- Home
- Entertainment
- ఆ డైరెక్టర్ నా లోదుస్తులు చూడాలన్నాడు.. అతడి ఉద్దేశం అదే, ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు
ఆ డైరెక్టర్ నా లోదుస్తులు చూడాలన్నాడు.. అతడి ఉద్దేశం అదే, ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు
ప్రియాంక చోప్రా.. ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేస్తోంది.

ప్రియాంక చోప్రా.. ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేస్తోంది. హాలీవుడ్ అభిమానులని సైతం తన అందంతో సమ్మోహనపరుస్తోంది.
ఈ మాజీ విశ్వ సుందరి అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. 40 ఏళ్ల వయసులో ప్రియాంక చెక్కు చెదరని ఒంపులతో ఆకర్షిస్తోంది. బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా రాణించిన తర్వాత ప్రియాంక హాలీవుడ్ బాట పట్టింది.
తన భర్త నిక్ జోనస్ తో ప్రేమాయణం మొదలు పెట్టాక ప్రియాంక కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. నిక్ తో ఎఫైర్ మొదలైనప్పటి నుంచి ప్రియాంకకు హాలీవుడ్ లో పరిచయాలు బాగా పెరిగాయి. ఫలితంగా హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా జోరు మామూలుగా లేదు. వెబ్ సిరీస్ లు, హాలీవుడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా ప్రియాంక నటించిన సిటాడెల్ విడుదలయింది. లవ్ ఎగైన్ అనే చిత్రం కూడా విడుదలై సక్సెస్ సాధించింది. రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
హీరోయిన్లు తరచుగా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదుర్కొంటుంటారు. ప్రియాంక చోప్రా కి కూడా ఆ బాధ తప్పలేదట. ఓ బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నప్పుడు దర్శకుడి నుంచి ఆమె అసభ్యకరమైన సంఘటన ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఆ చిత్రంలో నాది అండర్ కవర్ రోల్. కాబట్టి ఒక వ్యక్తిని మాయ చేసి పట్టుకునేందుకు అతడిని శృంగార పరంగా రెచ్చగొట్టాలి.
ఈ సీన్ కోసం తాను ధరించిన దుస్తుల్లో ఒక పీస్ తీసేసి అతడిని రెచ్చగొట్టేలా నటిస్తే సరిపోతుంది అనుకున్నా. ఆ విధంగానే కాస్ట్యూమ్స్ తో సీన్ కి రెడీ అయ్యా. కానీ దర్శకుడు దానికి అంగీకరించలేదు. నేను ఆమె లోదుస్తులు అండర్ వేర్ చూడాలి అంటూ వల్గర్ కామెంట్స్ చేశారట. ఆమె అండర్ వేర్ చూపించకుండా సినిమా ఇంకెవరు చూస్తారు.. ఆ విధంగా కాస్యూమ్స్ రెడీ చేయండి అని తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా స్టయిలిష్ట్ కి ఆర్డర్ వేశారు.
దర్శకుడి తీరు నచ్చకపోవడంతో తాను ఆ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రియాంక చోప్రా తెలిపింది. ఆ దర్శకుడి పేరు చెప్పడానికి పీసీ ఇష్టపడలేదు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది.