈ రెండు చిత్రాలని కంపేర్ చేయడం ప్రారంభించారు. అదే సమయంలో థియేటర్ల గొడవ ఎక్కువ జరిగింది.

55
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్
Image Credit : instagram

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్

ఈ అంశాల వల్లే గుంటూరు కారం చిత్రానికి డ్యామేజ్ జరిగింది అని నాగవంశీ తెలిపారు. గుంటూరు కారం, హనుమాన్ రెండు చిత్రాలు 2024 సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. తేజ సజ్జా నటించిన హనుమాన్ చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Recommended image2
Sobhan Babu: ఏమయ్యా ఎట్లా తీసావయ్యా సినిమా.. ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి, నిలదీసిన శోభన్ బాబు, ఏమన్నాడంటే?
Recommended image3
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Related Stories
Recommended image1
Tara Sutaria: యశ్ పుణ్యమా అని ఒక్కసారిగా కెరీర్ కి హైప్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టాక్సిక్ హీరోయిన్
Recommended image2
Radhika To Roja: రాధిక నుంచి రోజా వరకు, చిరంజీవి ఆ హీరోయిన్లనే ఎందుకు రిపీట్ చేశారో తెలుసా.. సురేఖే కారణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved