మృణాల్ ఠాకూర్ పెళ్లి..! లావణ్య త్రిపాఠి తర్వాత క్రేజీ హీరోయిన్ కు మెగా ప్రొడ్యూసర్ ఆశీర్వాదం..
పెద్దలు ఏదీ మాట్లాడినా ఆచితూచీ మాట్లాడుతుంటారు.. కొన్ని సందర్భాల్లో అవి నిజం కూడా అవుతుంటాయి. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ పెళ్లిపై మెగా ప్రొడ్యూసర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది.
మరాఠి ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ‘సీతారామం’ సినిమాతో నటిగా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. తన బ్యూటీఫుల్ పెర్ఫామెన్స్ తో చిత్ర పరిశ్రమలోని దర్శకనిర్మాతలనూ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఇక్కడే ఆఫర్లు అందుకుంటోంది. వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో మున్ముందు టాలీవుడ్ లోనే మరిన్ని చిత్రాలతో బిజీ కానుందని తెలుస్తోంది. అయితే, తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి వార్త నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది. ఇందుకు రీజన్ కూడా లేకపోలేదు. టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన కామెంట్లే అందుకు ప్రధాన కారణం అయ్యింది.
తాజాగా సైమా అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ హీరోయిన్ గా బెస్ట్ యాక్టర్ గా అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును ప్రముఖ నిర్మాత Allu Aravind చేతుల మీదుగా అందుకుంది.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడారు. ‘మృణాల్ ఠాకూర్ కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలి. హైదరాబాద్ కుర్రాడితోనే ఆమె మ్యారేజ్ జరగాలని ఆశీర్వదించాడు. ఆమె హైదరాబాద్ లోనే స్థిరపడాలని కోరుకుంటున్నట్టు సైమా వేదికపై వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ మాటలు హాట్ టాపిక్ గ్గా మారాయి.
గతంలో యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ.. నీకు హైదరాబాద్ కుర్రాడితోనే పెళ్లిజరగాలని కోరుకుంటున్నారు. ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకోమంటూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అల్లు అరవింద్ చెప్పినట్టుగానే లావణ్య పెళ్లి నవంబర్ 1న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో జరగబోతోంది. ఆయన మాటలు నిజం కావడంతో అంతా షాక్ అయ్యారు.
ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా హైదరాబాద్ కుర్రాడినే పెళ్లి చేసుకోవాలని ఆశీర్వదించడం ఆసక్తికరంగా మారింది. మరీ మెగా ప్రొడ్యూసర్ మాటలు ఏమేరకు వాస్తవంగా మారుతాయో చూడాలని అంటున్నారు. మొత్తానికి అల్లు అరవింద్ మాటలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మృణాల్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.