చిలుకూరి బాలాజీని దర్శించుకున్న SSMB29 హీరోయిన్.. రాజమౌళి ప్లాన్ ఫాలో అవుతుందా?
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో సందడి చేస్తుంది. ఆమె తాజాగా చిలుకూరి బాలాజీని దర్శించుకుంది. ఆయన ఆశీస్సులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇటీవలే ప్రారంభమైంది. చాలా రహస్యంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు కూడా పాల్గొన్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ ఫైనల్ జరుగుతుందట. ఇందులో హీరోయిన్‌గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో వార్తలు రావడమే కాదు, ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చేసింది. ఆమె గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె దైవ దర్శనంలో బిజీగా ఉంది. ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయింది.
తాజాగా ఆమె చిలుకూరి బాలాజీని దర్శించుకుంది. చిలుకూరి బాలాజీ టెంపుల్‌ని సందర్శించి వీసాల దేవుడు బాలాజీ ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా దిగిన ప్రియాంక చోప్రా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిలుకూరి బాలాజీ టెంపుల్ నిర్వాహకులు ఆమెని సత్కరించారు. ఇందులో ఆమె సాంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. ట్రెండీ లుక్‌తో మతిపోగొట్టే ప్రియాంక చోప్రా ఇలా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు హ్యాపీ అవుతున్నాయి.
అయితే ఆమె హైదరాబాద్ లో సందడి చేయడంతో మహేష్ సినిమా కోసమే వచ్చిందనే ప్రచారం ఊపందుకుంది. కానీ ఇందులో తాను హీరోయిన్ అనే విషయం టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. కొంత వర్క్ షాప్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా పాత్ర గురించి ఆమెకి చెప్పడంతోపాటు లుక్ టెస్ట్ కూడా చేస్తారని,
పాత్రకి ఎలాంటి లుక్‌లో కనిపిస్తే బాగుంటుందనే దాన్ని ఫైనల్ చేయబోతున్నారట. అదే సమయంలో ప్రియాంక చోప్రా పాత్ర గురించి డిస్కషన్ కూడా జరుగుతుందని, కొంత వర్క్ షాప్ కూడా ఉంటుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ అనే వార్తనే మూవీపై హైప్‌ని పెంచుతుంది. అయితే ఒకసారి రాజమౌళి సినిమా ప్రారంభమైందంటే ఆయన చేసే ప్రతిదీ ప్రమోషనల్‌గానే ఉంటుంది.
ఇప్పుడు ప్రియాంకతో ఆ ప్లాన్ స్టార్ట్ చేశారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో మహేష్ ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇందులో పాన్ ఇండియా ఆర్టిస్ట్ లతోపాటు ఇంటర్నేషనల్ యాక్టర్స్ కూడా కనిపిస్తారని సమాచారం.
ఇక ప్రియాంక చోప్రా ఇండియాలో సినిమాలు చేసి చాలా రోజులవుతుంది. ఆమె బాలీవుడ్ హీరోయిన్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. `మేరీకోమ్`తో ఆమె ఇండియన్ సినిమాని షేక్ చేసింది. `క్వాంటికో` సిరీస్ కోసం అమెరికా వెళ్లిన ఆమె ఇక అక్కడే వరుసగా సినిమాలు చేసింది. `బేవాచ్` మూవీలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.
చివరగా ఆమె `టైగర్` అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ లో యాక్ట్ చేసింది. అలాగే `లవ్ ఎగైన్` అనే సినిమా చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో `హెడ్స్ ఆఫ్ స్టేట్`, `ది బ్లఫ్` చిత్రాలు చేస్తుంది. చివరగా ఆమె `ది వైట్ టైగర్` అనే హిందీ సినిమాలో నటించింది. ఇది 2021లో వచ్చింది.
read more: రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా నుంచి గూస్ బంమ్స్ అప్‌డేట్.. RC16 స్టోరీలో కీలక పాయింట్ లీక్?