MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమ్మాయిలా ఉన్నాడు, వీడితో సినిమా ఏంటి..హీరో సిద్దార్థ్ కి అవమానం, నిర్మాత ఏం చేశారంటే

అమ్మాయిలా ఉన్నాడు, వీడితో సినిమా ఏంటి..హీరో సిద్దార్థ్ కి అవమానం, నిర్మాత ఏం చేశారంటే

చెన్నై నుంచి వచ్చినప్పటికీ హీరో సిద్దార్థ్ తెలుగు కుర్రాడిలా మారిపోయారు. సిద్దార్థ్ కి లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే సూపర్ హిట్స్ ఉన్నాయి. అదే విధంగా సిద్దార్థ్ నటనని తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పటికీ మరచిపోలేరు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 21 2024, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
siddarth

siddarth

చెన్నై నుంచి వచ్చినప్పటికీ హీరో సిద్దార్థ్ తెలుగు కుర్రాడిలా మారిపోయారు. సిద్దార్థ్ కి లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే సూపర్ హిట్స్ ఉన్నాయి. అదే విధంగా సిద్దార్థ్ నటనని తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పటికీ మరచిపోలేరు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిలు చిత్రాలు సిద్దార్థ్ కేరీర్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాన్ని ఎమ్మెస్ రాజు నిర్మించారు. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకుడు. ఎమ్మెస్ రాజు ప్రధానంగా నిర్మాత అయినప్పటికీ ఆయనకి దర్శకత్వంలో, కథల విషయంలో మంచి అనుభవం ఉంది. తన చిత్రాల కథల విషయంలో ఆయన ప్రమేయం ఉంటుంది. అంతే కాదు నటీనటుల ఎంపిక విషయంలో కూడా ఎమ్మెస్ రాజుకు తిరుగులేదు. 

36
ms raju

ms raju

నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం విషయంలో జరిగిన ఒక సంఘటనని ఎమ్మెస్ రాజు ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ చిత్రానికి హీరోగా సిద్దార్థ్, త్రిషని సెలెక్ట్ చేసింది నేనే. సిద్దార్థ్ హీరో అని చెప్పగానే చాలా మంది వద్దు అన్నారు. పరుచూరి బ్రదర్స్ అయితే.. ఏందయ్యా అమ్మాయిలా ఉన్నాడు, ఆ జుట్టేంటి.. వీడిని హీరోగా తెచ్చావు ఏంటి అని అన్నారు. 

46

లేదండీ ఈ సినిమాలో హీరో ఫారెన్ నుంచి వచ్చాడు అంటే నమ్మేలా ఉండాలి. అందుకు సిద్దార్థ్ అయితేనే కరెక్ట్ అని చెప్పి ఒప్పించినట్లు ఎమ్మెస్ రాజు తెలిపారు. త్రిషతో ఆల్రెడీ వర్షం మూవీ చేశాం. దీనితో ఈ చిత్రానికి డేట్స్ కావాలని వెళితే.. తన డైరీ నాకిచ్చేసి.. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు రాసుకోండి.. నేను వచ్చి సినిమా చేస్తా అని చెప్పింది. నాపై ఆ అమ్మాయికి అంత నమ్మకం అని ఎమ్మెస్ రాజు అన్నారు. 

56

నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో సిద్దార్థ్ నటనకి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ప్రభాస్ నా వర్షం చిత్రతోనే స్టార్ అయ్యాడు. సిద్దార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆ తర్వాత బొమ్మరిల్లు చిత్రాలు పడటంతో క్రేజీ హీరో అయ్యాడు అంటూ ఎమ్మెస్ రాజు కామెంట్స్ చేశారు. 

66

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలకు తనకి ఒక్క నంది అవార్డు కూడా రాలేదని గతంలో సిద్దార్థ్ బాధపడిన సంగతి తెలిసిందే. అయితే అభిమానుల ప్రశంసలే తనకి పెద్ద అవార్డు అని సిద్దార్థ్ తెలిపాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున, కింగ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ డిమాండ్, నిజమెంత?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode: మళ్లీ రామరాజుని వెర్రోడిని చేసిన కుటుంబం, అత్తారింటికి చేరిన వల్లి
Recommended image3
Lenin Review: లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌, ఆ ట్విస్టే మెయిన్‌ హైలైట్‌.. అఖిల్‌ కి ఈ సారైనా హిట్ పడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved