- Home
- Entertainment
- జనసేనలోకి `అత్తారింటికి దారేదీ` నిర్మాత.. పవన్ సమక్షంలో చేరిక.. యాగశాలను సందర్శించిన హరీష్ శంకర్, నిర్మాతలు
జనసేనలోకి `అత్తారింటికి దారేదీ` నిర్మాత.. పవన్ సమక్షంలో చేరిక.. యాగశాలను సందర్శించిన హరీష్ శంకర్, నిర్మాతలు
`అత్తారింటికి దారేదీ` నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన సోమవారం పార్టీ కంగువ కప్పుకున్నారు. మరోవైపు పవన్‌తో సినిమాలు చేస్తున్న దర్శక, నిర్మాతలు యాగశాలని సందర్శించడం విశేషం.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ చేరారు. శ్రీ వెంకటేశ్వరసినీ చిత్ర(ఎస్వీసీసీ) బ్యానర్ ద్వారా అనేక సక్సెస్‌ఫుల్ మూవీస్‌ని నిర్మించారు బీవీఎస్‌ఎన్ ప్రసాద్. పవన్ నటించిన `అత్తారింటికి దారేదీ` చిత్రానికి ఆయనే నిర్మాత. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన ధర్మ పరిరక్షణ నిమిత్తం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యాగ క్రతువులో పాలు పంచుకున్నారు. పవన్ సమక్షంలో పార్టీలో చేఆరు.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పార్టీలో చేరడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ యాగశాలలో ప్రతిష్టించిన దేవతాముర్తులకు నమస్కరించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్‌తో కాసేపు ముచ్చటించారని, పార్టీలో చేరాలనే తన నిర్ణయాన్ని పవన్ ఎదుట వ్యక్తపరుచగా, స్వాగతించిన పవన్ ఆయనకు పార్టీ కంగువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తాను కృషి చేస్తానని నిర్మాత తెలిపినట్టు హరిప్రసాద్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న యాగశాలను సినిమా ప్రముఖులు సందర్శించారు. `ఉస్తాద్ భగత్ సింగ్` దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌తోపాటు మెగా సూర్య ప్రొడక్షన్ అధినేత ఏ ఎం రత్నం, మైత్రీ మూవీ మేకర్స్ వై రవిశంకర్, డీవీవీ ఎంటర్ టైన్‌మెంట్స్ నిర్మాత డీవీవీ దానయ్య, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ కూచిబొట్ల వంటి వారు యాగశాలని సందర్శించిన అక్కడ ప్రతిష్టించిన దేవతామూర్తులకు నమస్కరించారు.
ఈ సందర్భంగా వారు యాగ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. వేద పండితుల ఆశీర్వాచనం తీసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు దర్శక, నిర్మాతలు. వారాహి రథం గురించి అడిగి తెలుసుకున్నారు. వారాహి రథం వద్ద కాసేపు ముచ్చటించారు. తాను వారాహి రథంపై చేపట్టబోతున్న ప్రచారానికి సంబంధించిన విషయాలను వారికి వివరించారు పవన్.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ఈ నెల 14 నుంచి పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్ర ఆయన అనుకున్న లక్ష్యాన్ని సిద్ధించే గొప్ప యాత్ర కావాలన్నారు. ప్రజా క్షేం కాంక్షిస్తూ చేస్తున్న యాగ క్రతువులో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని, యాత్ర సైతం రాజకీయాల్లో నవశకానికి నాంది పలుతుందన్నారు. పవన్ సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ రాణఙంచాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరిచిపోలేని నాయకుడు కావాలని వారు పవన్ కి అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉంటే పవన్.. హరీష్ శంకర్‌తో `ఉస్తాద్ భగత్ సింగ్`లో నటిస్తున్నారు. దీనికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. మరోవైపు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో `బ్రో` సినిమా చేస్తున్నాడు పవన్. ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుంది. జులై 28న విడుదల కాబోతుంది. మరోవైపు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో డీవీవీ దానయ్య నిర్మాతగా `ఓజీ` సినిమా చేస్తున్నాడు పవన్. దీనికి సుజీత్ దర్శకుడు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్‌లో ఏఎంరత్నం నిర్మాణంలో `హరిహర వీరమల్లు` సినిమాలో పవన్ నటిస్తున్నారు. దీనికి క్రిష్ దర్శకుడు అనే విషయం తెలిసిందే.