MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • కొరియా అధ్యక్షుడితో పవన్ కళ్యాణ్ హీరోయిన్.. రాష్ట్రపతి భవన్‌ లో ప్రియాంక మోహన్ డిన్నర్

కొరియా అధ్యక్షుడితో పవన్ కళ్యాణ్ హీరోయిన్.. రాష్ట్రపతి భవన్‌ లో ప్రియాంక మోహన్ డిన్నర్

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో ఓ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 'మేడ్ ఇన్ కొరియా' నటి, పవన్ కళ్యాణ్ హీరోయిన్  ప్రియాంక మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 22 2026, 09:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
రాష్ట్రపతి భవనంలో ప్రియాంక మోహన్
Image Credit : Instagram

రాష్ట్రపతి భవనంలో ప్రియాంక మోహన్

నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'మేడ్ ఇన్ కొరియా' అనే సౌత్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హృదయానికి హత్తుకునే కథ, విభిన్న సంస్కృతుల నేపథ్యంతో ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌తో హీరోయిన్ ప్రియాంక మోహన్‌కు రాష్ట్రపతి భవన్ నుంచి స్పెషల్ విందుకు ఆహ్వానం అందింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మేడ్ ఇన్ కొరియా మూవీ టీమ్ కు ఆహ్వానం..
Image Credit : Instagram

మేడ్ ఇన్ కొరియా మూవీ టీమ్ కు ఆహ్వానం..

ఏప్రిల్ 20, సోమవారం రోజున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌కు రాష్ట్రపతి భవన్‌లో స్వాగతం పలికారు. ఆయన గౌరవార్థం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారితో పాటు 'మేడ్ ఇన్ కొరియా' చిత్ర బృందానికి కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది.
37
మేడ్ ఇన్ కొరియా మూవీ బ్యాక్ గ్రౌండ్..
Image Credit : Instagram

మేడ్ ఇన్ కొరియా మూవీ బ్యాక్ గ్రౌండ్..

రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై శ్రీనిధి సాగర్ ఈ 'మేడ్ ఇన్ కొరియా' సినిమాను నిర్మించారు. రా. కార్తీక్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, దక్షిణ కొరియా నటులు పార్క్ హై-జిన్, నో హో-జిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రెండు విభిన్న సంస్కృతులను కలిపే అందమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.
47
ప్రియాంక మోహన్ స్పెషల్ పోస్ట్..
Image Credit : Instagram

ప్రియాంక మోహన్ స్పెషల్ పోస్ట్..

ఈ విందు గురించి ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో స్పందించారు. 'రాష్ట్రపతి భవన్‌లో అద్భుతమైన సాయంత్రం. గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారు, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ గారి సమక్షంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను' అని ఆమె రాసుకొచ్చారు.
57
మా సినిమా బాగుందని మెచ్చుకున్నారు..
Image Credit : Instagram

మా సినిమా బాగుందని మెచ్చుకున్నారు..

'ఇంత గొప్ప వ్యక్తుల మధ్య ఉండటం, వారితో మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం. ఇంతటి గౌరవనీయ నాయకులతో కలిసి భోజనం చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉంది. వారు మా 'మేడ్ ఇన్ కొరియా' చిత్రాన్ని కూడా మెచ్చుకున్నారు' అని ప్రియాంక తన పోస్టులో తెలిపారు.
67
ఏదో సాధించాననే భావన ,,
Image Credit : Instagram

ఏదో సాధించాననే భావన ,,

'శశి థరూర్‌ను కలవడం, ఆయనతో మాట్లాడటం అద్భుతంగా అనిపించింది. ఈ రోజు నాలో ఏదో సాధించాననే భావన కలుగుతోంది. ఏళ్ల నాటి కలలు, కష్టం, నమ్మకానికి ప్రతిఫలం దక్కిన క్షణం ఇది. ఇలాంటి క్షణాలే మనం చేసే పనిని గుర్తుచేస్తాయి. ఈ ప్రయాణాన్ని ఇంత ప్రత్యేకంగా మార్చిన 'మేడ్ ఇన్ కొరియా' టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని ప్రియాంక పేర్కొన్నారు.
77
 ప్రియాంక మోహన్ మూవీ కెరీర్..
Image Credit : Instagram

ప్రియాంక మోహన్ మూవీ కెరీర్..

 ప్రియాంక మోహన్ 'ఒంత్ కథే హెల్లా' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ,  ఇండస్ట్రీలలో బిజీ నటిగా గుర్తింపు సాధించింది. తెలుగులో నేచురల్ స్టార్ నాని, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఏడేళ్ళ తరువాత తన మాతృభాష కన్నడాలో ఓ సినిమాలో నటించబోతోంది ప్రియాంక. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Jabardasth లోకి నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ.. జడ్జ్ చైర్ పై రష్మి కామెంట్స్ కు మెగా బ్రదర్ షాకింగ్ రిప్లై..
Recommended image2
Allu Arjun ఫోటో వాడుతున్నారా..? తేడా వస్తే ఇక జైలుకే.. ఐకాన్ స్టార్ విషయంలో కోర్టు ఏం చెప్పిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved