దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీ ?.. తెరవెనుక ఇంతటి కథ నడిపించాడా ?.. ప్లాన్ అదిరింది..
టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరిగా రాణిస్తున్న దిల్‌రాజు ఇప్పుడు రూట్ మార్చబోతున్నారు. ఆయన రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వచ్చే ఎన్నికల్లే టార్గెట్గా పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ జరుగుతున్నట్టు సమాచారం.
డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు దిల్‌రాజు(Dil Raju). `దిల్` సినిమాతో నిర్మాతగా మారి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. `ఆర్య`తో బ్లాక్ బస్టర్ అందుకుని తిరుగులేని రారాజుగా నిలిచారు. నిర్మాతగా ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు దిల్‌రాజు. భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. టాలీవుడ్‌లో టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఇలా టాప్ స్టార్స్ అందరితోనూ సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు.
ఇప్పుడు రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్‌లో `ఆర్‌సీ15` అనే పాన్ ఇండియా చిత్రాన్ని, దీంతోపాటు తమిళ స్టార్ దళపతి విజయ్-వంశీపైడిపల్లి కాంబినేషన్‌లో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇటీవల `ఎఫ్3`తో విజయాన్ని అందుకున్నారు. వీటితోపాటు పలు మీడియం రేంజ్ సినిమాలు ఆయన శ్రీవెంకటేశ్వర క్రియేషన్(ఎస్వీసీ) బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా రాణిస్తున్నారు. ఓ రకంగా ఇప్పుడు తెలుగులో ఆయన్ని మించిన నిర్మాత లేరంటే అతిశయోక్తి కాదు. ఏక కాలంలో అరడజను సినిమాలు నిర్మిస్తూ వందల కోట్ల వ్యాపారం చేస్తున్నారు.
రెండేళ్ల క్రితం ఆయన మరో మ్యారేజ్ చేసుకున్నారు. తన మొదటి భార్య చనిపోవడంతో ఒంటరైన దిల్‌రాజు (వెంకట్‌రమణా రెడ్డి) కొంత గ్యాప్ తర్వాత ఆయన కరోనా లాక్ డౌన్ సమయంలో మెఘా రెడ్డిని సెకండ్ మ్యారేజ్‌గా చేసుకున్నారు. రెండో పెళ్లి తర్వాత దిల్‌రాజుకి మరింతగా కలిసొచ్చినట్టు తెలుస్తుంది. ఆయన ఇటీవల విడుదల చేసిన సినిమాలన్నీ వరుసగా విజయాలు సాధించాయి. కోట్ల లాభాలు వచ్చాయి. దీంతో మరింత ఉత్సహంతో ఉన్నారు దిల్‌రాజు.
అయితే సెకండ్ మ్యారేజ్ తర్వాత ఆయన మీడియాతో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిర్మాతగా అత్యంత సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరుతెచ్చుకున్న ఆయన సేవా కార్యక్రమాలపై దృష్టిపెడుతున్నట్టు చెప్పారు. తన సొంతూరు నిజామాబాద్‌లో వెంకటేశ్వరస్వామి టెంపుల్‌ని నిర్మించారు. అక్కడ తన ఫౌండేషన్ పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలు,సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. సొంతూరు అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నారు. దీని వెనకాల పొలిటికల్ ఎంట్రీ ప్లాన్ ఉందని టాక్
ఈ నేపథ్యంలో ఇప్పుడు దిల్‌రాజు నిర్మాత నుంచి రాజకీయ నాయకుడిగా ప్రమోట్(Dil Raju Political Entry) కావాలనుకుంటున్నారట. పొలిటికల్ ఎంట్రీకి(టీవీ9 కథనం ఆధారంగా) ప్లాన్ చేసుకుంటున్నట్టు ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. వచ్చే జనరల్ ఎన్నికలే లక్ష్యంగా దిల్‌రాజు రాజకీయ రంగంలోకి దిగబోతున్నట్టు ఈ వార్త సారాంశం. నిర్మాతగా సక్సెస్ అయిన ఆయన రాజకీయాల్లోనూ సక్సెస్ కావాలనే నిర్ణయంతో ఉన్నారట. జీవితంలో మరో కీలక మలుపు ఉంటే బాగుంటుందని భావించిన ఆయన రాజకీయాల్లోకి అయితే బాగుంటుందని తెలుస్తుంది. అందుకోసం ఇప్పటికే గ్రౌండ్ లెవల్‌లో సన్నాహాలు చేస్తున్నారట.
గ్రామ స్థాయిలో తన అనుచరులతో గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకునే పనిలో పడ్డారట. అదే సమయంలో గ్రామ స్థాయిలో తను జనంలోకి వెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారట. ఇప్పటికే టెంపుల్స్ నిర్మాణంతో ఆయన నిజామాబాద్‌లో చాలా మందికి దగ్గరయ్యారు. దీనికి మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తన గెలుపోటములు అంచనా వేసుకుని రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారట. అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు టాక్.
అయితే తన సొంతూరు నిజామాబాద్ రూరల్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఆ ఏరియా నుంచే వచ్చే ఎన్నికల్లో బరీలోకి దిగేలా ప్లాన్ చేసుకుంటున్నారట. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో దిల్‌రాజు ఉన్నారట. దీనికి సంబంధించిన సన్నాహాలు సెలైంట్‌గా జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. టికెట్ వస్తే టీఆర్‌ఎస్‌లో, రాకపోతే బీజేపీలో చేరే అవకాశాలున్నాయట. టీఆర్‌ఎస్‌తో ఆయన ఇప్పటికే మంచి సంబంధాలున్నాయి. దీంతో గులాబీ దళంలోనే చేరే అవకాశం ఉందంటున్నారు. కానీ ఏ పార్టీ టికెట్ ఇస్తే దాన్లో చేసే ఆలోచనలో ఉన్నారట.
నిర్మాతగా ఎంతో సక్సెస్‌ని చూశారు దిల్‌రాజు. ప్రొడక్షన్ చూసుకోవడానికి తమ్ముడు శిరీష్, అల్లుడు కూడా ఉన్నారు. శిరీష్ తనయుడు హీరోగా బిజీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ బాధ్యతలు పూర్తిగా శిరీష్‌కి వదిలేసి, తను రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారట. మరి దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీ ప్లాన్‌లో నిజమెంతా? ఒకవేళ రాజకీయాల్లోకి ఎంట్రీఇస్తే గెలుస్తారా? అన్నది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది.