పాపం హోమ్లీ హీరోయిన్, ఆమెతో బలవంతంగా మోడ్రన్ డ్రెస్సులు వేయించిన చిరంజీవి భార్య..ట్విస్ట్ తో మైండ్ బ్లాక్
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల అప్పుడప్పుడూ కొన్ని ఈవెంట్స్ కి హాజరవుతుంటారు. అంతే తప్ప సినిమాలకి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది లేదు.
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల అప్పుడప్పుడూ కొన్ని ఈవెంట్స్ కి హాజరవుతుంటారు. అంతే తప్ప సినిమాలకి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది లేదు. కానీ 156 సినిమాలకిపైగా నటించిన మెగాస్టార్ చిరంజీవి సతీమణి అయినప్పుడు.. చిత్ర పరిశ్రమ గురించి తప్పకుండా అవగాహన ఉంటుంది.
ఆ అవహగానాతో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫాలితాలు ఇచ్చాయి. పవన్ కళ్యాణ్ నటుడిగా మార్చడంలో సురేఖ నిర్ణయం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా బావుంటాడు అని సురేఖ చెప్పడంతో చిరంజీవి తన సోదరుడిని ఇండస్ట్రీకి తీసుకువచ్చారు. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఏఎన్నార్ మనవరాలు సుప్రియ హీరోయిన్ గా నటించారు.
ఇక రెండవ చిత్రానికి కసరత్తులో మొదలయ్యాయి. హిట్లర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గోకులంలో సీత అనే చిత్రం ఫైనల్ అయింది. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో చిరంజీవి సతీమణి సురేఖ ఎంట్రీ ఇచ్చి పవన్ కి పర్ఫెక్ట్ జోడీని సెలెక్ట్ చేశారు. గోకులంలో సీత చిత్రంలో హీరోయిన్ ఎంపిక భలే డ్రమాటిక్ గా జరిగిందట. అంతకు ముందు హీరోయిన్ రాశిని సురేఖ ఒక చిత్రంలో చూశారట. ఈ అమ్మాయి చాలా బావుంది అని అనిపించింది అట.
డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి ద్వారా రాశి ఇంటి ఫోన్ నంబర్ తీసుకుని సురేఖ ఫోన్ చేశారు. చిరంజీవి మిమ్మల్ని ఇంటికి పిలుస్తున్నారు అని అబద్దం చెప్పారు. చిరంజీవి గారు నన్నెందుకు పిలుస్తున్నారు అని రాసి ఆశ్చర్యపోయింది. సరే ఒకసారి వెళదాం.. ఎందుకైనా మంచిది, ఫోటో ఆల్బమ్ కూడా తీసుకుని వెళదాం అని రాసి చిరంజీవి ఇంటికి బయలుదేరింది. రాశికి చిరంజీవి ఇంటికి వెళ్ళాక అర్థం అయిందట.. పిలిపించింది చిరంజీవి గారు కాదు సురేఖ గారు అని.
హోమ్లీగా, ట్రెడిషనల్ డ్రెసుల్లో చాలా బావున్నావు. వెస్ట్రన్ డ్రెస్సుల్లో కూడా నీతో ఫోటో చూట్ చేయాలి అని సురేఖ చెప్పారు. రాశి చేత బలవంతంగా వెస్ట్రన్ డ్రెస్సులు వేయించారట. ఫోటో షూట్ పూర్తయ్యాక సురేఖ గారు ట్విస్ట్ రివీల్ చేశారు. ఈ అమ్మాయి.. పవన్ పక్కన బావుంటుంది.. గోకులంలో సీత చిత్రంలో హీరోయిన్ గా ఫైనల్ చేయండి అని చెప్పారట. ఆ విధంగా సురేఖ గారు ఇచ్చిన ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అయింది అని రాశి తెలిపారు.