ఇలాంటి డ్రెస్ వేస్తే మంచి ఫిగర్ ఎలా అవుతుంది.. నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన ప్రియాంకచోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల ఓ డిఫరెంట్ డ్రెస్ ధరించి పోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అది వైరల్ అయ్యింది. వైరల్‌తోపాటు నెటిజన్ల కామెంట్లకి, ప్రశ్నలకు గురయ్యింది. అయితే తనని ప్రశ్నించిన ఓ నెటిజన్‌కి మాత్రం ప్రియాంక దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
స్టార్ హీరోయిన్లు ట్రోల్‌కి గురి కావడం సర్వసాధారణం. డిఫరెంట్ డ్రెస్సులు ధరించినప్పుడు, పొట్టి డ్రెస్సులు వేసుకున్నప్పుడు, లేదా విచిత్రమైన పని ఏదైనా చేసినప్పుడు అభిమానులు, నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంటారు. దీనిపై హీరోయిన్లు కొన్నిసార్లు ఘాటుగానే స్పందిస్తారు. మరికొన్ని సార్లు లైట్ తీసుకుంటారు. ప్రియాంక చోప్రా లైట్ తీసుకోలేదు. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్న ప్రియాంక బాలీవుడ్‌లో కంటే హాలీవుడ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అక్కడ దాదాపు మూడు ప్రాజెక్ట్ లు చేస్తుంది.
ఇదిలా ఉంటే ఇటీవల బ్లూ కలర్ విత్ బ్లాక్ డాట్‌తో కూడిన ఓ డ్రెస్ ధరించింది ప్రియాంక. ఇది గుమ్మడి కాయని, పుచ్చకాయని పోలినట్టుంది.
నిజంగానే ప్రియాంక ధరించిన డ్రెస్ కాస్త డిఫరెంట్‌గా ఉంది. దీన్ని ప్రియాంక అభిమానులు ప్రశంసించగా, కొందరు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
`మేడమ్.. అది నిజంగానే డ్రెస్సా? అలాంటిది వేసుకుంటే ఇక మంచి ఫిగర్ ఉన్నా అర్థం లేనట్టే కాదా?` అని ప్రశ్నించారు. దీంతో ప్రియాంకకి బాగానే మండింది.
గట్టిగానే కౌంటర్ పోస్ట్ పెట్టింది. `ఫిగర్ అనేది విషయం కాదని చెప్పడమే ఇక్కడ పాయింట్` అని రిప్లై ఇచ్చింది. దీంతో ఆ సదరు నెటిజన్ ఒక్క దెబ్బకే సైలెంట్ అయిపోయాడు.
ఇది చూసిన ప్రియాంక అభిమానులు ఆమెని ప్రశంసించారు. అదే సమయంలో ఆ సదరు నెటిజన్‌పై విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడమే కాదు, తెగ వైరల్ అవుతుంది.
ఇదిలాఉంటే తన మెమరీస్, తన జర్నీని పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది ప్రియాంక. `అన్‌ఫినిష్డ్` పేరుతో ఓ పుస్తకాన్ని రాసి ముద్రించింది.
`ప్రియాంక చోప్రాః అన్‌ఫినిష్డ్` పేరుతో ప్రచురితమైన ఈ పుస్తకం ఈ నెల 9న విడుదలై బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఆన్‌లైన్‌లో బెస్ట్ సెల్టర్‌గా తన పుస్తకం నిలవడంపై ప్రియాంక ఆనందం వ్యక్తం చేసింది.
ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో తన భర్త నిక్ జోనాస్ కూడా తనకు ఎంతగానో సహయపడ్డారని తెలిపింది ప్రియాంక.
ఇటీవల `ది వైట్ టైగర్` అనే అమెరికన్ డ్రామా సినిమాలో నటించి మెప్పించింది ప్రియాంక. ఇందులో బోల్డ్ రోల్‌లో నటించింది. రాజ్‌కుమార్‌రావుతో రొమాన్స్ చేసింది.
ప్రస్తుతం `మ్యాట్రిక్స్`, `టెక్ట్స్ ఫర్ యు` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. హిందీ సినిమాలను పక్కన పెట్టేసినట్టే కనిపిస్తుంది.