- Home
- Entertainment
- Balakrishna: సంక్రాంతి బరిలో `సమరసింహారెడ్డి`తో పోటీపడి చావు దెబ్బ తిన్న కృష్ణ, రాజశేఖర్.. బాలయ్యతో గేమ్ ఈజీ కాదు
Balakrishna: సంక్రాంతి బరిలో `సమరసింహారెడ్డి`తో పోటీపడి చావు దెబ్బ తిన్న కృష్ణ, రాజశేఖర్.. బాలయ్యతో గేమ్ ఈజీ కాదు
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చాలా సినిమాలు సంక్రాంతి బరిలో దిగాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. వాటిలో `సమరిసింహారెడ్డి` ఒకటి.

సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన `సమరసింహారెడ్డి`
బాలకృష్ణకి, సంక్రాంతికి పండక్కి విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఆయన నటించిన సినిమాలు సంక్రాంతికి విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. అయితే 1999లో బాలయ్య ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ `సమరసింహారెడ్డి` మూవీ సంక్రాంతికి విడుదలైంది. జనవరి 13న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన మరో మూవీ ఇది. ఫ్యాక్షన్ చిత్రాలకు నయా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందీ మూవీ. బాలయ్యని తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టింది.
అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీ సమరసింహారెడ్డి
ఇందులో అంజలా జవేరీ, సిమ్రాన్, సంఘవి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఏకంగా రూ.30కోట్లు వసూలు చేసింది. ఇంతటి వసూళ్లని రాబట్టి తొలి మూవీగా అప్పట్లో ఇది నిలిచింది. సంక్రాంతికి పండక్కి సునామీ సృష్టించిందీ మూవీ. ఇది మూడు సెంటర్లలో 227 రోజులు, 29 సెంటర్లలో 175 రోజులు, 122 సెంటర్లలో యాభై రోజులు, 72సెంటర్లలో వంద రోజులు ఆడింది.
బాలయ్య దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన రాజశేఖర్ నేటి గాంధీ
ఇక ఈ మూవీకి పోటీగా వచ్చి చిత్తైపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో రాజశేఖర్ సినిమా ప్రధానంగా ఉంది. ఆయన `నేటి గాంధీ` సినిమా జనవరి 8న విడుదలైంది. దీనికి ఇవివి సత్య నారాయణ దర్శకత్వం వహించగా, రాశేఖర్ సరసన రాశి హీరోయిన్ గా నటించింది. మురళీ మోహన్ ముఖ్య పాత్ర పోషించారు. ఆ సమయంలో రాజశేఖర్ హీరోగా కెరీర్ పీక్‌లో ఉంది. చిరు, బాలయ్యలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అలాంటి సమయంలో వచ్చిన `నేటి గాంధీ` మూవీ బాక్సాఫీసు వద్ద డిజాప్పాయింట్ చేసింది. ప్రారంభంలో ఓ మోస్తారుగా రన్ అయ్యింది. బాలయ్య `సమరసింహారెడ్డి` దెబ్బకి అడ్రస్ లేకుండా పోయింది. డిజాస్టర్‌గా నిలిచింది.
కృష్ణకి చుక్కలు చూపించిన బాలయ్య
బాలయ్య `సమరసింహారెడ్డి`తో పోటీ పడ్డ మూవీస్‌లో సూపర్ స్టార్ కృష్ణ మూవీ కూడా ఉంది. ఆయన హీరోగా వచ్చిన `మానవుడు దానవుడు` కూడా జనవరి 14న విడుదలైంది. ఇందులో కృష్ణకి జోడీగా సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. దీనికి కృష్ణనే దర్శకుడు కావడం విశేషం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, కృష్ణ చేసిన డిఫరెంట్ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఓవరాల్‌గా డిజాస్టర్ అయ్యింది.
సుమన్ ని కూడా పరాజయం తప్పలేదు
బాలకృష్ణ `సమరసింహారెడ్డి`కి పోటీగా వచ్చిన మరో మూవీ `పెద్ద మనుషులు`. ఇందులో సుమన్ హీరో. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఇందులో రచన బెనర్జీ, హీరా రాజగోపాల్ హీరోయిన్లుగా నటించారు. శ్రీహరి నెగటివ్ రోల్ చేశారు. ఈ ఫ్యామిలీ మూవీ కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. జనవరి 13నే విడుదలై బాలయ్య మూవీ ముందు నిలబడలేకపోయింది. దీంతోపాటు శ్రీహరి హీరోగా నటించిన `తెలంగాణా` అనే సినిమా జనవరి 8న విడుదలైంది. ఇది కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఇలా మొత్తంగా బాలయ్య `సమరసింహారెడ్డి`తో పోటీపడి కృష్ణ, రాజశేఖర్, సుమన్, శ్రీహరి చిత్రాలు చిత్తైపోయాయి.

